రేపు సూర్య గ్రహణం.. భారత్‌పై ప్రభావం ఉందా? సూతక కాలం ఎప్పటి నుంచి?

ఆగస్టు 12న ఏర్పడనున్న సంపూర్ణ సూర్యగ్రహణం భారత్‌లో కనిపించదని ఖగోళ నిపుణులు చెబుతున్నారు. ఈ గ్రహణం అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, ఐరోపా, స్పెయిన్, ఐస్‌లాండ్, గ్రీన్‌లాండ్ తదితర ప్రాంతాల్లో కనిపించనుంది. భారత్‌పై ప్రభావం ఉందా?

Published on: Aug 11, 2026, 16:00:41 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆకాశంలో అద్భుత ఖగోళ ఘట్టానికి రంగం సిద్ధమైంది. ఆగస్టు 12న అనగా రేపు ఈ ప్రత్యేక సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అమావాస్య పూజా విధానాలు, సూతక కాలం సమయం, గ్రహణ దోషాల నుంచి విముక్తి పొందడానికి పాటించాల్సిన పరిహారాలు, దానధర్మాల గురించి తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపుతున్నారు. ఈ ఖగోళ పరిణామం ఎక్కడెక్కడ కనిపిస్తుంది, దీని ప్రభావం మన దేశంపై ఉంటుందా లేదా అనే పూర్తి వివరాలను పరిశీలిద్దాం.

రేపు సూర్య గ్రహణం.. భారత్‌పై ప్రభావం ఉందా? సూతక కాలం ఎప్పటి నుంచి?
రేపు సూర్య గ్రహణం.. భారత్‌పై ప్రభావం ఉందా? సూతక కాలం ఎప్పటి నుంచి?

రేపు ఏర్పడబోతున్న ఈ సూర్య గ్రహణం ఎక్కడెక్కడ కనిపించనుంది?

సమయం వివరాలు చూస్తే.. ఈ సూర్యగ్రహణం భారత్‌లో ఎక్కడా కనిపించదని ఖగోళ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది ప్రధానంగా అమెరికాలోని కొన్ని నగరాలు, ఐరోపా, స్పెయిన్, ఐస్‌లాండ్, గ్రీన్‌లాండ్ ప్రాంతాల్లో స్పష్టంగా దర్శనమిస్తుంది. అలాగే పోర్చుగల్ కొన్ని భాగాలు, ఉత్తర రష్యా, ఉత్తర అమెరికా ఈశాన్య ప్రాంతాలు, మెజారిటీ ఐరోపా దేశాలు, వాయువ్య ఆఫ్రికాలోనూ దీనిని చూడవచ్చు.

భారత కాలమానం ప్రకారం ఆగస్టు 12 రాత్రి 9:04 గంటలకు ప్రారంభమై, రాత్రి 11:16 గంటల వరకు దీని ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత ఆగస్టు 13 తెల్లవారుజామున 1:28 గంటలకు ఇది పూర్తిగా ముగుస్తుంది. అయితే ఇది రాత్రి పూట సంభవించడం, మన దేశంలో భౌగోళికంగా కనిపించకపోవడం గమనార్హం.

సూతక కాలం వర్తిస్తుందా?

సాధారణంగా సూర్యగ్రహణానికి 12 గంటల ముందు, చంద్రగ్రహణానికి 9 గంటల ముందు సూతక్ కాలం ప్రారంభమవుతుంది. సూర్యగ్రహణం నేపథ్యంలో కొందరు రాత్రి 9 గంటలకు సూతక ఉంటుందని భావిస్తుంటారు. అయితే, ఏ ప్రాంతంలో అయితే గ్రహణం ప్రత్యక్షంగా కనిపిస్తుందో, అక్కడ మాత్రమే సూతక కాలం నియమాలు కచ్చితంగా వర్తిస్తాయి. భారత్‌లో ఈ గ్రహణం అస్సలు కనిపించదు కాబట్టి, ఇక్కడ ఎలాంటి సూతక కాలం పాటించాల్సిన అవసరం లేదని పండితులు వెల్లడిస్తున్నారు.

దానధర్మాల ప్రాముఖ్యత

హిందూ సంప్రదాయం ప్రకారం గ్రహణ సమయాలు, గ్రహణ అనంతర కాలంలో దానధర్మాలు చేయడం అత్యంత విశేషమైన ఫలితాలను ఇస్తుంది. గ్రహణ శక్తి వల్ల ఏర్పడే ప్రతికూల ప్రభావాలను ఇది తగ్గిస్తుందని నమ్ముతారు. సూర్యుడి అనుగ్రహం పొందడానికి ఈ ప్రత్యేక రోజున కొన్ని దానాలు చేయడం మంచిది.

గోధుమల దానం: జీవితంలో స్థిరత్వం, ఆత్మవిశ్వాసం, సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరగడానికి గోధుమలు దానం చేయాలి.

బెల్లం, రాగి పాత్రలు: ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, సూర్య భగవానుడి బలాన్ని పొందడానికి రాగి వస్తువులు, బెల్లం దానం చేయడం శ్రేయస్కరం.

ఎరుపు రంగు వస్త్రాలు: జాతకంలో గ్రహ దోషాలు తొలగిపోవడానికి ఎరుపు రంగు బట్టలను దానంగా ఇవ్వవచ్చు.

అన్నదానం: నిరుపేదలకు ఆహారం, మంచినీరు అందించడం ద్వారా విశేషమైన పుణ్యఫలం దక్కుతుంది.

రేపు అమావాస్య ఆచారాలను యధావిధిగా పాటించవచ్చా?

రేపు మీరు పూర్వీకుల కోసం దానం మరియు తర్పణాలు ఎప్పుడూ పాటించినట్టే పాటించవచ్చు. భారతదేశంలో ఈ గ్రహణం ప్రభావం లేదు. కనుక ఏ మాత్రం ఇబ్బంది పడక్కర్లేదు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More