జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గమనంలో మార్పులు మానవ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా బుధుడి వక్రగమనం కమ్యూనికేషన్, వ్యాపార లావాదేవీలపై పెనుమార్పులు తెస్తుంది. జూన్ 29 నుంచి దాదాపు 25 రోజుల పాటు ఏ రాశుల వారు అప్రమత్తంగా ఉండాలో ఇక్కడ తెలుసుకోండి.
బుధ వక్రగమనం అంటే ఏమిటి?

జ్యోతిష్య శాస్త్రంలో బుధుడిని బుద్ధికి, వాక్చాతుర్యానికి, వ్యాపారానికి కారకుడిగా భావిస్తారు. సాధారణంగా బుధుడు తన వేగాన్ని తగ్గించుకుని వెనక్కి వెళ్తున్నట్లుగా కనిపించడాన్నే ‘వక్రగమనం’ అంటారు. జూన్ 29, 2026 సోమవారం నుంచి ప్రారంభమై, జూలై 24 వరకు బుధుడు వక్ర స్థితిలో ఉంటాడు. ఈ 25 రోజుల కాలం అన్ని రాశుల వారిపై ప్రభావం చూపినప్పటికీ, ఐదు రాశుల వారికి మాత్రం గ్రహస్థితి అనుకూలంగా లేదు. ఈ సమయంలో ఆయా రాశుల వారు ఆర్థికంగా, వృత్తిపరంగా ఆచితూచి అడుగు వేయడం మంచిది.
ఈ రాశుల వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి
గ్రహాల ప్రతికూల ప్రభావం వల్ల ఈ కింది రాశుల వారు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు:
మిథున రాశి: బుధుడు మీ రాశ్యాధిపతి కావడంతో, ఈ వక్రగమనం మీపై అధిక ప్రభావం చూపుతుంది. ఆదాయానికి, వ్యయానికి మధ్య సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది. కుటుంబంలో అనవసర గొడవలు రావచ్చు. ముఖ్యంగా ఎమోషనల్ అయి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి.
కర్కాటక రాశి: కెరీర్‌లో ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు గందరగోళానికి గురవుతారు. మానసిక ప్రశాంతత లోపించడం, ప్రేమ సంబంధాల్లో మనస్పర్థలు రావడం వంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు.
కన్యా రాశి: ఆఫీసులో పై అధికారులతో వాదనలకు దిగే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు. గుర్తు తెలియని వ్యక్తులతో డబ్బు పరంగా డీల్స్ వద్దు.
{{/usCountry}}కన్యా రాశి: ఆఫీసులో పై అధికారులతో వాదనలకు దిగే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు. గుర్తు తెలియని వ్యక్తులతో డబ్బు పరంగా డీల్స్ వద్దు.
{{/usCountry}}వృశ్చిక రాశి: ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి ఆలస్యం తప్పదు. కోర్టు కేసులు లేదా చట్టపరమైన చిక్కుల్లో పడే సూచనలు ఉన్నాయి. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు మీకే నష్టం కలిగిస్తాయి.
మీన రాశి: ఈ సమయంలో పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. రిస్క్ తీసుకుంటే నష్టపోయే అవకాశం ఉంది. అనవసర ఖర్చుల వల్ల మానసిక ఒత్తిడి పెరగవచ్చు.
బుధుడి ప్రభావం తగ్గించుకోవడానికి మార్గాలు
జ్యోతిష్య నిపుణుల సూచన మేరకు, ఈ కష్టకాలంలో ఉపశమనం కోసం కొన్ని పరిహారాలు పాటించవచ్చు:
మంత్ర జపం:
ప్రతిరోజూ ఉదయం 'ఓం బుం బుధాయ నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి.
దాన ధర్మాలు:
ప్రతి బుధవారం పేదలకు లేదా బ్రాహ్మణులకు పెసరపప్పు, పచ్చని కూరగాయలు లేదా ఆకుపచ్చని దుస్తులను దానం చేయండి.
పక్షులకు సేవ:
పక్షులకు గింజలు వేయడం వల్ల బుధుడి దోషాలు తగ్గుతాయి.
ఆత్మ నియంత్రణ:
మీ మాటపై, కోపంపై అదుపు కలిగి ఉండండి. వీలైనంత వరకు మనసును ప్రశాంతంగా ఉంచుకోండి.
వాస్తు జాగ్రత్త:
ఇంటికి ఉత్తర దిశను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి.
ఈ కాలంలో గ్రహాల సంచారం వల్ల కలిగే ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉండటం, సమయానుకూల నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం.