...
...
Next Story

ఇంట్లో పాత బట్టలు ఎక్కడ ఉంచాలి? ఏ దిశలో పెట్టాలి? వాస్తు నియమాలు ఇవే!

వాస్తు నమ్మకాల ప్రకారం ఇంట్లో ఎక్కువకాలం పాత, అనవసరమైన, చిరిగిపోయిన వస్తువులను నిల్వ చేయడం వల్ల ప్రతికూల శక్తి పెరిగే అవకాశం ఉందని భావిస్తారు. ముఖ్యంగా పాత బట్టలను స్టోర్‌రూమ్, మంచం కింద లేదా అటకలపై పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరమైనవి, అవసరం లేనివిగా వేరు చేయడం మంచిదని సూచిస్తున్నారు.

Published on: Sep 17, 2026, 08:00:14 IST
Advertisement

వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. చాలా మంది వాస్తు నియమాలను పాటిస్తారు. అయితే మనం తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాము. ముఖ్యంగా బట్టల విషయంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము. అనవసరంగా ఇంట్లో బట్టలు ఎక్కువగా పేరుకుపోతూ ఉంటాయి. ఇవి కూడా ప్రతికూల శక్తికి కారణమవచ్చు.

ఇంట్లో పాత బట్టలు ఎక్కడ ఉంచాలి? ఏ దిశలో పెట్టాలి? వాస్తు నియమాలు ఇవే! (AI)
ఇంట్లో పాత బట్టలు ఎక్కడ ఉంచాలి? ఏ దిశలో పెట్టాలి? వాస్తు నియమాలు ఇవే! (AI)

చాలా మంది స్టోర్ రూమ్ లేదా మంచం కింద, అటకల పైన పాత బట్టలను పెడుతూ ఉంటారు. కొన్ని పాత బట్టలతో పాటుగా చిరిగిపోయినవి, పూర్తిగా పాడైపోయిన బట్టలు కూడా ఉంటాయి. వాస్తు ప్రకారం ఇంట్లో అనవసరమైన వస్తువులు ఉంటే ప్రతికూల శక్తి ఎక్కువగా వాటిని ఆపిస్తుంది. ఇలా చేస్తే సానుకూల శక్తి పూర్తిగా తొలగిపోతుంది. కాబట్టి పాత బట్టల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

పాతవి, పాడైపోయినవి రాహువు, శని గ్రహాలతో కూడా అనుసంధానిస్తారు. కాబట్టి పాత బట్టలను అప్పటికప్పుడు పరిశీలించి, అవసరమైనవి, అవసరం లేనివి వేరు చేసి, మంచివి ఇంట్లో పెట్టుకుని, పాతవి, పాడైపోయినవి ఇంటి నుంచి తొలగించడం మంచిది. ఎక్కువ కాలం అనవసరంగా వాటిని ఉంచడం వలన ప్రతికూల శక్తి పెరిగిపోతుంది. వాస్తు నమ్మకాల ప్రకారం పాత బట్టల విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

పాత బట్టల్ని ఎక్కడ పెట్టాలి? ఏ దిశలో ఉంచాలి?

కొన్ని పాత బట్టలు మంచి స్థితిలో ఉండి, భవిష్యత్తులో వాటిని ఉపయోగించాల్సి ఉంటే శుభ్రంగా, క్రమ పద్ధతిలో దాచుకోవడం మంచిది. వాస్తు ప్రకారం బట్టల అల్మారాలో లేదా బీరువాలో పెట్టుకోవచ్చు. దక్షిణం లేదా పడమర దిశలో వీటినే ఉంచడం మంచిది.

చిరిగిపోయినవి, పాడైపోయినవి ఇంట్లో ఉంచకూడదు

ఎవరైనా వేసుకోవడానికి ఉపయోగపడే బట్టలను లేని వారికి, అవసరమైన వారికి దానం చేయడం మంచిది. శనివారం లేదా అమావాస్యనాడు పాతవి, మంచి స్థితిలో ఉన్న బట్టలను దానం చేయడానికి శుభప్రదమైన రోజులు.

ఈ తప్పులు మాత్రం చేయొద్దు

మంచం కింద లేదా ఈశాన్యం దిశలో పాత బట్టల్ని పెట్టడం మంచిది కాదు. ఇలా చేస్తే ప్రతికూల శక్తి పెరిగిపోయే అవకాశం ఉంది.

కొన్ని పాత బట్టలను ఇల్లు తుడవడానికి వాడుతూ ఉంటారు. అయితే వాస్తు ప్రకారం ఇలా చేయడం మంచిది కాదు. ఇంటిని తోమడానికి ప్రత్యేకంగా కేటాయించిన బట్టలను ఉపయోగించడం మంచిది.

చిరిగిపోయిన బట్టల్ని దానం చేయొద్దు

చిరిగిపోయినవి, పనికిరానివి దానం చేయడం వలన మంచి జరగదు, చెడే జరుగుతుంది. శుభ్రంగా, ధరించడానికి అనువుగా ఉన్న బట్టల్ని మాత్రమే ఇతరులకు దానం చేయడం మంచిది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks