ఈ నెలలో 3 శక్తివంతమైన రాజయోగాలు.. 4 రాశులకు కొత్త ప్రాజెక్టులు, ఉద్యోగాలు, విలాసవంతమైన వస్తువులతో పాటు బోలెడు లాభాలు!

ప్రతి నెలా గ్రహాల సంచారంలో అనేక మార్పులను చూస్తూ ఉంటాం. ఏప్రిల్ నెలలో చూసినట్లయితే, ఏకంగా మూడు శక్తివంతమైన యోగాలు ఏర్పడతాయి. ఐదు గ్రహాల సంచారంలో మార్పు రాబోతోంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. ఆదాయం పెరుగుతుంది, విజయాలను అందుకుంటారు. అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. 

Published on: Apr 6, 2026, 12:30:40 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాల కాలానుగుణంగా వాటి రాశులను మార్చడం మనం చూస్తూ ఉంటాం. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తెస్తుంది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, గ్రహాల సంచారంలో మార్పు కొన్నిసార్లు రాజయోగాలను సృష్టిస్తుంది. ఏప్రిల్ నెలలో మూడు ప్రధాన రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. ఇవి చాలా శక్తివంతమైనవి. ఈ రాజయోగాలు 12 రాశుల వారిపై ప్రభావం పడినప్పటికీ, కొన్ని రాశుల వారికి ఊహించని విధంగా లాభాలను తీసుకురానుంది. మరి ఏప్రిల్ నెలలో కలిగే రాజయోగాలు ఏవి, ఏ రాశుల వారికి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.

ఏప్రిల్ నెలలో మూడు శక్తివంతమైన రాజయోగాలు.. ఈ రాశుల వారికి కనీవినీ ఎరుగని విధంగా లాభాలు (pinterest)
ఏప్రిల్ నెలలో మూడు శక్తివంతమైన రాజయోగాలు.. ఈ రాశుల వారికి కనీవినీ ఎరుగని విధంగా లాభాలు (pinterest)

మూడు శక్తివంతమైన రాజయోగాలు

ఏప్రిల్ 2న త్రిగ్రాహి యోగం ఏర్పడిన విషయం తెలిసిందే. కుజ, శని, సూర్య గ్రహాల కలయికతో ఈ యోగం ఏర్పడింది. ఇది కొన్ని రోజుల పాటు ఉంటుంది. ఆ తర్వాత, ఏప్రిల్ 11న బుధుడు కూడా మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. దాంతో సూర్య, బుధ, శుక్ర, శని గ్రహాల కలయికతో చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. అదే విధంగా, సూర్య, బుధ గ్రహాల కలయికతో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. సూర్య, కుజ గ్రహాల కలయికతో కుజ ఆదిత్య రాజయోగం ఏర్పడుతుంది.

ఏప్రిల్ 14న సూర్యుడు మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. ఏప్రిల్ 19న శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. బుధుడు ఏప్రిల్ 30న మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా ఈ ఏప్రిల్ నెలలో ఏర్పడే రాజయోగాలు నాలుగు రాశుల వారికి అనేక విధాలుగా లాభాలను తీసుకు వస్తాయి. ఆ అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

ఏప్రిల్ నెలలో మూడు శక్తివంతమైన రాజయోగాలు.. ఈ రాశుల వారికి కనీవినీ ఎరుగని విధంగా లాభాలు

1.మేష రాశి:

మేష రాశి వారికి ఏప్రిల్ నెల బాగా కలిసి వస్తుంది. కెరీర్‌లో మంచి మార్పులు చూస్తారు. ఉద్యోగస్తుల పని తీరు బాగుంటుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈ సమయంలో ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రశాంతత ఉంటుంది.

2.మిథున రాశి:

మిథున రాశి వారికి ఏప్రిల్ నెలలో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఈ శక్తివంతమైన యోగాల వలన కెరీర్‌లో మంచి మార్పులు చూస్తారు. మొదట చిన్న ప్రారంభాలు కలిసి రాకపోయినా, ముందుకు వెళ్లే కొద్దీ మీకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులను చేపడతారు. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.

3.కుంభ రాశి:

కుంభ రాశి వారికి శుభ సమయం. ఈ నెలలో ఈ రాశి వారి వ్యాపారంలో, కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. కొత్త అవకాశాలను పొందుతారు. కోపాన్ని అదుపులో ఉంచుకుని, సహనంతో ముందుకు వెళ్తే ఈ నెల మీకు అద్భుతంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు.

4.వృషభ రాశి:

వృషభ రాశి వారు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త బాధ్యతలను చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యక్తిగత జీవితం ఆనందంగా ఉంటుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More