అక్షయ తృతీయ 2026: వేలు, లక్షలు పెట్టి వెండి, బంగారం కొనక్కర్లేదు.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం యాభై రూపాయలతో ఇవైనా చాలు!
అక్షయ తృతీయ 2026: అక్షయ తృతీయ వస్తోంది అంటే బంగారం కొనుగోలు చేయాలని చాలా మంది భావిస్తారు. కానీ ఇప్పుడు కొనే పరిస్థితి లేదు. వేలు, లక్షలు పెట్టి వెండి, బంగారాన్ని కొనుగోలు చేస్తేనే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనేది నిజం కాదు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే తక్కువ ఖర్చుతో వీటిని కొన్నా సరిపోతుంది.
అక్షయ తృతీయ అంటే మొట్టమొదట అందరికీ గుర్తొచ్చేది బంగారాన్ని కొనుగోలు చేయడం. అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. అలాగే జీవితంలో సంతోషం, సంపద కూడా పెరుగుతాయని భావిస్తారు. అందుకే అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి వంటి వాటిని కొనుగోలు చేస్తారు. అయితే ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో వాటిని కొనుగోలు చేయడం అసాధ్యం. అలాంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి తక్కువ ఖర్చుతో వీటిని కొనుగోలు చేయొచ్చు. ఇవి ధర తక్కువ అయినప్పటికీ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పూర్తిగా పొందడానికి వీలవుతుంది. మరి అక్షయ తృతీయ నాడు వేటితో లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు, సంపద సంతోషాన్ని ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
అక్షయ తృతీయకి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే తక్కువ ఖర్చుతో వీటిని కొనుగోలు చేస్తే చాలు
1.పసుపు గవ్వలు:
గవ్వలను లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. గవ్వలను కొనుగోలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. వాటికి పసుపు, కుంకుమలు పెట్టి లక్ష్మీదేవి పాదాల వద్ద పెట్టి పూజించండి. ఆ తర్వాత ఎర్రటి వస్త్రంలో చుట్టి బీరువాలో పెట్టండి. ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆనందంగా ఉండొచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.
2.మట్టి కుండ:
మట్టి కుండను అక్షయ తృతీయ నాడు కొనుగోలు చేయడం చాలా మంచిది. కొత్త కుండను కొనుగోలు చేసి అందులో నీరు వేసి దానం చేయడం వలన సంపద పెరుగుతుంది. జీవితంలో సక్సెస్‌ను అందుకోవచ్చు. కెరీర్‌లో కూడా మంచి ఫలితాలను చూడొచ్చు.
3.బియ్యం:
అక్షయ తృతీయ నాడు బియ్యం ఇంటికి తీసుకొస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. బియ్యాన్ని అన్నపూర్ణాదేవిగా భావిస్తారు. అలాంటి బియ్యాన్ని ఆ రోజున ఇంటికి తీసుకు రావడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.
4.తులసి మొక్క:
ఇంట్లో తులసి మొక్క లేనట్లయితే అక్షయ తృతీయ నాడు తులసి మొక్కను తీసుకురండి. తులసి మొక్క లక్ష్మీదేవితో సమానం. ఇది స్వచ్ఛత, ఆరోగ్యాన్ని అందిస్తుంది. సంపదను పెంచుతుంది. ప్రతీ రోజూ తులసి మొక్క వద్ద దీపం పెడితే లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయి.
5.రాళ్ల ఉప్పు:
చాలా మంది రాళ్ల ఉప్పును పట్టించుకోరు, కానీ ఇది నిజానికి ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని తీసుకొస్తుంది. ఇంటికి తీసుకురండి. ఇది ఇంట్లో శక్తులను సమతుల్యం చేస్తుంది. సంతోషాన్ని పెంచుతుంది.
6.పుస్తకాలు:
పుస్తకాలను సరస్వతి దేవిగా భావిస్తాము. అక్షయ తృతీయ నాడు మీకు కావాల్సిన పుస్తకాలను కొనుగోలు చేయండి. ఇది చాలా శుభప్రదం. జ్ఞానంతో పాటు సంపద కూడా పెరుగుతుంది.
7.చీపురు:
అక్షయ తృతీయ నాడు చీపురును కొనుగోలు చేయడం కూడా శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ఎలా అయితే ధన త్రయోదశి నాడు కొనుగోలు చేస్తామో, అక్షయ తృతీయ నాడు కూడా చీపురును కొనుగోలు చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.
8.పాత్రలు:
వంటగదిలో వాడే పాత్రలను అక్షయ తృతీయ నాడు కొనుగోలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మీకు కావలసిన పాత్రలను కూడా అక్షయ తృతీయ నాడు కొనుగోలు చేసి శుభ ఫలితాలను పొందండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


