Birds in Dreams: కలలో ఈ 5 పక్షులు కనపడితే సంతోషం, సంపదకు లోటే ఉండదు!

కొన్ని కలలు వస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి. సంతోషం పెరుగుతుంది. ఆర్థికపరంగా కూడా కలిసి వస్తుంది. అదే కొన్ని కలలు వచ్చినట్లయితే సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అని స్వప్న శాస్త్రం చెప్తోంది. అయితే, స్వప్న శాస్త్రం ప్రకారం కలలో ఈ పక్షులు కనపడితే ఎంతో అదృష్టం కలిసి వస్తుంది. సంపదకు లోటే ఉండదు.

Published on: Jan 8, 2026, 12:00:28 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మనం నిద్రపోయినప్పుడు అనేక కలలు వస్తూ ఉంటాయి. అసలు వచ్చిన కలలను కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం కూడా. స్వప్న శాస్త్రం మనకు వచ్చే కలలను బట్టి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చెప్తుంది. మన ఊహలే కలలు అవుతాయి. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం భవిష్యత్తుకు కలలు అద్దం వంటివి. కొన్ని కలలు వస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి. సంతోషం పెరుగుతుంది. ఆర్థికపరంగా కూడా కలిసి వస్తుంది.

Birds in Dreams: కలలో ఈ 5 పక్షులు కనపడితే సంతోషం, సంపదకు లోటే ఉండదు (pinterest)
Birds in Dreams: కలలో ఈ 5 పక్షులు కనపడితే సంతోషం, సంపదకు లోటే ఉండదు (pinterest)

అదే కొన్ని కలలు వచ్చినట్లయితే సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అని స్వప్న శాస్త్రం చెప్తోంది. అయితే, స్వప్న శాస్త్రం ప్రకారం కలలో ఈ పక్షులు కనపడితే ఎంతో అదృష్టం కలిసి వస్తుంది. మరి స్వప్న శాస్త్రం ప్రకారం కలలో ఎలాంటి పక్షులు కనపడితే శుభ ఫలితాలు ఎదురవుతాయి? ఈ పక్షులు కలలో కనపడితే ఆర్థిక లాభాలు, అదృష్టం, ఆనందాన్ని పొందవచ్చు.

కలలో ఈ పక్షులు కనపడితే సంతోషం, సంపదకు లోటే ఉండదు.. సమస్యలన్నీ తీరిపోతాయి

1.గుడ్లగూబ

కలలో గుడ్లగూబ కనపడటం చాలా మంచిది. లక్ష్మీదేవి వాహనమైనటువంటి గుడ్లగూబ కలలో కనపడితే లక్ష్మీదేవి ఆశీస్సులు ఉన్నట్లే. కలలో గుడ్లగూబ కనపడితే ఆర్థిక ఇబ్బందులు త్వరలోనే తీరిపోతాయని అర్థం చేసుకోవాలి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపద పెరుగుతుంది. అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. సంతోషంగా ఉండడానికి వీలవుతుంది.

2.బ్లూ బర్డ్

కలలో బ్లూ బర్డ్ కనబడితే కూడా శుభ ఫలితాలు కనపడతాయని అర్థం. శివుని అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చని అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో సమస్యలు కూడా తీరిపోయే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో పూర్తి కాని పనులు కూడా పూర్తయిపోతాయి. ఆనందం పెరుగుతుంది.

3.నెమలి

కలలో నెమలి కనపడితే కూడా మంచి జరగబోతుందని అర్థం చేసుకోవాలి. కలలో నెమలి కనబడితే కృష్ణుని అనుగ్రహం మీపై ఉందని అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో కూడా అనేక మార్పులు వస్తాయి. కలలో నెమలి కనపడితే సులువుగా కెరియర్‌లో సక్సెస్‌ను అందుకోవచ్చు.

4.చిలుకలు

ఒక్కోసారి కలలో చిలుకలు కనపడుతూ ఉంటాయి. చిలుకలు విజ్ఞానం, సంతోషానికి సంకేతం. కలలో చిలుకలు కనపడితే కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుందని, ప్రేమ జీవితం మధురంగా మారుతుందని అర్థం చేసుకోవాలి. కలలో చిలుకలు కనపడితే శుభవార్తలు కూడా వింటారు. మొత్తానికి కలలో చిలుకలు కనపడితే శుభ ఫలితాలు కలుగుతాయి. అన్ని విధాలుగా లాభాలు ఉంటాయి.

5. హంసలు

కలలో తెల్లటి హంసలను చూస్తే కూడా శుభ ఫలితాలు ఎదురవుతాయి. జంట హంసలను లేదా ఒంటరి హంసను చూస్తే కూడా శుభ ఫలితాలే. ఇలాంటి కలలు వస్తే ఇంట్లో పెళ్లి లేదా ఇతర శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఊహించని విధంగా ఆర్థిక లాభాలను కూడా పొందవచ్చు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More