...
...
Next Story

అక్షయ తృతీయ నాడు అరుదైన 'అక్షయ యోగం': ఈ 4 రాశుల వారికి ఇక తిరుగుండదు.. డబ్బే డబ్బు!

ఏప్రిల్ 19న అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత అరుదైన, శక్తివంతమైన 'అక్షయ యోగం' కలవబోతోంది. సూర్య, చంద్రుల కలయికతో ఏర్పడే ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారి జాతకం పూర్తిగా మారిపోనుంది. ఆ అదృష్ట రాశుల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Published on: Apr 10, 2026, 14:00:53 IST
Advertisement

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్షయ యోగం అనేది చాలా శుభప్రదమైన యోగం. అరుదుగా ఏర్పడుతుంది. ఇది సూర్య, చంద్రుల వలన ఏర్పడే శక్తివంతమైన యోగం. జ్యోతిష్య లెక్కల ప్రకారం చూసినట్లయితే, ఈ ప్రత్యేకమైన యోగం ఏప్రిల్ 19న ఏర్పడనుంది. ఆరోజు అక్షయ తృతీయ కూడా.

అక్షయ తృతీయ నాడు అరుదైన అక్షయ యోగం (pinterest)
అక్షయ తృతీయ నాడు అరుదైన అక్షయ యోగం (pinterest)

అక్షయ తృతీయ నాడు సూర్యుడు మేష రాశిలో, చంద్రుడు వృషభ రాశిలో ఉంటారు. ఇలా ఈ రెండు గ్రహాలు సంచారం చేయడంతో అక్షయ యోగం ఏర్పడుతుంది. ఇది డబ్బు, సంతోషం, సంపద వంటి వాటిని తీసుకొస్తుంది. ఈ అక్షయ యోగం కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలను తీసుకు రానుంది. మరి అదృష్ట రాశులు ఎవరు? వీరులో మీరు ఒకరేమో చూసుకోండి.

ఏప్రిల్ 19న అక్షయ యోగం.. నాలుగు రాశుల వారికి ఊహించని లాభాలు

1.మేష రాశి:

మేష రాశి వారికి ఈ యోగం శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రమోషన్లు వస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు ఆర్థిక పరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. చక్కటి ఫలితాలను చూస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా బాగా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ సమయంలో ముఖ్య పనులు విజయవంతంగా పూర్తవుతాయి.

2.సింహ రాశి:

సింహ రాశి వారికి అక్షయ యోగం కొత్త అవకాశాలను తీసుకొస్తుంది. అదృష్టం పెరుగుతుంది. పెండింగ్‌లో ఉన్న టాస్కులు పూర్తవుతాయి. ప్రభుత్వం, ప్రైవేట్ రంగాల్లో ఉన్న వారు మంచి మార్పులను చూస్తారు. ఈ సమయంలో వ్యాపారస్తులకు కూడా అద్భుతంగా కలిసి వస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. శుభ ఫలితాలు కూడా కలుగుతాయి.

3.వృషభ రాశి:

వృశ్చిక రాశి వారి ఆదాయం పెరుగుతుంది. ఈ రాశి వారికి అక్షయ యోగంతో సమస్యలు తొలగి పోతాయి. పూర్వీకుల నుంచి ఆస్తులను పొందుతారు. పాత ఇన్వెస్ట్మెంట్లతో బాగా కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఇది శుభ సమయం. ఉద్యోగస్తుల జీవితం మెరుగుపడుతుంది. కొత్త అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks