...
...
Next Story

కన్యారాశిలోకి బుధుడి సంచారం - ఈ 5 రాశుల వారికి సెప్టెంబర్ 26 వరకు పట్టిందల్లా బంగారమే!

సెప్టెంబర్ 7న బుధుడు తన సొంత రాశి అయిన కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ ప్రకారం… ఈ సంచారంతో వృషభం, మిథునం సహా 5 రాశుల వారికి ఆర్థికంగా, ఉద్యోగపరంగా అపార ప్రయోజనాలు కలుగనున్నాయి.

Published on: Sep 5, 2026, 15:43:59 IST
Advertisement

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా బుద్ధి, వ్యాపారం, వాక్చాతుర్యానికి కారకుడైన బుధ గ్రహం రాశి మారినప్పుడు దాని ప్రభావం అన్ని రాశులపై స్పష్టంగా కనిపిస్తుంది. ప్రసిద్ధ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 1:35 గంటలకు బుధుడు తన స్వక్షేత్రమైన కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు.

కన్యారాశిలోకి బుధుడి సంచారం
కన్యారాశిలోకి బుధుడి సంచారం

బుధుడు తన సొంత రాశి అయిన కన్యారాశిలో ప్రవేశించడం అత్యంత శుభపరిణామంగా జ్యోతిష్య నిపుణులు భావిస్తారు. రాబోయే 20 రోజుల పాటు, అంటే సెప్టెంబర్ 26 వరకు బుధుడు ఇదే రాశిలో సంచరిస్తాడు. ఈ కాలంలో ముఖ్యంగా 5 రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆదాయ మార్గాల పరంగా ఊహించని ప్రయోజనాలు లభించనున్నాయి. ఆదృష్టం వరించే ఆ 5 రాశుల వివరాలు ఇక్కడ చూద్దాం:

వృషభ రాశి:

బుధుడి కన్యా రాశి ప్రవేశం వృషభ రాశి వారికి అత్యంత లాభదాయకంగా ఉండబోతోంది. దీర్ఘకాలంగా వేధిస్తున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో కొత్త బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త భాగస్వాములు తోడవ్వడంతో వ్యాపారం సరైన దిశలో పురోగమిస్తుంది. ఎక్కడైనా నిలిచిపోయిన సొమ్ము తిరిగి మీ చేతికి అందుతుంది.

మిథున రాశి:

ఈ రాశికి అధిపతి స్వయంగా బుధుడే కావడం వల్ల, ఈ సంచారం వీరికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. రాబోయే రోజుల్లో సంపాదన గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగంలో మీ పనికి తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. పదోన్నతి (ప్రమోషన్) లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే, తొందరపాటుతనంతో ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.

కన్యా రాశి:

ఈ రాశి వారికి బుధుడి మార్పు సంపాదన పరంగా అనుకూల ఫలితాలను ఇస్తుంది. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తవుతాయి. ఉద్యోగంలో పైఅధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టులు దక్కడం వల్ల లాభాల బాట పడతారు. సమాజంలో హోదా, గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

మకర రాశి:

మకర రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో పెద్ద ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి కాస్త పెరిగినప్పటికీ, భవిష్యత్తులో అది మీకు ఎంతో ప్రయోజనకరంగా మారుతుంది. వ్యాపారస్తులు లాభదాయకమైన కొత్త ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe