తెలంగాణ సంప్రదాయాలకు, సంస్కృతికి ప్రత్యేకంగా నిలిచే బతుకమ్మ పండుగ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి, దాని చుట్టూ మహిళలు పాటలు పాడుతూ, పండుగను వైభవంగా జరుపుతారు. అయితే, బతుకమ్మ పండుగ సమయంలో గౌరమ్మను పూజిస్తారు. అయితే, ఎందుకు బతుకమ్మలో గౌరమ్మను పూజిస్తారు? ఈ కథ మీకు తెలుసా?

పూలతో అమ్మవారిని ఆరాధిస్తారు. బతుకమ్మలో గౌరమ్మను పూజిస్తారు. పూలతో అమ్మవారిని ఆరాధించడం వెనుక ఆధ్యాత్మిక భావం ఉంది. ఆ విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గౌరమ్మ కథ
పురాణాల ప్రకారం చూసినట్లయితే, పార్వతీదేవి శివుడిని భర్తగా పొందడం కోసం కఠోర తపస్సు చేసింది. ఆమె భక్తి, పట్టుదల, నిష్ఠకు మెచ్చిన శివుడు ఆమెను అర్ధాంగిగా స్వీకరించడం జరిగింది.
గౌరీదేవిని ఆరాధిస్తే భక్తులు దాంపత్య సౌఖ్యం, కుటుంబ శ్రేయస్సు, మానసిక ధైర్యం పొందవచ్చు. బతుకమ్మ ఆచారాలకు సంబంధించిన జానపద కథలు ప్రాంతాన్ని బట్టి కాస్త విభిన్నంగా ఉంటాయి. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల జీవితాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని చెప్పచ్చు. గౌరమ్మ ఆశీస్సులతో ప్రతి ఇల్లు కూడా సుఖ సంతోషాలతో నిలుస్తుందని భక్తులు మనస్ఫూర్తిగా గౌరమ్మను ఈ బతుకమ్మ సమయంలో ఆరాధించడం జరుగుతుంది.
పూలతో బతుకమ్మ
బతుకమ్మలో పూలకు ప్రత్యేక స్థానం ఉంది. తంగేడు, బంతి, చామంతి మొదలైన పూలతో బతుకమ్మను అందంగా పేర్చడం జరుగుతుంది. అమ్మవారిని ఇలా పూజించడం వలన ప్రకృతి పట్ల కృతజ్ఞతను చాటుకోవచ్చు.
ప్రకృతి ప్రసాదించిన సంపదను భక్తితో అమ్మవారికి సమర్పించడం ద్వారా ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇది ముఖ్యమైన సంప్రదాయం కూడా. ఈ పూల అందం, వాటి రంగులు, సువాసనలు పండుగకు ప్రధాన ఆకర్షణ.
బతుకమ్మ పండుగ మనకు ఇచ్చే సందేశం
పూలను పేర్చి అమ్మవారిని ఆరాధిస్తే.. ప్రకృతిని గౌరవించాలని మనకు ఇది గుర్తు చేస్తుంది. అందరూ కలిసి బతుకమ్మను ఘనంగా జరుపుకుని, ఐక్యత, పరస్పర గౌరవం, ప్రేమ విలువలను చాటుకోవచ్చు. గౌరమ్మను బతుకమ్మ సమయంలో పూజించడం వలన భక్తులు సుఖ సంతోషాలను పొందుతారు.
{{/usCountry}}పూలను పేర్చి అమ్మవారిని ఆరాధిస్తే.. ప్రకృతిని గౌరవించాలని మనకు ఇది గుర్తు చేస్తుంది. అందరూ కలిసి బతుకమ్మను ఘనంగా జరుపుకుని, ఐక్యత, పరస్పర గౌరవం, ప్రేమ విలువలను చాటుకోవచ్చు. గౌరమ్మను బతుకమ్మ సమయంలో పూజించడం వలన భక్తులు సుఖ సంతోషాలను పొందుతారు.
{{/usCountry}}నిరాకరణ: ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలోని నిపుణుడి సలహా తీసుకోండి.