హిందూ ధర్మంలో ప్రదోష వ్రతానికి అత్యంత విశేషమైన స్థానం ఉంది. ప్రతీ నెలలో వచ్చే కృష్ణ, శుక్ల పక్షాల త్రయోదశి తిథి రోజున ఈ వ్రతాన్ని ఆచరించి పరమశివుడిని పూజిస్తారు. రాబోయే సెప్టెంబర్ 23, 2026 బుధవారం రోజున భాద్రపద మాస శుక్ల పక్ష త్రయోదశి సందర్భంగా 'బుధ ప్రదోష వ్రతం' అరుదైన యోగం ఏర్పడుతోంది. ఈ పవిత్ర రోజున భోళా శంకరుడిని భక్తిశ్రద్ధలతో పూజించడంతో పాటు ప్రదోష వ్రత కథను పఠించడం తప్పనిసరి అని పురాణాలు చెబుతున్నాయి. కథ చదవకుండా లేదా వినకుండా ఈ వ్రతాన్ని పూర్తి చేస్తే సంపూర్ణ ఫలితం దక్కదని భక్తుల నమ్మకం.
పౌరాణిక కథ

పురాణాల ప్రకారం, పూర్వకాలంలో ఒక వ్యక్తికి వివాహం జరిగింది. పెళ్లయిన కొద్ది రోజులకే అతను తన భార్యను అత్తగారింటి నుంచి తీసుకు రావడం కోసం వెళ్లాడు. అత్తగారితో మాట్లాడుతూ తాను బుధవారమే తన భార్యను తీసుకుని స్వగ్రామానికి బయలుదేరుతానని చెప్పాడు. ఆ రోజు బుధవారం కాబట్టి ప్రయాణం చేయడం అశుభమని అత్తమామలు ఎంతగానో వారించారు. కానీ ఆ వ్యక్తి వారి మాట వినకుండా బలవంతంగా భార్యను తీసుకుని బయలుదేరాడు.
ఇద్దరూ కలిసి ఎద్దుల బండిపై ప్రయాణం సాగిస్తున్నారు. ఒక నగరం దాటి వెళ్తున్న సమయంలో ఆ ఇల్లాలికి బాగా దాహం వేసింది. దాంతో భర్త నీరు తెచ్చేందుకు బండి దిగి నీటి పాత్రతో సమీపంలోని నీటి వనరు వద్దకు వెళ్లాడు.
నివ్వెరపోయిన భర్త
అతను నీరు తీసుకుని తిరిగి వచ్చేసరికి అక్కడ జరిగిన దృశ్యం చూసి గుండె ఆగినంత పనైంది. తన భార్య పక్కనే తనలాగే ఉన్న మరో వ్యక్తి కూర్చుని ఆమెతో సరదాగా కబుర్లు చెబుతున్నాడు. అది చూసి కోపంతో ఊగిపోయిన భర్త, "నువ్వు ఎవరు? నా భార్య పక్కన ఎందుకు కూర్చున్నావు?" అని నిలదీశాడు.
అందుకు ఆ అవతలి వ్యక్తి, "తాను నా భార్య. నా అత్తగారింటి నుంచి నేను ఈమెను తీసుకువస్తున్నాను. నువ్వు నన్ను అడగడానికి ఎవరు?" అంటూ ఎదురు తిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి పెద్దదైంది. వారి గొడవ చూసి అక్కడికి చేరుకున్న రాజభటులు ఆస్త్రీని పిలిచి, "వీరిద్దరిలో నీ అసలు భర్త ఎవరో చెప్పు" అని అడిగారు. కానీ ఆ ఇల్లాలికి కూడా ఇద్దరూ ఒకేలా కనిపించడంతో అసలు భర్త ఎవరో గుర్తుపట్టలేక తీవ్ర భయాందోళనకు గురైంది.
పరమశివుడిని వేడుకున్న భర్త
{{/usCountry}}అందుకు ఆ అవతలి వ్యక్తి, "తాను నా భార్య. నా అత్తగారింటి నుంచి నేను ఈమెను తీసుకువస్తున్నాను. నువ్వు నన్ను అడగడానికి ఎవరు?" అంటూ ఎదురు తిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి పెద్దదైంది. వారి గొడవ చూసి అక్కడికి చేరుకున్న రాజభటులు ఆస్త్రీని పిలిచి, "వీరిద్దరిలో నీ అసలు భర్త ఎవరో చెప్పు" అని అడిగారు. కానీ ఆ ఇల్లాలికి కూడా ఇద్దరూ ఒకేలా కనిపించడంతో అసలు భర్త ఎవరో గుర్తుపట్టలేక తీవ్ర భయాందోళనకు గురైంది.
పరమశివుడిని వేడుకున్న భర్త
{{/usCountry}}ఇదంతా చూసి నిరాశ నిస్పృహలకు లోనైన ఆ భర్త నిస్సహాయ స్థితిలో పరమశివుడిని శరణు కోరాడు. చేతులు జోడించి కన్నీళ్లతో వేడుకుంటూ, "ఓ మహాదేవా! నన్ను క్షమించు. పెద్దలు, శాస్త్రాలు చెప్పిన మాట వినకుండా బుధవారం నాడు ప్రయాణం పెట్టుకున్నందుకు నాకు తగిన శాస్తే జరిగింది. నన్ను, నా భార్యను కాపాడు స్వామి" అని మనసారా ప్రార్థించాడు.
ఆ భక్తుడి ఆర్తనాదం విన్న పరమశివుడు కరిగిపోయాడు. ఆ క్షణంలోనే ఆ మారురూపంలో ఉన్న వ్యక్తి అదృశ్యమయ్యాడు. అప్పుడు ఆ దంపతులకు ఇది పరమశివుడి లీల అని అర్థమైంది. ఇద్దరూ సురక్షితంగా తమ స్వగ్రామం చేరుకున్నారు. ఆ రోజు నుంచి ఆ దంపతులు ప్రతీ నెల వచ్చే శుక్ల, కృష్ణ పక్షాల త్రయోదశి తిథి రోజున బుధ ప్రదోష వ్రతం ఆచరించడం ప్రారంభించారు.
బుధ ప్రదోష ఫలం
జ్యోతిష్య మరియు ధార్మిక విశ్వాసాల ప్రకారం, బుధ ప్రదోష వ్రతం ఆచరించడం వల్ల వైవాహిక జీవితంలో వచ్చే అడ్డంకులు, భార్యాభర్తల మధ్య గొడవలు శాశ్వతంగా తొలగిపోతాయి. భక్తుల కోరికలన్నీ నెరవేరి, తలపెట్టిన పనులలో ఎదురయ్యే విఘ్నాలు పూర్తిగా సమసిపోతాయి.