భీష్మ నీతి: పొరపాటున కూడా భోజనం తినేటప్పుడు ఈ నాలుగు తప్పులు చేయకండి, ఆహారం తినడానికి సరైన నియమాలు తెలుసుకోండి!
మహాభారతంలో భీష్మ పితామహుడు యుధిష్ఠిరుడికి అనేక ముఖ్యమైన జీవిత నియమాలను బోధించాడు. సరైన ఆహారం తీసుకోకపోతే ఆరోగ్యం క్షీణిస్తుంది, ఆయుష్షు తగ్గుతుంది. జీవితంలో సమస్యలు పెరుగుతాయి. అకాల మరణం, బాధలకు కారణమయ్యే ఈ నాలుగు రకాల ఆహారాలను నివారించాలి అని భీష్ముడు సూచించాడు. ఈ నియమాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మహాభారతంలో భీష్మ పితామహుడు యుధిష్ఠిరుడికి అనేక ముఖ్యమైన జీవిత నియమాలను బోధించాడు. వీటిని భీష్మ నీతి అని పిలుస్తారు. వీటిలో ఆహార నియమాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఆహారం కడుపు నింపడానికి మాత్రమే కాదు. ఆహారం శరీరం, మనస్సు, ఆత్మను శుద్ధి చేస్తుంది అని భీష్మ పితామహుడు అంటాడు.

సరైన ఆహారం తీసుకోకపోతే ఆరోగ్యం క్షీణిస్తుంది, ఆయుష్షు తగ్గుతుంది. జీవితంలో సమస్యలు పెరుగుతాయి. అకాల మరణం, బాధలకు కారణమయ్యే ఈ నాలుగు రకాల ఆహారాలను నివారించాలి అని భీష్ముడు సూచించాడు. ఈ నియమాలు నేటికీ పాటించడం ముఖ్యం. మరి అవేంటి ఇప్పుడు తెలుసుకుందాం.
భీష్మ నీతి ప్రకారం ఆహారానికి సంబంధించి ఈ నాలుగు తప్పులు చేయకూడదు
1. ఇతరుల పళ్లెంలో మిగిలిపోయిన ఆహారం
ఇతరుల పళ్లెంలో మిగిలిపోయిన ఆహారం తినడం మంచిది కాదని భీష్మ నీతి చెబుతుంది. ఇది వ్యక్తిత్వ గౌరవాన్ని తగ్గిస్తుంది. ప్రతికూల శక్తి శరీరంలోకి ప్రవేశిస్తుంది. మిగిలిపోయిన ఆహారం తినడం వల్ల ఆయుష్షు తగ్గుతుందని, వ్యాధులు పెరుగుతాయని మహాభారతంలో పేర్కొనబడింది. ఈ ఆహారం స్వచ్ఛమైనది కాదు. స్వంతంగా తయారు చేసిన తాజా ఆహారమే తినాలని భీష్మ నీతి సూచిస్తుంది. అలాగే మరుసటి రోజు మిగిలిపోయిన ఆహారం తినడం వల్ల జీర్ణక్రియ బలహీనపడుతుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఇది జీవితంలో సమస్యలు మరియు వైఫల్యాలకు దారితీస్తుంది.
2. కోపం లేదా గొడవలో తయారైన ఆహారం
కోపం లేదా గొడవ సమయంలో తయారైన ఆహారం విషంతో సమానమని భీష్ముడు పేర్కొన్నారు. ఇలాంటి ఆహారం తినడం వల్ల మనస్సు కలవరపడుతుంది మరియు శరీరంలో వ్యాధులు ఉద్భవిస్తాయి. ఆహారాన్ని తయారు చేసే సమయంలో మనస్సు ప్రశాంతంగా, ప్రేమతో ఉండాలని మహా భారతం సూచిస్తుంది.
కోపంతో తయారైన ఆహారం ప్రతికూల శక్తితో నిండివుంటుంది. ఇది తినే వారిలో కోపం, ఒత్తిడి, అస్వస్థతను కలిగిస్తుంది. దీని వల్ల సంబంధాల్లో విభేదాలు పెరిగి, అకాల మరణానికి కూడా దారితీసే ప్రమాదం ఉంది. ఆహారం తయారు చేసే సమయంలో మంత్రాలను పఠిస్తూ లేదా భగవంతుణ్ణి స్మరిస్తే, ఆహారం అమృతంలా మారుతుందని చెప్పబడింది.
3. అపరిశుభ్రమైన లేదా అపవిత్రమైన ఆహారం
అపరిశుభ్రమైన ఆహారాన్ని పూర్తిగా నివారించాలని భీష్మ నీతి చెప్తోంది. కుళ్లిపోయినవి, మురికిగా ఉన్నవి లేదా అపవిత్రమైన ఆహారం తినడం పాపకార్యంగా పరిగణించబడుతుంది. దీనిని తింటే వ్యాధులకు కారణమవుతుంది. ఇటువంటి ఆహారం అకాల మరణానికి దారితీస్తుందని మహాభారతంలో పేర్కొనబడింది. తామస ఆహారాన్ని కూడా అపవిత్రంగానే భావిస్తారు. ఇది మనస్సులో ప్రతికూల ఆలోచనలను పెంచి, ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. సాత్విక ఆహారం, తాజా, స్వచ్ఛమైనది, ప్రేమతో తయారు చేసిన ఆహారం తినాలి. ఇది ఆయుష్షును పెంచి, మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.
4. అతిగా ఆహారం తీసుకోవడం
అతిగా తినడం జీర్ణక్రియను పాడుచేస్తుంది మరియు అకాల మరణానికి దారితీస్తుందని భీష్ముడు హెచ్చరించాడు. ఆహారం మితంగా తీసుకోవాలి. భోజన సమయంలో మూడు భాగాల ఆహారం, ఒక భాగం నీరు వుండాలని, ఒక భాగం ఖాళీగా ఉంచాలని సూచించారు. అతిగా తినడం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు మరియు మానసిక సోమరితనం పెరుగుతాయి. మితమైన ఆహారం ఆయుష్షును, బుద్ధి చాతుర్యాన్ని పెంచుతుందని మహాభారతంలో ప్రస్తావించబడింది. రాత్రిపూట హెవీగా భోజనం చేయకూడదు. ఇది జీవితంలోని సమస్యలను తగ్గించి, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
భీష్మ నీతిలో చెప్పిన ఈ ఆహార నియమాలను అనుసరించడం ద్వారా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. జీవితం సంతోషంగా మారుతుంది. సాత్విక మరియు సంయమనంతో కూడిన ఆహారమే జీవితానికి నిజమైన అమృతం.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


