మీ జేబులో కర్చీఫ్ ఉందా? స్నేహితులకు ఇచ్చేటప్పుడు ఈ ఒక్క విషయం గుర్తుంచుకోకపోతే మీ బంధం క్లోజ్!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఇతరులకు నేరుగా చేతికి ఇవ్వడం వల్ల ప్రతికూల శక్తి (Negative Energy) ప్రభావం చూపుతుంది. ఉప్పు, సూది, ఇనుము వంటి వస్తువులను చేతితో అందిస్తే ఆర్థిక ఇబ్బందులు, సంబంధాల్లో గొడవలు వచ్చే అవకాశం ఉందని పెద్దలు హెచ్చరిస్తున్నారు.
చాలామంది పెద్దలు పాటించే పద్ధతులను వారు చెప్పే వాటినే కొట్టి పారేయకుండా పాటిస్తూ ఉంటారు. నిజానికి జ్యోతిష్యం ప్రకారం కొన్ని వస్తువులను ఇతరులకు నేరుగా ఇవ్వడం మంచిది కాదు. చేతులతో నేరుగా (Handing over directly) ఈ వస్తువులను ఇవ్వడం వలన ప్రతికూల శక్తితో బాధ పడాల్సి ఉంటుంది. సంతోషం, సంపద కూడా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. మరి ఎలాంటి పొరపాట్లు చేయకూడదు, వీటిని నేరుగా ఇతరులకు మన చేతులతో ఇవ్వడం మంచిది కాదు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పొరపాటున కూడా ఈ ఐదు వస్తువులను ఇతరులకు నేరుగా మీ చేతులతో ఇవ్వకండి:
1.ఉప్పు:
ఉప్పు చంద్రుడు, శుక్రుడుతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది ప్రతికూల శక్తిని తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాహువు, కేతువులతో కూడా సంబంధం కలిగి ఉంటుంది. అందుకే ఎప్పుడూ ఉప్పును ఇతరులకు నేరుగా మీ చేతులతో ఇవ్వకండి. లేదంటే గొడవలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఎక్కడైనా ఒక చోట పెట్టి వారిని తీసుకోమనాలి. చేతితో మాత్రం నేరుగా ఇవ్వకండి. ప్రతికూల శక్తితో బాధ పడాల్సి ఉంటుంది.
2.జేబు రుమాలు (కర్చీఫ్):
జేబు రుమాలలను కూడా ఇతరులకు చేతితో నేరుగా ఇవ్వడం మంచిది కాదు. అలా జరిగినట్లయితే ఆర్థిక ఇబ్బందులతో బాధపడాల్సి ఉంటుంది. రిలేషన్‌షిప్‌లో కూడా సమస్యలు వస్తాయి. ఎక్కడైనా పెట్టి జేబురుమాలను వారిని తీసుకోమని చెప్పాలి.
3.మిర్చి:
పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కారం వంటి వాటిని ఇతరులకు చేతితో నేరుగా ఇవ్వడం మంచిది కాదు. అలా చేస్తే రిలేషన్‌షిప్‌లో సమస్యలు వస్తాయి. టెన్షన్లు, గొడవలు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని కూడా ఎప్పుడూ ఇతరులకు నేరుగా మీ చేతులతో ఇవ్వకండి.
4.సూది, కత్తెర, చాకు:
పదునైన కత్తెర, చాకు, సూదులు వంటి వాటిని ఇతరులకు చేతికి ఇవ్వడం మంచిది కాదు. దాని వలన గొడవలు పెరిగిపోతాయి. రిలేషన్‌షిప్ దెబ్బతింటుంది. కాబట్టి వీటిని కూడా నేరుగా ఇవ్వకండి. ప్రతికూల శక్తితో బాధ పడాల్సి ఉంటుంది.
5.ఇనుము వస్తువులు:
ఇనుము శనితో సంబంధం కలిగి ఉంటుంది. ఇనప వస్తువులను ఇతరులకు చేతితో ఇవ్వడం మంచిది కాదు. దాని వలన ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిడి పెరిగిపోవడం వంటివి జరగవచ్చు. కాబట్టి ఈ తప్పు కూడా చేయకండి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వస్తువు ఒక గ్రహంతో లేదా శక్తితో సంబంధం ఉంటుంది. నేరుగా చేతితో ఇస్తే మనలోని ఎనర్జీ ఎక్స్ఛేంజ్ అవుతుంది. అవతలి వారిలో వుండే ప్రతికూలత మనలోకి రావచ్చు. అందుకే ఇలాంటి నియమాలు వున్నాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper












