Three Planets Conjunction: బుధుడు, గురుడు, శుక్రుడు కలయిక.. వృషభం నుంచి మీనం వరకు ఈ రాశుల వారికి శుభకాలం!

జూన్ 22న బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో, ఇప్పటికే అక్కడ సంచరిస్తున్న గురుడు మరియు శుక్రుడితో కలిసి త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యోగం అన్ని రాశులపై ప్రభావం చూపించినప్పటికీ, ముఖ్యంగా వృషభ, కర్కాటక, కన్య, మీన రాశుల వారికి అత్యంత శుభ ఫలితాలను అందించనుంది.

Published on: Jun 19, 2026, 15:30:56 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి గ్రహాల వలన శుభ ఫలితాలు కలిగితే, మరోసారి అశుభ ఫలితాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Three Planets Conjunction: బుధుడు, గురుడు, శుక్రుడు కలయిక.. వృషభం నుంచి మీనం వరకు ఈ రాశుల వారికి శుభకాలం! (pinterest)
Three Planets Conjunction: బుధుడు, గురుడు, శుక్రుడు కలయిక.. వృషభం నుంచి మీనం వరకు ఈ రాశుల వారికి శుభకాలం! (pinterest)

మరో రెండు రోజుల్లో ఇది ఏర్పడబోతోంది. జూన్ 22న బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. జూన్ 2 నుంచి గురువు కర్కాటకంలోనే సంచారం చేస్తున్నాడు. జూన్ 8న శుక్రుడు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. జూన్ 22న బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన వెంటనే త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ మూడు గ్రహాల కలయిక వలన ఏర్పడే ఈ యోగం వలన కొన్ని రాశుల వారు భారీగా లాభాలను పొందబోతున్నారు. బుధుడు, గురువు, శుక్ర గ్రహాల కలయికతో ఏర్పడే ఈ యోగం ఈ రాశుల వారికి కనీవినీ ఎరుగని విధంగా లాభాలను అందించనుంది.

ఈ యోగం అన్ని రాశుల వారిపై ప్రభావం చూపించినప్పటికీ, వృషభ, కర్కాటక, కన్య, మీన రాశుల వారికి అనేక విధాలుగా లాభాలను తీసుకువస్తుంది. మరి ఈ రాశుల వారు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడే చూసేయండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు ఈ యోగంతో అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. భూమికి సంబంధించిన పనుల్లో విజయాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు ఆర్థిక లాభాలను తీసుకు వస్తాయి. బంధువులు లేదా ప్రభుత్వ పథకాల నుంచి ఆర్థిక సహాయాన్ని పొందుతారు. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశాలు ఉన్నాయి. వివాహితులకు అత్తింటి వారి నుంచి భారీగా ధన లాభం కలుగుతుంది. పెట్టుబడుల ద్వారా మంచి ఆదాయం వస్తుంది.

వృషభ రాశి

రాశి వారికి కూడా ఈ యోగం మంచి ఫలితాలను అందిస్తుంది. మీ మాటతీరుతో అందరినీ ఆకర్షిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారులకు రావాల్సిన బకాయిలు అందుతాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి శుభవార్తలు అందుతాయి. దాంపత్య జీవితంలో విభేదాలు తగ్గి, సంతోషంగా ఉంటారు.

కన్య రాశి

కన్యా రాశి వారికి పదోన్నతి కలుగుతుంది. శుభవార్తలను పొందుతారు. వ్యాపారస్తులకు కూడా ఇది మంచి సమయం. విద్యార్థులు జ్ఞానాన్ని మరింత విస్తరించుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ సంబంధాల్లో భాగస్వామి నుంచి ప్రేమ, సహకారం లభిస్తుంది. కొత్త పెట్టుబడులు భవిష్యత్తులో ఆర్థిక అభివృద్ధికి సాయపడతాయి.

మీన రాశి

ఈ రాశి వారికి ఈ యోగం మంచి ఫలితాలను అందిస్తుంది. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఉపశమనాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులు లేదా బంధువుల నుంచి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారస్తులు భారీగా లాభాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది. కొత్త అవకాశాలను పొందుతారు. జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More