ఆషాఢ అమావాస్య ఎప్పుడు? తేదీ, సమయంతో పాటు పూర్తి వివరాలు.. ఈ ఒక్క దీప పరిహారంతో కోరికలు నెరవేరుతాయట!
ఆషాఢ మాసాన్ని చాలామంది శూన్య మాసంగా భావించి శుభకార్యాలను నిర్వహించరు. అయితే ఈ మాసంలో పూజలు, వ్రతాలు, దానధర్మాలకు విశేష ప్రాధాన్యం ఉందని ఆధ్యాత్మిక విశ్వాసాలు చెబుతున్నాయి. ఈ నెలలో బోనాలు, పూరీ జగన్నాథుడి రథయాత్ర, వారాహి గుప్త నవరాత్రులు, తొలి ఏకాదశి, గురు పౌర్ణమి వంటి విశేష పర్వదినాలు వస్తాయి.
ఆషాఢ మాసం అంటే చాలా మంది శూన్య మాసం అని, ఇది మంచిది కాదని అనుకుంటారు. కానీ ఆషాఢ మాసంలో చేసే పూజలకు కూడా మంచి ఫలితం ఉంటుంది. ఆషాఢ మాసం తెలుగు సంవత్సరంలోని నాలుగో నెల. ఈ మాసంలో పౌర్ణమి రోజు చంద్రుడు పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉంటాడు.

ఉత్తరాయణం పూర్తై, ఈ మాసం నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం మొదలవయ్యింది. అలాగే ఆషాఢ మాసం నుంచి వర్షాలు కురవిస్తాయి.
ఆషాఢ మాసంలో శుభకార్యాలు చేయకూడదని, దీనిని శూన్య మాసంగా భావిస్తారు. అందుకే వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి శుభకార్యాలను ఈ నెలలో నిర్వహించరు. అయితే ఆషాఢ మాసంలో ఇంటి నిర్మాణాన్ని ప్రారంభిస్తే మంచిదేనని చెబుతారు. గృహ నిర్మాణాన్ని మొదలుపెడితే పశుసంపద, రత్నాలు, మాణిక్యాలు, ధనధాన్యాలు లభిస్తాయని మత్స్య పురాణంలో పేర్కొన్నారు.
ఆషాఢ మాసంలో విశేష దినాలు
ఆషాఢ మాసంలో బోనాలు ప్రారంభమవుతాయి. అలాగే పూరీ జగన్నాథుడి రథయాత్ర కూడా ఈ మాసంలోనే జరుగుతుంది. వారాహి గుప్త నవరాత్రులు కూడా ఆషాఢ మాసంలోనే నిర్వహిస్తారు. తొలి ఏకాదశి కూడా ఈ మాసంలోనే వస్తుంది. గురు పౌర్ణమి కూడా ఆషాఢ మాసంలోని అత్యంత విశేషమైన పర్వదినాల్లో ఒకటి. అలాగే ఆషాఢ అమావాస్య కూడా ఎంతో విశిష్టమైనది. ఈ రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించడం వల్ల అద్భుతమైన లాభాలు కలుగుతాయని విశ్వసిస్తారు.
ఆషాఢ అమావాస్య 2026 తేదీ, సమయం
అమావాస్య తిథి ప్రారంభం: జూలై 13, 2026 (సోమవారం) సాయంత్రం 6:49 గంటలకు
అమావాస్య తిథి ముగింపు: జూలై 14, 2026 (మంగళవారం) మధ్యాహ్నం 3:12 గంటలకు
ఉదయ తిథి ప్రకారం జూలై 14, 2026 (మంగళవారం) ఆషాఢ అమావాస్యను ఆచరించాలి. ఆ రోజు పుణ్యస్నానాలు, దానధర్మాలు, అమావాస్య వ్రతం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడానికి అనుకూలంగా ఉంటుంది. మంగళవారం రావడం వల్ల దీనిని భౌమవతి అమావాస్య అని కూడా అంటారు. ఆషాఢ అమావాస్యను దీప అమావాస్య అని కూడా అంటారు.
దీప అమావాస్యనాడు కచ్చితంగా ఇలా దీపం వెలిగించండి
దీప అమావాస్య నాడు తప్పకుండా ఈ ఒక్క పరిహారాన్ని పాటించండి. అమావాస్య నాడు సాయంత్రం ఒక మట్టి ప్రమిదలో రెండు వత్తులు వేసి, ఈశాన్య మూలలో పెట్టి దీపం వెలిగించండి. అమావాస్య పూర్తయిన తర్వాత ఆ దీపాన్ని ఎవరూ తొక్కని ప్రదేశంలో వదిలేయండి.
అలాగే అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించండి. ఇలా చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని, అనుకున్న పనులు పూర్తవుతాయని, జీవితంలోని సమస్యలు తొలగిపోతాయని విశ్వసిస్తారు.
నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


