చాలా ఏళ్ళ తర్వాత హనుమాన్ జయంతి వేళ శక్తివంతమైన త్రిగ్రాహి యోగం, నాలుగు రాశుల జీవితం మారిపోతుంది!

గ్రహాల సంచారంలో మార్పులు వస్తే, అది ప్రతి రాశిపై ప్రభావాన్ని చూపిస్తుంది. అనేక విధాలుగా మార్పులను తీసుకు వస్తుంది. ఈరోజు చాలా పెద్ద సంయోగం ఏర్పడింది. హనుమాన్ జయంతి వేళ ఇలా మూడు గ్రహాల సంయోగం ఏర్పడడం చాలా విశేషమైనది, అరుదైనది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ హనుమాన్ జయంతిని ఈ అరుదైన యోగం ఏర్పడింది.

Published on: Apr 2, 2026, 13:00:20 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పులు వస్తే, అది ప్రతి రాశిపై ప్రభావాన్ని చూపిస్తుంది. అనేక విధాలుగా మార్పులను తీసుకు వస్తుంది. ఈరోజు చాలా పెద్ద సంయోగం ఏర్పడింది. హనుమాన్ జయంతి వేళ ఇలా మూడు గ్రహాల సంయోగం ఏర్పడడం చాలా విశేషమైనది, అరుదైనది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ హనుమాన్ జయంతిని ఈ అరుదైన యోగం ఏర్పడింది.

చాలా ఏళ్ళ తర్వాత హనుమాన్ జయంతి వేళ శక్తివంతమైన త్రిగ్రాహి యోగం (pinterest)
చాలా ఏళ్ళ తర్వాత హనుమాన్ జయంతి వేళ శక్తివంతమైన త్రిగ్రాహి యోగం (pinterest)

త్రిగ్రాహి యోగం

ఏప్రిల్ 2, అనగా ఈరోజు, కుజుడు మీన రాశిలోకి మధ్యాహ్నం 3:30కి ప్రవేశిస్తాడు. ఇప్పటికే మీనరాశిలో శని, సూర్యుడు ఉన్నారు. ఇప్పుడు కుజుడు కూడా ఈ రాశిలోకి ప్రవేశించడంతో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ త్రిగ్రాహి యోగం ఈరోజు హనుమాన్ జయంతి నుంచి ఏప్రిల్ 14 వరకు ఉంటుంది. ఏప్రిల్ 14న సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు.

అప్పుడు ఈ మూడు గ్రహాల సంయోగం తొలగిపోతుంది. అయితే ఈరోజు త్రిగ్రాహి యోగం ఏర్పడడంతో ఏ రాశుల వారికి లాభాలు కలగబోతున్నాయి? ఏ రాశి వారికి ఏరియాల్లో మంచి మార్పులు వస్తాయి? వైవాహిక జీవితంలో ఎవరికి ఆనందం కలుగుతుంది? వంటి వివరాలను తెలుసుకుందాం. మరి ఈ అదృష్ట రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.

అరుదైన త్రిగ్రాహి యోగం.. నాలుగు రాశుల వారికి డబ్బుతో పాటు ఊహించని మార్పులు:

1.వృషభ రాశి:

వృషభ రాశి వారికి ఈ సమయంలో పురోగతి ఉంటుంది. ఈ రాశి వారు ఈ మూడు గ్రహాల కలయికతో ఏర్పడే త్రిగ్రాహి యోగంతో అనేక విధాలుగా లాభాలను పొందుతారు. ఈ సమయంలో ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. సంతోషం, ప్రశాంతత ఉంటాయి. బడ్జెట్‌ను ఫాలో అయితే కష్టాలు లేకుండా సంతోషంగా ఉండొచ్చు.

2.మిథున రాశి:

మిథున రాశి వారికి ఈ యోగం అద్భుతమైన లాభాలను తీసుకువస్తుంది. కెరీర్‌లో ఊహించని మార్పులను చూస్తారు. పని ప్రదేశంలో ప్రశంసలను పొందుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఇది శుభ సమయం. పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకుంటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడొద్దు.

3.ధనుస్సు రాశి:

ధనుస్సు రాశి వారికి త్రిగ్రాహి యోగం అనేక విధాలుగా లాభాలను తీసుకువస్తుంది. కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. పెండింగ్‌లో ఉన్న టాస్కులను పూర్తిచేస్తారు. ఆర్థికపరంగా బాగుంటుంది. ఇల్లు లేదా భూమిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉండకండి. సంతోషంగా ఉంటారు.

4.తులా రాశి:

తులా రాశి వారికి ఇది శుభ సమయం. ఈ యోగంతో అనేక విధాలుగా మార్పులు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. సింగిల్‌గా ఉన్నవారు జీవిత భాగస్వామిని పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన టాస్కులను పూర్తి చేస్తారు. అదృష్టం కూడా మీ వైపు ఉంటుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More