చాలా మంది వాస్తు ప్రకారం కొన్ని నియమాలను పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన సానుకూల శక్తి వ్యాపించి, ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్ముతారు. వాస్తు ప్రకారం అన్ని వస్తువులను కూడా సరైన దిశలో పెట్టాలి. అప్పుడే శుభ ఫలితాలు కలుగుతాయి, అశుభ ఫలితాలు తొలగిపోతాయి.

హిందూ సంప్రదాయంలో చీపురును లక్ష్మీదేవికి ప్రత్యేక ప్రతీకగా చెప్తారు. అయితే చీపురును సరిగ్గా ఉంచితే శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. చాలా మంది చీపురు విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. సరైన దిశలో చీపురును ఉంచడంతో పాటు, కొన్ని తప్పులు చేయకుండా చూసుకోవడం చాలా అవసరం.
వాస్తు ప్రకారం సరైన దిశలో చీపురు ఉంటే సుఖసంతోషాలు, ఐశ్వర్యం, సంపద కలుగుతాయి. ఒకవేళ చీపురును సరైన దిశలో పెట్టకపోతే వాస్తు దోషాలు ఏర్పడతాయి. వాస్తు ప్రకారం చీపురును ఏ దిశలో ఉంచాలి? ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చీపురు ఏ దిశలో ఉంటే మంచిది?
వాస్తు ప్రకారం చీపురును ఉంచడానికి నైరుతి లేదా పడమర దిశలు శుభప్రదమైనవి. ఈ దిశల్లో చీపురును పెడితే సానుకూల శక్తి రెట్టింపు అవుతుంది. అలాగే ఇంటికి వచ్చిన వారికి నేరుగా చీపురు కనిపించకుండా ఉండేటట్లు చూసుకోవడం చాలా అవసరం.
చీపురును ఈ దిశలో పెట్టకండి
వాస్తు ప్రకారం చీపురును కొన్ని దిశల్లో పెట్టకూడదు. ఈశాన్యం వైపు చీపురును పొరపాటున కూడా పెట్టకండి. ఇలా చేసినట్లయితే సమస్యలు వస్తాయని నమ్ముతారు. అలాగే పూజ గదిలో, వంటగదిలో చీపురును పెట్టకుండా చూసుకోవాలి.
చీపురును పెట్టేటప్పుడు ఈ తప్పు చేయొద్దు
చాలామందికి చీపురును నిటారుగా ఉంచాలా? లేకపోతే పడుకోబెట్టి ఉంచాలా? అనే సందేహం కలిగి ఉంటారు. చీపురును ఎప్పుడూ నేలపై పడుకోబెట్టి ఉంచాలి. నిలబెట్టి ఉంచడం శుభప్రదమైనదిగా భావించరు. చీపురును నిలబెట్టకుండా పడుకోబెట్టి పెట్టడం వలన ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయని నమ్ముతారు.
పాత చీపుర్లను ఏం చేయాలి?
{{/usCountry}}చాలామందికి చీపురును నిటారుగా ఉంచాలా? లేకపోతే పడుకోబెట్టి ఉంచాలా? అనే సందేహం కలిగి ఉంటారు. చీపురును ఎప్పుడూ నేలపై పడుకోబెట్టి ఉంచాలి. నిలబెట్టి ఉంచడం శుభప్రదమైనదిగా భావించరు. చీపురును నిలబెట్టకుండా పడుకోబెట్టి పెట్టడం వలన ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయని నమ్ముతారు.
పాత చీపుర్లను ఏం చేయాలి?
{{/usCountry}}కొన్ని సార్లు చీపుర్లు అరిగిపోతాయి. ఎక్కువ కాలం చీపుర్లను వాడినప్పుడు అరిగిపోవడం సహజం. అలాంటి వాటిని ఇంటి నుంచి తొలగించి, వాటికి బదులుగా కొత్త చీపురును కొనుగోలు చేయడం మంచిది. చీపురుతో కొట్టడం, బహిరంగ ప్రదేశాల్లో పడేయడం వంటి పొరపాట్లు చేయకూడదు.
ఇల్లు ఏ సమయంలో ఊడ్చాలి?
మతపరమైన విశ్వాసాల ప్రకారం ఉదయం పూట ఇంటిని శుభ్రం చేసుకోవడం మంచిది. సూర్యాస్తమయం అయిన తర్వాత చీపురుతో ఇల్లు ఊడవేయడం మంచిది కాదు. అత్యవసర పరిస్థితిలో శుభ్రం చేయవచ్చు. కానీ చెత్తను బయట పడేయకుండా చెత్తబుట్టలో వేసి పక్కన పెట్టడం మంచిది.