తెలంగాణ బోనాలు: అనాదిగా వస్తున్న ఈ పవిత్ర సంప్రదాయం వెనుక అసలు రహస్యం ఏంటి?

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగ విశిష్టత, బోనం తయారీ విధానం మరియు గ్రామ దేవతల ఆరాధన వెనుక ఉన్న ఆచారాల పూర్తి సమాచారం.

Published on: Aug 8, 2026, 16:01:01 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో ఆషాఢ మాసంలో ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే బోనాల పండుగ విశిష్టతను ఈ కథనం వివరిస్తోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు తెలంగాణలోని ప్రజలు గ్రామ దేవతలకు బోనాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. బోనం అంటే ఏమిటి, దానిని ఎలా తయారు చేస్తారు?

తెలంగాణ బోనాలు: అనాదిగా వస్తున్న ఈ పవిత్ర సంప్రదాయం వెనుక అసలు రహస్యం ఏంటి? (pinterest)
తెలంగాణ బోనాలు: అనాదిగా వస్తున్న ఈ పవిత్ర సంప్రదాయం వెనుక అసలు రహస్యం ఏంటి? (pinterest)

బోనాల పండుగ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆషాఢ మాసం వస్తే చాలు, తెలంగాణలో బోనాలను జరుపుతారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు ఆ అమ్మ నామస్మరణతో మారుమోగుతాయి. గ్రామ దేవతలకు ప్రతి ఒక్క మహిళ కూడా బోనాలను సమర్పిస్తారు. అసలు బోనం అంటే ఏంటి? దానిలో ఏముంటుంది? బోనాల విశిష్టత గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

బోనం అంటే ఏంటి? ఎందుకు సమర్పించాలి?

భోజనం అనే సంస్కృత పదానికి వికృతి పదమే బోనం. ఇంట్లోనే అమ్మవారికి భోజనాన్ని తయారు చేసి, దానిని నివేదన చేయాలి. ప్రపంచంలో ఎక్కడా కనిపించని సంప్రదాయం కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే పాటిస్తారు. ఇలా అమ్మవారికి బోనాలను సమర్పించడం వలన కుటుంబం, ఊరు ఎలాంటి ఆపదలు లేకుండా ఉంటుందని, ఏ రోగాలు రాకుండా అమ్మ చల్లగా చూస్తుందని నమ్మకం.

అమ్మవారికి బోనాన్ని నియమ నిష్ఠలతో, పరిశుభ్రతగా తయారు చేస్తారు. అలాగే ఈ బోనాలను రకరకాలుగా తయారు చేస్తారు. కొంత మంది బెల్లం బువ్వ బోనం తయారు చేస్తే, మరి కొంతమంది వెయ్యి కండ్ల బోనం, పచ్చ బువ్వ బోనం ఇలా చాలా పేర్లు ఉన్నాయి.

రకరకాల నైవేద్యం

ఒక మట్టి కుండను తీసుకొని, అందులో నైవేద్యాన్ని తయారు చేస్తారు. కొంతమంది బెల్లంతో పరవాన్నం చేస్తారు. ఇలా రకరకాలతో బోనం తయారు చేస్తారు. పాత్ర పైభాగాన్ని నీళ్లతో శుభ్రం చేసి, ఆ తర్వాత తెల్ల సున్నం, పసుపు రాసి, కుంకుమతో బొట్లు పెట్టాలి. అలాగే వేపాకులు, పూలతో బోనాన్ని అందంగా అలంకరించాలి.

అడుగున ఉన్న పాత్రలో బెల్లంతో వండిన అన్నం, పొంగలి లేదా పులగం వంటివి పెడతారు. అమ్మవారికి ఈ నైవేద్యాలు అంటే చాలా ఇష్టం. పొన్నగంటి కూర కూడా వండి పెడతారు.

ఆషాఢ, శ్రావణ మాసంలో

ఐక్యత, సంస్కృతి, భక్తి భావాలకు ప్రతీక ఈ బోనాల పండుగ. ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని ప్రజలంతా కూడా ఈ బోనాల పండుగను జరుపుకుంటారు. ఆషాఢ, శ్రావణ మాసంలో తెలంగాణలో అమ్మవార్లను కొలుస్తారు. బోనాలు సమర్పించడం ఇప్పుడు వచ్చినది కాదు. తరతరాలుగా వస్తున్న ఆచారం.

గండ దీపం ప్రత్యేకత

కుండ పైభాగంలో రెండు మట్టి ప్రమిదలను పెట్టి, దీపాలను వెలిగిస్తారు. దీనిని గండ దీపం అంటారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More