ప్రతీ ఏటా హనుమాన్ జయంతిని ఎందుకు రెండు సార్లు జరుపుకుంటాము? అప్పులు, బాధలు తొలగిపోవాలంటే రేపు ఇలా చేసి చూడండి!
హనుమాన్ జయంతి నాడు హనుమంతుని భక్తులతో ఆరాధించడం వలన హనుమంతుని అనుగ్రహం కలిగి ఆనందంగా ఉండవచ్చు. హనుమంతుడు కష్టాలను, బాధలను, దుఃఖాలను తొలగిస్తాడు. అందుకే ఆయనను సంకట మోచనుడు అని పిలుస్తారు. హనుమంతుడు చిరంజీవి. ప్రతీ ఏటా హనుమాన్ జయంతిని ఎందుకు 2 సార్లు జరుపుకుంటాము?
రేపే హనుమాన్ జయంతి. ప్రతి ఏటా రెండు సార్లు మనం హనుమాన్ జయంతిని జరుపుకుంటాము. హనుమాన్ జయంతి నాడు హనుమంతుని భక్తులతో ఆరాధించడం వలన హనుమంతుని అనుగ్రహం కలిగి ఆనందంగా ఉండవచ్చు. హనుమంతుడు కష్టాలను, బాధలను, దుఃఖాలను తొలగిస్తాడు. అందుకే ఆయనను సంకట మోచనుడు అని పిలుస్తారు. హనుమంతుడు చిరంజీవి.

అందుకనే కలియుగంలో భూమిపై ఇప్పటికీ నివసించే ఏకైక దేవుడు హనుమంతుడు అని భక్తులు నమ్ముతారు. హనుమాన్ జయంతి నాడు హనుమంతుడికి ప్రత్యేక పూజలు జరుపుతారు. భక్తి శ్రద్ధలతో హనుమాన్‌ను పూజిస్తారు.ఇక హనుమాన్ జయంతిని ఏడాదికి రెండుసార్లు ఎందుకు జరుపుకుంటారు? దాని వెనుక కారణం ఏంటి? అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హనుమాన్ జయంతిని ఎందుకు ఏడాదిలో రెండు సార్లు జరుపుకుంటాము?
ప్రతి సంవత్సరం రెండుసార్లు హనుమాన్ జయంతిని జరుపుకుంటాము. ఒకటి చైత్ర పౌర్ణమి నాడు. ఈసారి చైత్ర పౌర్ణమి రోజు జరుపుకునే హనుమాన్ జయంతి ఏప్రిల్ 2 అనగా రేపు వచ్చింది. అలాగే మరొకసారి హనుమాన్ జయంతిని కార్తీక కృష్ణ చతుర్దశి నాడు జరుపుకుంటాము. ఒకటి హనుమాన్ జన్మకు సంబంధించినది, ఇంకొకటి స్పృహ కోల్పోయిన హనుమంతుడు తిరిగి జీవించడానికి సంబంధించినది.
మరొకటి కార్తీక మాసం కృష్ణపక్ష చతుర్దశి స్వాతి నక్షత్రంలో హనుమంతుడు జన్మించాడని వాల్మీకి రామాయణం ద్వారా తెలుస్తోంది. ఆ రోజును హనుమాన్ అవతార ఉత్సవంగా జరుపుతారు. హనుమంతుడి విజయ అభినందన మహోత్సవాన్ని చైత్ర మాసం శుక్లపక్ష పౌర్ణమి నాడు జరుపుతాము. చైత్ర పౌర్ణమి నాడు హనుమంతుడికి రెండవ జన్మ లభించింది. అందుకని ఆ రోజున హనుమాన్ జయంతిగా జరుపుకుంటాము.
హనుమాన్ జయంతి కథ:
పురాణాల ప్రకారం చూసినట్లయితే, ఒకసారి హనుమంతుడికి చాలా ఆకలి వేసింది. సూర్యుడిని ఒక పండు అనుకుని తినడానికి పరిగెత్తాడు. దేవేంద్రుడు ఆపడానికి ప్రయత్నించినప్పుడు సూర్యుడిపై దాడి చేశాడు. అలా బాల హనుమాన్ స్పృహను కోల్పోయాడు. తన వరంతో పుట్టిన హనుమంతుడిని చూసి పవనుడికి కోపం వచ్చి గాలిని ఆపాడు. దీంతో విశ్వంలో సంక్షోభ పరిస్థితి ఏర్పడింది. దేవతలందరూ హనుమంతుడికి రెండవ జన్మను ఇచ్చారు. అదే చైత్ర పౌర్ణమి రోజు. అందుకని ఆ రోజును హనుమాన్ జయంతిగా జరుపుకుంటాము.
హనుమాన్ జయంతి నాడు ఇలా చేస్తే అప్పులు, బాధలు తొలగిపోతాయి:
హనుమాన్ జయంతి నాడు హనుమంతుని సింధూరంతో పూజిస్తే మంచిది. అరటి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబంలో గొడవలు, శత్రు బాధలు వంటివి తొలగిపోవాలంటే హనుమాన్ జయంతి నాడు హనుమంతుడిని భక్తితో ఆరాధించండి.
సుందరకాండలో లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
“ఓం హం హనుమతే నమః” అనే మంత్రాన్ని కనీసం 21 సార్లు పఠించండి.
ఉదయం తమలపాకులను సమర్పించి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించండి. మధ్యాహ్నం హనుమంతుడికి గంధంతో పూజ చేసి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి. సాయంత్రం సింధూరంతో పూజించి అరటి పండ్లను నైవేద్యంగా పెట్టండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


