నిజ జీవితంలో మన చుట్టూ ఉండే కొందరు వ్యక్తులు ఎంతో మంచివారిలా నటిస్తూ, మాయమాటలతో మనల్ని తమ చెప్పుచేతల్లో పెట్టుకుంటారు. వారు మాట్లాడే ప్రతీ మాట, ఇచ్చే ప్రతీ సలహా మన మంచికే అన్నట్లుగా భ్రమింపజేస్తారు. వారి అసలు రంగు బయటపడేలోపే మనం వారిని గుడ్డిగా నమ్మేస్తామని చాణక్యనీతి చెబుతోంది. ఇలాంటి స్వార్థపరులు మన బలహీనతలను ఆసరాగా చేసుకుని, జీవితంలో సమస్యలు సృష్టిస్తారని ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఎప్పుడో హెచ్చరించారు.

ఒక వ్యక్తి బలహీనంగా ఉండటం వల్ల ఓడిపోడు.. ఇతరుల మాయమాటల ప్రభావంలో పడి సొంతంగా ఆలోచించే శక్తిని కోల్పోయినప్పుడే బలహీనుడవుతాడని చాణక్యుడు చెప్పాడు. ఇతరులు మిమ్మల్ని మానసికంగా ఎలా మాయ చేస్తారో తెలిపే 6 ప్రధాన సంకేతాలు ఇక్కడ ఉన్నాయి.
అతి జాగ్రత్త నటిస్తూ.. మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు
స్వార్థపరులు మొదట మీపై విపరీతమైన ప్రేమ, జాగ్రత్త ఉన్నట్లు నటిస్తారు. మీరు ఏదైనా కొత్త పని చేయబోతుంటే.. అది నీవల్ల కాదు, జాగ్రత్త, నష్టపోతావు అంటూ పదేపదే హెచ్చరిస్తారు. మొదట్లో ఇది మీకు సపోర్ట్‌గా అనిపించినా, రానురానూ మీకు మీపై నమ్మకం పోతుంది. ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా భయపడుతూ, వారి సలహా కోసం ఎదురుచూసే స్థితికి చేరుకుంటారు. నిజమైన శ్రేయోభిలాషులు మీకు ధైర్యం చెబుతారు కానీ, మాయగాళ్లు మిమ్మల్ని భయపెట్టి మీ ఆత్మవిశ్వాసాన్ని చంపేస్తారు. అలాంటి వారి నుండి వెంటనే దూరంగా ఉండాలి.
మిమ్మల్ని అపరాధ భావనలోకి నెట్టేస్తారు
కొందరు తమ పనులు చక్కబెట్టుకోవడానికి మీతో నేరుగా వాదించరు. గతంలో వారు మీకు చేసిన సహాయాలను, త్యాగాలను పదేపదే గుర్తు చేస్తారు. నేను నీకోసం ఇంత చేశాను, నా కోసం ఇది చేయలేవా? అంటూ మిమ్మల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. అక్కడ ఎవరు తప్పు, ఎవరు ఒప్పు అనే లాజిక్ పోయి మీరు ఏదో పెద్ద తప్పు చేసినట్లు బాధపడతారు. వారితో గొడవ పడటం ఎందుకని ఇష్టం లేకపోయినా వారు చెప్పినదానికి తలూపుతారు.
సంప్రదాయం, విలువల పేరుతో మీ నోరు మూయిస్తారు
ఇది ఎక్కువగా కుటుంబాలలో, పనిచేసే ఆఫీసులలో జరుగుతుంది. మీరు ఏదైనా తప్పును ప్రశ్నించినప్పుడు, దానికి సరైన సమాధానం చెప్పకుండా.. మన ఇంట్లో పెద్దల కాలం నుండి ఇదే ఆచారం, లేదా ఆఫీసులో అందరూ ఇలాగే చేస్తారు, నువ్వేంటి కొత్తగా మాట్లాడుతున్నావు? అంటూ అక్కడితో చర్చను ఆపేస్తారు. ప్రశ్నించిన మీరే ఏదో తప్పు చేసినట్లు మిమ్మల్ని దోషిగా నిలబెడతారు. విలువలు మనకు దారి చూపాలి తప్ప.. మన ఆలోచనలను బంధించకూడదు.
అసలు నిజాలను దాచిపెట్టి, సగం సమాచారమే ఇస్తారు
{{/usCountry}}ఇది ఎక్కువగా కుటుంబాలలో, పనిచేసే ఆఫీసులలో జరుగుతుంది. మీరు ఏదైనా తప్పును ప్రశ్నించినప్పుడు, దానికి సరైన సమాధానం చెప్పకుండా.. మన ఇంట్లో పెద్దల కాలం నుండి ఇదే ఆచారం, లేదా ఆఫీసులో అందరూ ఇలాగే చేస్తారు, నువ్వేంటి కొత్తగా మాట్లాడుతున్నావు? అంటూ అక్కడితో చర్చను ఆపేస్తారు. ప్రశ్నించిన మీరే ఏదో తప్పు చేసినట్లు మిమ్మల్ని దోషిగా నిలబెడతారు. విలువలు మనకు దారి చూపాలి తప్ప.. మన ఆలోచనలను బంధించకూడదు.
అసలు నిజాలను దాచిపెట్టి, సగం సమాచారమే ఇస్తారు
{{/usCountry}}మాయ చేసేవారు ఎప్పుడూ పూర్తి విషయాలు చెప్పరు. కానీ మీకు ఏది అవసరమో ఆ ముఖ్యమైన విషయాన్ని దాచిపెట్టి, వారికి అనుకూలంగా ఉండే సగం నిజాన్ని మాత్రమే చెబుతారు. దాంతో మీరు అన్నీ ఆలోచించి సొంతంగానే నిర్ణయం తీసుకున్నానని భ్రమపడతారు. తీరా ఆ నిర్ణయం వల్ల నష్టం జరిగాక ఇదంతా నా వల్లే జరిగిందని మిమ్మల్ని మీరే నిందించుకుంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైన మోసం అని చాణక్యనీతి చెబుతోంది.
మీ ఆలోచనలనే నెమ్మదిగా మార్చేస్తారు
ఇది చాలా లోతైన కుట్ర. మీ చుట్టూ ఉండే కొందరు వ్యక్తులు కొన్ని భయాలను, అనుమానాలను మాటల సందర్భంలో పదేపదే మీ ముందు ప్రస్తావిస్తారు. మొదట్లో మీరు వాటిని పట్టించుకోకపోయినా, రోజూ అవే మాటలు వినడం వల్ల అవే నిజమని నమ్మడం మొదలుపెడతారు. ఒకరోజు చూస్తే.. అసలు మీకు సంబంధం లేని వారి ఆలోచనలను, మీ సొంత అభిప్రాయాలుగా భావించి ఇతరులతో వాదిస్తుంటారు.
అతిగా పొగుడుతూ.. మిమ్మల్ని గుప్పిట్లో పెట్టుకుంటారు
స్వార్థపరులు మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తూ పొగుడుతారు. మీరు వారి మాటకు తలూపినంత సేపు నీ అంత తెలివైన వారు లేరు, నువ్వు చాలా మంచోడివి అంటారు. ఒక్కసారి మీరు వారి మాటను కాదంటే చాలు.. మిమ్మల్ని చెడ్డవారిలా చూస్తారు. ఆ పొగడ్తలకు అలవాటు పడిన మీరు.. వారి దృష్టిలో చెడ్డవారు కాకూడదనే భయంతో మీ సొంత అభిప్రాయాలను చంపుకొని వారు చెప్పినట్లే వింటారు. ఇలా మీ అహాన్ని తృప్తిపరుస్తూ, మీ స్వేచ్ఛను వారు దొంగిలిస్తారని చాణక్యనీతి చెబుతోంది.
ABOUT THE AUTHOR
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.