అక్షయ తృతీయ అంటే మొట్టమొదట అందరికీ గుర్తొచ్చేది బంగారాన్ని కొనుగోలు చేయడం. అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. అలాగే జీవితంలో సంతోషం, సంపద కూడా పెరుగుతాయని భావిస్తారు. అందుకే అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి వంటి వాటిని కొనుగోలు చేస్తారు. అయితే ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో వాటిని కొనుగోలు చేయడం అసాధ్యం. అలాంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి తక్కువ ఖర్చుతో వీటిని కొనుగోలు చేయొచ్చు. ఇవి ధర తక్కువ అయినప్పటికీ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పూర్తిగా పొందడానికి వీలవుతుంది. మరి అక్షయ తృతీయ నాడు వేటితో లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు, సంపద సంతోషాన్ని ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
అక్షయ తృతీయకి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే తక్కువ ఖర్చుతో వీటిని కొనుగోలు చేస్తే చాలు
1.పసుపు గవ్వలు:
గవ్వలను లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. గవ్వలను కొనుగోలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. వాటికి పసుపు, కుంకుమలు పెట్టి లక్ష్మీదేవి పాదాల వద్ద పెట్టి పూజించండి. ఆ తర్వాత ఎర్రటి వస్త్రంలో చుట్టి బీరువాలో పెట్టండి. ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆనందంగా ఉండొచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.
2.మట్టి కుండ:
మట్టి కుండను అక్షయ తృతీయ నాడు కొనుగోలు చేయడం చాలా మంచిది. కొత్త కుండను కొనుగోలు చేసి అందులో నీరు వేసి దానం చేయడం వలన సంపద పెరుగుతుంది. జీవితంలో సక్సెస్‌ను అందుకోవచ్చు. కెరీర్‌లో కూడా మంచి ఫలితాలను చూడొచ్చు.
3.బియ్యం:
అక్షయ తృతీయ నాడు బియ్యం ఇంటికి తీసుకొస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. బియ్యాన్ని అన్నపూర్ణాదేవిగా భావిస్తారు. అలాంటి బియ్యాన్ని ఆ రోజున ఇంటికి తీసుకు రావడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.
4.తులసి మొక్క:
{{/usCountry}}అక్షయ తృతీయ నాడు బియ్యం ఇంటికి తీసుకొస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. బియ్యాన్ని అన్నపూర్ణాదేవిగా భావిస్తారు. అలాంటి బియ్యాన్ని ఆ రోజున ఇంటికి తీసుకు రావడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.
4.తులసి మొక్క:
{{/usCountry}}ఇంట్లో తులసి మొక్క లేనట్లయితే అక్షయ తృతీయ నాడు తులసి మొక్కను తీసుకురండి. తులసి మొక్క లక్ష్మీదేవితో సమానం. ఇది స్వచ్ఛత, ఆరోగ్యాన్ని అందిస్తుంది. సంపదను పెంచుతుంది. ప్రతీ రోజూ తులసి మొక్క వద్ద దీపం పెడితే లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయి.
5.రాళ్ల ఉప్పు:
చాలా మంది రాళ్ల ఉప్పును పట్టించుకోరు, కానీ ఇది నిజానికి ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని తీసుకొస్తుంది. ఇంటికి తీసుకురండి. ఇది ఇంట్లో శక్తులను సమతుల్యం చేస్తుంది. సంతోషాన్ని పెంచుతుంది.
6.పుస్తకాలు:
పుస్తకాలను సరస్వతి దేవిగా భావిస్తాము. అక్షయ తృతీయ నాడు మీకు కావాల్సిన పుస్తకాలను కొనుగోలు చేయండి. ఇది చాలా శుభప్రదం. జ్ఞానంతో పాటు సంపద కూడా పెరుగుతుంది.
7.చీపురు:
అక్షయ తృతీయ నాడు చీపురును కొనుగోలు చేయడం కూడా శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ఎలా అయితే ధన త్రయోదశి నాడు కొనుగోలు చేస్తామో, అక్షయ తృతీయ నాడు కూడా చీపురును కొనుగోలు చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.
8.పాత్రలు:
వంటగదిలో వాడే పాత్రలను అక్షయ తృతీయ నాడు కొనుగోలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మీకు కావలసిన పాత్రలను కూడా అక్షయ తృతీయ నాడు కొనుగోలు చేసి శుభ ఫలితాలను పొందండి.