Sun Transit: సొంత నక్షత్రంలోకి సూర్యుడు, నాలుగు రాశులకు అపారమైన సంపద, విజయాలు!

సూర్యుడు గౌరవం, నాయకత్వం మొదలైన వాటికి కారకుడు. సూర్యుడు సొంత నక్షత్రంలోకి ప్రవేశించడంతో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. జనవరి 11న, ఆదివారం నాడు, సూర్యుడు ఉత్తరాషాఢ నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. తన సొంత నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది.

Published on: Dec 19, 2025, 15:00:46 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు కాలనుగుణంగా రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది అన్ని రాశుల వారి జీవితాల్లో కూడా అనేక మార్పులను తీసుకువస్తుంది. గ్రహాలకు రాజు సూర్యుడు. 2026 జనవరిలో సూర్యుడు తన సొంత నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఇది శుభ యోగాలను, అశుభ యోగాలను తీసుకు రాబోతోంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈ నక్షత్ర సంచారం బాగా కలిసి రాబోతోంది.

Sun Transit: సొంత నక్షత్రంలోకి సూర్యుడు, నాలుగు రాశులకు అపారమైన సంపద, విజయాలు (pinterest)
Sun Transit: సొంత నక్షత్రంలోకి సూర్యుడు, నాలుగు రాశులకు అపారమైన సంపద, విజయాలు (pinterest)

సొంత నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడం విశేషం

సూర్యుడు గౌరవం, నాయకత్వం మొదలైన వాటికి కారకుడు. సూర్యుడు సొంత నక్షత్రంలోకి ప్రవేశించడంతో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. జనవరి 11న, ఆదివారం నాడు, సూర్యుడు ఉత్తరాషాఢ నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. తన సొంత నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. అదృష్టం కూడా కలుగుతుంది. మరి ఆ రాశులు ఎవరు? ఏ రాశుల వారికి మేలు కలుగుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం.

సొంత నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ రాశుల వారి జీవితాల్లో అనేక లాభాలు

1.మేష రాశి

మేష రాశి వారికి సూర్య నక్షత్ర సంచారం బాగా కలిసి రాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. కెరీర్‌లో కూడా మంచి మార్పులు చూస్తారు. పని ప్రదేశంలో ప్రశంసలు వస్తాయి. సీనియర్ల సపోర్ట్‌తో పనులను పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. తండ్రితో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.

2.సింహ రాశి

సింహ రాశి వారికి సూర్య నక్షత్ర సంచారం కలిసి రాబోతోంది. ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. ఈ సమయంలో ఈ రాశి వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. శత్రువులతో ఉన్న సమస్యలు తీరిపోతాయి. వ్యాపారంలో ఎక్కువ లాభాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.

3.ధనస్సు రాశి

ధనస్సు రాశి వారికి సూర్య నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. అనేక విధాలుగా లాభాలను పొందుతారు. ఆర్థికపరంగా బాగుంటుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు మీ చేతికే వస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బాధ్యతలను పూర్తిచేస్తారు. కెరీర్‌లో సక్సెస్‌ను అందుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న టెన్షన్ తొలగిపోతుంది.

4.మీన రాశి

ఉత్తరాషాఢ నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడంతో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పాత ప్లాన్లు వర్క్ అవుట్ అవుతాయి. సక్సెస్‌ను అందుకుంటారు. డబ్బులు కూడా చేతికి వస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అయితే అనుకున్నది సాధించడంలో కాస్త కష్టపడాల్సి ఉంటుంది. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి కూడా సూర్య నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More