బతుకమ్మ పండుగలో గౌరమ్మకు ఎందుకంత ప్రాధాన్యం? అసలు కథ ఇదే!

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో గౌరమ్మను పూజించడం ప్రత్యేకమైన ఆచారం. పార్వతీదేవి, పరమశివుడి కథతో ముడిపడిన ఈ ఆరాధన దాంపత్య సౌఖ్యం, కుటుంబ శ్రేయస్సు, మానసిక ధైర్యానికి ప్రతీకగా భావిస్తారు. 

Published on: Oct 11, 2026, 10:33:04 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తెలంగాణ సంప్రదాయాలకు, సంస్కృతికి ప్రత్యేకంగా నిలిచే బతుకమ్మ పండుగ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి, దాని చుట్టూ మహిళలు పాటలు పాడుతూ, పండుగను వైభవంగా జరుపుతారు. అయితే, బతుకమ్మ పండుగ సమయంలో గౌరమ్మను పూజిస్తారు. అయితే, ఎందుకు బతుకమ్మలో గౌరమ్మను పూజిస్తారు? ఈ కథ మీకు తెలుసా?

బతుకమ్మ పండుగలో గౌరమ్మకు ఎందుకంత ప్రాధాన్యం? అసలు కథ ఇదే! (AI)
బతుకమ్మ పండుగలో గౌరమ్మకు ఎందుకంత ప్రాధాన్యం? అసలు కథ ఇదే! (AI)

పూలతో అమ్మవారిని ఆరాధిస్తారు. బతుకమ్మలో గౌరమ్మను పూజిస్తారు. పూలతో అమ్మవారిని ఆరాధించడం వెనుక ఆధ్యాత్మిక భావం ఉంది. ఆ విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గౌరమ్మ కథ

పురాణాల ప్రకారం చూసినట్లయితే, పార్వతీదేవి శివుడిని భర్తగా పొందడం కోసం కఠోర తపస్సు చేసింది. ఆమె భక్తి, పట్టుదల, నిష్ఠకు మెచ్చిన శివుడు ఆమెను అర్ధాంగిగా స్వీకరించడం జరిగింది.

గౌరీదేవిని ఆరాధిస్తే భక్తులు దాంపత్య సౌఖ్యం, కుటుంబ శ్రేయస్సు, మానసిక ధైర్యం పొందవచ్చు. బతుకమ్మ ఆచారాలకు సంబంధించిన జానపద కథలు ప్రాంతాన్ని బట్టి కాస్త విభిన్నంగా ఉంటాయి. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల జీవితాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని చెప్పచ్చు. గౌరమ్మ ఆశీస్సులతో ప్రతి ఇల్లు కూడా సుఖ సంతోషాలతో నిలుస్తుందని భక్తులు మనస్ఫూర్తిగా గౌరమ్మను ఈ బతుకమ్మ సమయంలో ఆరాధించడం జరుగుతుంది.

పూలతో బతుకమ్మ

బతుకమ్మలో పూలకు ప్రత్యేక స్థానం ఉంది. తంగేడు, బంతి, చామంతి మొదలైన పూలతో బతుకమ్మను అందంగా పేర్చడం జరుగుతుంది. అమ్మవారిని ఇలా పూజించడం వలన ప్రకృతి పట్ల కృతజ్ఞతను చాటుకోవచ్చు.

ప్రకృతి ప్రసాదించిన సంపదను భక్తితో అమ్మవారికి సమర్పించడం ద్వారా ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇది ముఖ్యమైన సంప్రదాయం కూడా. ఈ పూల అందం, వాటి రంగులు, సువాసనలు పండుగకు ప్రధాన ఆకర్షణ.

బతుకమ్మ పండుగ మనకు ఇచ్చే సందేశం

పూలను పేర్చి అమ్మవారిని ఆరాధిస్తే.. ప్రకృతిని గౌరవించాలని మనకు ఇది గుర్తు చేస్తుంది. అందరూ కలిసి బతుకమ్మను ఘనంగా జరుపుకుని, ఐక్యత, పరస్పర గౌరవం, ప్రేమ విలువలను చాటుకోవచ్చు. గౌరమ్మను బతుకమ్మ సమయంలో పూజించడం వలన భక్తులు సుఖ సంతోషాలను పొందుతారు.

నిరాకరణ: ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలోని నిపుణుడి సలహా తీసుకోండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More