Sankranti 2026: సంక్రాతి పండుగ జనవరి 14న, 15న? పండుగ తేదీలు, శుభ సమయం, పుణ్యకాలం వివరాలు తెలుసుకోండి!

మన భారతీయ సంస్కృతిలో మకర సంక్రాంతికి ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి జరుపుకుంటాము. చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణాన్ని ఇది సూచిస్తుంది. ఈ ఏడాది మకర సంక్రాంతితో పాటు ఏకాదశి కలిసి రావడం జరిగింది. సంక్రాతి పండుగ జనవరి 14న, 15న? తేదీ, శుభ సమయం వివరాలు.

Published on: Jan 7, 2026, 08:00:09 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి ఒకటి. సంక్రాంతి పండుగను పెద్ద పండుగ అని అంటారు. ఈ సంక్రాంతి పండుగను నాలుగు రోజుల పాటు జరుపుతారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ, నాలుగవ రోజు ముక్కనుమ పండుగలను జరుపుతారు. అయితే ఈసారి ఈ సంక్రాంతి ఎప్పుడు వచ్చింది అనే విషయంలో కాస్త కన్ఫ్యూజన్ ఉంది. మరి సంక్రాంతి ఎప్పుడు వచ్చింది? సంక్రాంతి పండుగ తేదీలతో పాటు పుణ్యకాలం, శుభ ముహూర్తాల గురించి కూడా పూర్తి వివరాలు తెలుసుకుందాం.

సంక్రాంతి 2026 పుణ్యస్నానాలు, పూజా సమయం (pinterest)
సంక్రాంతి 2026 పుణ్యస్నానాలు, పూజా సమయం (pinterest)

మకర సంక్రాంతికి ప్రత్యేక స్థానం

మన భారతీయ సంస్కృతిలో మకర సంక్రాంతికి ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటాము. చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణాన్ని ఇది సూచిస్తుంది. ఈ ఏడాది మకర సంక్రాంతితో పాటు ఏకాదశి కూడా కలిసి రావడం జరిగింది.

మకర సంక్రాంతి 2026

ఈ ఏడాది సంక్రాంతి పండుగ సంబరాలు త్వరలోనే మొదలు కాబోతున్నాయి. ఈ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకుంటారు. కేవలం ఇది మతపరమైనదే కాదు, రైతులకు పంట చేతికి వచ్చి ఆనందాన్ని తీసుకువచ్చే సమయం. ఈ పండుగకు అందమైన ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు పెట్టడం, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దులు, గాలిపటాలను ఎగరవేయడం, భోగి పండ్లు, భోగి మంటలు వంటి ఎన్నో చూడొచ్చు.

నువ్వులు, బెల్లం కలిపి చేసే వంటకాలు కూడా ఈ సమయంలో తింటే మంచిదని, ఆరోగ్యంగా ఉండొచ్చని నమ్ముతారు. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించే ఈ సమయంలో దానధర్మాలు చేస్తే ఎంతో మంచి జరుగుతుంది. చక్కటి ఫలితాలను చూడవచ్చు, ఆనందంగా ఉండొచ్చు, ఉత్తమ ఫలితాలను పొందడానికి కూడా వీలవుతుంది.

2026 సంక్రాంతి పండుగ తేదీలు

జనవరి 14, భోగి పండుగ

భోగి నాడు భోగి మంటలు వేస్తారు. పాత సామాగ్రిని మంటల్లో వేసే సాంప్రదాయం ఉంది. ఇలా చేయడం వలన పాత వాటిని వదిలి కొత్త వెలుగులతో పండుగను జరుపుకుంటాము.

జనవరి 15, మకర సంక్రాంతి

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మకర సంక్రాంతి నాడు కొత్త అల్లుళ్లతో సరదాగా పండుగను జరుపుకుంటారు. పిల్లాపాపలతో, పిండి వంటలతో సంతోషంగా జరుపుకుంటారు.

జనవరి 16, కనుమ పండుగ

కనుమ పండుగ నాడు పశువులను ఆరాధిస్తారు. ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుతారు.

సంక్రాంతి 2026 పుణ్యస్నానాలు, పూజా సమయం

పంచాంగం ప్రకారం చూసినట్లయితే, జనవరి 15న సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు మకర రాశిలోకి మధ్యాహ్నం 3:13కి ప్రవేశించడంతో పుణ్యకాలం మధ్యాహ్నం 3:13 నుంచి సాయంత్రం 5:45 వరకు ఉంటుంది.

మహా పుణ్యకాలం ఎంతో శ్రేష్టమైనది కనుక ఈ సమయంలో వీటిని పాటించడం మంచిది

మహా పుణ్యకాలం మధ్యాహ్నం 3:13 నుంచి సాయంత్రం 4:58 వరకు ఉంటుంది. నది స్నానాలు, సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం, దానధర్మాలు వంటి కార్యక్రమాలు ఈ సమయంలో చెయ్యాలి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More