అక్షయ నవమి వ్రత కథ.. శివకేశవులకు ప్రీతిపాత్రమైన ఉసిరి చెట్టు గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

కార్తీక మాసంలో వచ్చే అక్షయ నవమికి హిందూ సనాతన ధర్మంలో ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఈ రోజున ఉసిరి చెట్టును పూజించడం, దానధర్మాలు చేయడం వల్ల అక్షయమైన పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ ఏడాది రవియోగం ఏర్పడటం ఈ పర్వదినానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. 

Published on: Nov 18, 2026, 09:30:57 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

హిందూ సనాతన ధర్మంలో కార్తీక మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో వచ్చే పర్వదినాలలో 'అక్షయ నవమి' అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ ఏడాది నవమి పర్వదినాన ప్రత్యేకంగా 'రవియోగం' ఏర్పడటం దీని విశిష్టతను మరింత పెంచుతోంది. ఈ రోజున ఉసిరి చెట్టును పూజించి, దానధర్మాలు చేయడం ద్వారా అక్షయమైన పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం.

అక్షయ నవమి వ్రత కథ.. శివకేశవులకు ప్రీతిపాత్రమైన ఉసిరి చెట్టు గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
అక్షయ నవమి వ్రత కథ.. శివకేశవులకు ప్రీతిపాత్రమైన ఉసిరి చెట్టు గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

పూజా విధానం - ఆచరించాల్సిన పద్ధతులు

ఈ నవమి రోజున తెల్లవారుజామునే తలస్నానం చేసి, ఉసిరి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించాలి.

ముందుగా ఉసిరి చెట్టు మొదట పచ్చి పాలు, ఆ తర్వాత జలంతో అభిషేకం చేయాలి. అనంతరం పసుపు, కుంకుమ, అక్షతలతో పూజించి, చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి.

ప్రదక్షిణలు చేసే సమయంలో చేతిలో పూలు లేదా అక్షతలు ఉంచుకుని, ప్రతి ప్రదక్షిణకు వాటిని సమర్పించడం ఆచారం.

ఈ చెట్టు నీడలోనే కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పర్వదినాన ఉసిరి కాయలను దానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.

పద్మ, స్కంద పురాణాల్లో ప్రస్తావన

ఉసిరి చెట్టు ఆవిర్భావం గురించి పద్మ పురాణం, స్కంద పురాణాలలో రెండు ప్రముఖ కథలు ప్రస్తావించబడి ఉన్నాయి. సముద్ర మథనం సమయంలో అమృతం బిందువులు భూమిపై పడటం వల్ల ఉసిరి చెట్లు ఉద్భవించాయని కొందరు నమ్ముతుండగా.. బ్రహ్మదేవుని కన్నీటి బిందువుల నుంచి ఈ వృక్షం పుట్టిందని పద్మ పురాణంలో ఉంది.

లక్ష్మీదేవి పూజ వెనుక ఉన్న ఆసక్తికర కథ

మరో పౌరాణిక గాథ ప్రకారం, ఒకసారి లోక కళ్యాణార్ధం భూమిపైకి వచ్చిన లక్ష్మీదేవి.. ఏకకాలంలో శివకేశవులను (విష్ణుమూర్తి, శివుడు) ఇద్దరినీ ఎలా పూజించాలనే దానిపై ఆలోచించింది. విష్ణువుకు తులసి, శివునికి బిల్వపత్రం ప్రీతిపాత్రమైనవి. ఈ రెండు లక్షణాలు ఏ చెట్టులో కనిపిస్తాయా అని వెతకగా.. శ్రీహరి, శివుడు ఇద్దరూ నివసించే ఉసిరి చెట్టు ఆమెకు కనిపించింది.

అదే రోజు లక్ష్మీదేవి ఉసిరి చెట్టు మూలాన విష్ణు, శివులను ఆరాధించింది. ఆమె భక్తికి మెచ్చి ప్రత్యక్షమైన ఆ దేవుళ్లకు అదే చెట్టు కింద భోజనం పెట్టి, ఆ తర్వాత తాను ప్రసాదంగా స్వీకరించింది. ఆనాటి నుంచే ఈ 'అక్షయ నవమి'ని జరుపుకుంటున్నారని ఇతిహాసాలు చెబుతున్నాయి.

ఆరోగ్యాభివృద్ధికి ఉసిరి సంజీవని

ఆధ్యాత్మికంగానే కాకుండా, ఆయుర్వేదంలో ఉసిరికాయను ఒక అద్భుతమైన ఔషధంగా పేర్కొన్నారు. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇది అగ్రగామిగా నిలుస్తుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More