చాణక్య నీతి: పురోగతి, సంతోషకరమైన జీవితం కోసం మహిళల నుండి నేర్చుకోవలసిన విషయం ఇది!

ఆచార్య చాణక్యుడి నీతి శాస్త్రం కేవలం ఒక పుస్తకం కాదు, అది జీవిత పాఠాల నిధి. పురోగతి సాధించాలంటే కేవలం కష్టం మాత్రమే సరిపోదని, సరైన గుణాలను అలవర్చుకోవాలని చాణక్యుడు బోధించాడు. ఆయన చెప్పిన ఒక శ్లోకం ద్వారా ఎవరి నుంచి ఏ లక్షణాలను నేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

Published on: Apr 14, 2026, 08:00:46 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జీవితంలో విజయం సాధించాలంటే ప్రతి సందర్భం నుంచి, ప్రతి వ్యక్తి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. మనం సాధారణంగా నేర్చుకోలేము అనుకునే చోట్ల నుంచి కూడా విలువైన పాఠాలను గ్రహించవచ్చని చాణక్యుడు తన నీతి శాస్త్రంలోని 12వ అధ్యాయం, 18వ శ్లోకంలో వివరించారు. ఆ శ్లోకం దాని అంతరార్థం ఇక్కడ చూద్దాం.

పురోగతి, సంతోషకరమైన జీవితం కోసం మహిళల నుండి నేర్చుకోవలసిన విషయం
పురోగతి, సంతోషకరమైన జీవితం కోసం మహిళల నుండి నేర్చుకోవలసిన విషయం

చాణక్య నీతిలో ముఖ్యమైన శ్లోకం

వినయం రాజపుత్రేభ్యః పండితేభ్యః సుభాషితమ్

అనృతం ద్యూతకారేభ్యః స్త్రీభ్యః శిక్షేత్ కైతవమ్

ఈ శ్లోకంలో చాణక్యుడు నాలుగు వేర్వేరు మూలాల నుండి నాలుగు రకాల గుణాలను నేర్చుకోవాలని సూచించారు.

1. రాజపుత్రుల నుంచి 'వినయం'

పెద్ద మనుషులు, రాజకుమారులు లేదా నాయకుల నుంచి మనం 'వినయం' నేర్చుకోవాలి. ఇక్కడ వినయం అంటే కేవలం నమస్కరించడం కాదు.. క్రమశిక్షణ, మృదువుగా మాట్లాడటం మరియు ఇతరులకు గౌరవం ఇవ్వడం. ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా వినయంగా ఉండేవారికి అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి. నమ్రత కలిగిన వ్యక్తి ఎక్కడైనా రాణించగలడు.

2. పండితుల నుంచి 'సుభాషితం' (మాట్లాడే తీరు)

ఏ సమయంలో ఏమి మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి అనేది పండితుల నుంచి నేర్చుకోవాలి. పండితులకు కేవలం జ్ఞానం మాత్రమే కాదు, వాక్శుద్ధి కూడా ఉంటుంది. ఎవరితో సరదాగా ఉండాలి, ఎవరిపై కోపం ప్రదర్శించాలి అనే విషయంలో వారికి స్పష్టత ఉంటుంది. వారి కోపం కూడా వృథాగా పోదు, అది ఒక ప్రయోజనం కోసమే ఉంటుంది. ఈ గుణాన్ని అలవర్చుకోవడం వల్ల మన మాటలకు సమాజంలో విలువ పెరుగుతుంది.

3. జూదగాళ్ల నుంచి 'సమయస్ఫూర్తి'

జూదగాళ్ల నుంచి అసత్యం చెప్పడం నేర్చుకోవాలని చాణక్యుడు అనడంలో ఒక గూఢార్థం ఉంది. ఇక్కడ అబద్ధం అంటే ఎవరినో మోసం చేయడం కాదు.. ఇది ఒక రకమైన 'డిప్లొమసీ' (కౌటిల్యం). అంటే ఒక పెద్ద నష్టాన్ని నివారించడానికి సమయానుకూలంగా మాటను ఎలా మార్చాలి లేదా నిజాన్ని ఎలా దాచాలి అనే ప్రాక్టికల్ తెలివితేటలను వారి నుంచి గ్రహించాలి. పరిస్థితిని మనకు అనుకూలంగా మార్చుకునే చాకచక్యం ఇది.

4. మహిళల నుంచి 'చాతుర్యం'

చాణక్య నీతిలోని అత్యంత ఆసక్తికరమైన అంశం ఇది. మహిళల నుండి భావోద్వేగ మేధస్సు (Emotional Intelligence), అవగాహన మరియు పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునే కళను నేర్చుకోవాలి. మహిళలు సంబంధాలను కాపాడుకుంటూనే, ఎటువంటి ఘర్షణలు లేకుండా తమ పనిని ఎలా పూర్తి చేసుకోవాలో తెలిసిన వారు. ఈ నేర్పు ప్రతి వ్యక్తికి అవసరం, ఎందుకంటే ఇది జీవితాన్ని సుఖమయం చేస్తుంది.

నేటి కాలంలో చాణక్యుడి బోధనల ప్రాముఖ్యత

వందల ఏళ్ల క్రితం చెప్పిన ఈ మాటలు నేటి ఆధునిక ప్రపంచానికి కూడా సరిగ్గా సరిపోతాయి. ఈ రోజుల్లో కేవలం డిగ్రీలు ఉంటే సరిపోదు. వినయం, వాక్చాతుర్యం, ప్రాక్టికల్ తెలివితేటలు మరియు ఎమోషనల్ మేనేజ్‌మెంట్ ఉండాలి. ముఖ్యంగా మహిళల నుంచి నేర్చుకోవాల్సిన ఆ సూక్ష్మ దౌత్యం మనల్ని కుటుంబంలో మరియు సమాజంలో ఒక సమతుల్యమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More