...
...
Next Story

కన్యారాశిలోకి బుధుడు - శక్తివంతమైన భద్ర రాజయోగంతో ఈ 4 రాశుల వారికి లక్కీ టైమ్..!

సెప్టెంబర్ 7న బుధుడు…. కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనివల్ల అత్యంత అరుదైన భద్ర రాజయోగం ఏర్పడనుంది. ఈ గ్రహ సంచారం వల్ల వృషభం, సింహం, మకరం, కుంభ రాశుల వారికి ఆర్థికంగా, వ్యాపారపరంగా తిరుగులేని అదృష్టం వరించనుంది.

Published on: Sep 3, 2026, 16:05:11 IST
Advertisement

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల విశ్లేషణకు, రాశి పరివర్తనలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. నవగ్రహాలలో మేధస్సుకు, వ్యాపారానికి, వాక్చాతుర్యానికి అధిపతిగా భావించే బుధ గ్రహం త్వరలోనే తన సొంత రాశిలోకి అడుగుపెట్టబోతోంది. 2026 సెప్టెంబర్ 7వ తేదీన బుధుడు కన్యారాశిలోకి గోచారం చేయనున్నాడు. సెప్టెంబర్ 26వ తేదీ వరకు అంటే దాదాపు 20 రోజుల పాటు బుధుడు ఇదే రాశిలో సంచరిస్తాడు.

కన్యారాశిలోకి బుధుడు
కన్యారాశిలోకి బుధుడు

బుధుడు తన ఉచ్చ రాశి అయిన కన్యారాశిలోకి ప్రవేశించడంతో జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభప్రదమైన, అత్యంత శక్తివంతమైన 'భద్ర రాజయోగం' రూపుదిద్దుకోనుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ (సెప్టెంబర్ 4, 2026) ముగిసిన వెంటనే ఈ అరుదైన రాజయోగం ఏర్పడుతుండటం విశేషం.

ప్రముఖ జ్యోతిష్య నిపుణులు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం…. ఈ భద్ర రాజయోగ ప్రభావం వల్ల వ్యక్తుల ఆలోచనా శక్తి, తెలివితేటలు, ఆర్థిక స్థితి, ప్రసంగ శైలి బలోపేతమవుతాయి. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఈ సమయంలో అదృష్టం తెరిచి, ధన యోగం పడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆ నాలుగు రాశుల వివరాలు, వారి పొందే ప్రయోజనాలు ఇవే…

వృషభ రాశి :

వృషభ రాశి వారికి బుధుడు ఐదో ఇంట్లో సంచరిస్తాడు. దీని ఫలితంగా విద్యార్థులకు, విద్యా సంబంధిత రంగాల్లో ఉన్నవారికి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. నిలిచిపోయిన పనులు వేగవంతం కావడమే కాకుండా ఆర్థికంగా కలసివస్తుంది. చాన్నాళ్లుగా రాకుండా వేధిస్తున్న బాకీలు లేదా చిక్కుకుపోయిన డబ్బు ఈ సమయంలో చేతికి అందుతుంది. వ్యాపారంలో ఆశించిన మార్పులు వచ్చి రాబడి పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. పిల్లల వైపు నుంచి నూతన ప్రోత్సాహం, శుభవార్తలు వింటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది.

సింహ రాశి :

మకర రాశి వారికి ఈ భద్ర రాజయోగం తీపి కబురును అందిస్తుంది. వ్యక్తిగత ప్రతిభ వెలుగులోకి రావడంతో పాటు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సొంతంగా వ్యాపారాలు చేసేవారికి లాభాల పంట పండుతుంది. కెరీర్‌లో అనుకున్న లక్ష్యాలను నిర్దేశిత సమయంలోగా చేరుకుంటారు. పాత పెట్టుబడుల నుంచి ఊహించని రీతిలో మంచి రాబడి (రిటర్న్స్) లభిస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. మానసిక ఒత్తిడి తొలగి ఉపశమనం లభిస్తుంది.

కుంభ రాశి :

ఈ రాశి వారికి కన్యారాశిలోని బుధ సంచారం అత్యంత అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ కాలంలో మీరు తీసుకునే కీలక నిర్ణయాలు భవిష్యత్తులో మీ అభివృద్ధికి గట్టి పునాది వేస్తాయి. మీ వ్యూహాలను, పనితీరును ఉన్నతాధికారులు మెచ్చుకుంటారు. వ్యాపారంలో పెద్ద ఎత్తున ఒప్పందాలు (డీల్స్) కుదుర్చుకోవడానికి సమయం అనుకూలంగా ఉంది. భూమి, భవనం లేదా కొత్త వాహనం కొనుగోలు చేసే యోగం ఉంది. ఆర్థిక పరిస్థితులు పుంజుకోవడంతో పాటు దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది.

వీరితో పాటు కన్యా, మిథున, కర్కాటక, వృశ్చిక మరియు మీన రాశుల వారికి కూడా ఈ 20 రోజుల వ్యవధిలో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ వివరించారు. ధన ప్రవాహం పెరగడంతో పాటు ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల మార్పులు చూస్తారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe