మనిషి జీవితాన్ని విజయపథంలో నడిపించడానికి ఆచార్య చాణక్యుడు చెప్పిన నీతులు నేటి ఆధునిక కాలంలోనూ ఎంతో ప్రయోజనకరంగా నిలుస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషుల ప్రవర్తన మారుతున్నప్పటికీ, చాణక్యుడు తన 'నీతి శాస్త్రం'లో పొందుపరిచిన మానవ స్వభావ విశ్లేషణ మాత్రం ఎప్పటికీ శాశ్వతమే. అందుకే నేటికీ ఎంతోమంది తమ నిత్య జీవితంలో చాణక్య సూత్రాలను ఆచరించి ఇబ్బందుల నుంచి గట్టెక్కుతున్నారు. చాణక్యుడి సిద్ధాంతాల ప్రకారం 'మౌనం' అనేది మనిషికి అతిపెద్ద అస్త్రం మాత్రమే కాదు, అత్యుత్తమ ఆభరణం కూడా.
అనర్థాలను తెచ్చే మాటల కంటే మౌనమే మేలు

జీవితంలో ప్రతీచోటా మన అభిప్రాయాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో నోరు మూసుకుని ఉండటమే గొప్ప పరిపక్వతకు నిదర్శనం. అకారణంగా తలెత్తే వివాదాలు, శత్రువుల నుంచి రక్షణ పొందడానికి ఏయే సమయాల్లో మౌనం పాటించాలో చాణక్యుడు స్పష్టంగా వివరించారు. సరైన సమయంలో నోరు విప్పకపోతే అనర్థాలు కొనితెచ్చుకున్నట్టేనని ఆయన హెచ్చరిస్తున్నారు.
1. మూర్ఖులు, అజ్ఞానుల మధ్యలో ఉన్నప్పుడు
సమాజంలో కొందరు వ్యక్తులు విషయ అవగాహన లేకుండా కేవలం వాదనల కోసమే మాట్లాడుతుంటారు. అలాంటి చోట మనకు తెలిసినా మాట్లాడటం మన విజ్ఞతను మనమే అవమానించుకోవడంతో సమానం. "మూర్ఖుడు తాను మాట్లాడేవరకు మాత్రమే అందరి గౌరవం పొందుతాడు. ఎప్పుడైతే నోరు విప్పుతాడో, అతని అజ్ఞానం బయటపడుతుంది," అని చాణక్యుడు పేర్కొన్నారు. అందువల్ల విద్వాంసులు లేని చోట, కేవలం వాగ్వాదాలు జరిగే సభల్లో మౌనంగా ఉండటమే మన గౌరవాన్ని కాపాడుకునే ఏకైక మార్గం.
2. అనర్హులకు హితబోధ చేసేటప్పుడు
ధర్మం, సత్యం పట్ల కనీస గౌరవం లేనివారికి, చెప్పే విషయాన్ని గ్రహించే అర్హత లేనివారికి సలహాలు ఇవ్వకూడదు. అర్హత లేని మూర్ఖ శిష్యుడికి ఉపదేశించడం, దుష్ట ప్రవర్తన కలిగిన వ్యక్తులను భరించడం వల్ల మేధావులు సైతం మానసిక క్షోభను అనుభవిస్తారని చాణక్యుడు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో వాదోపవాదాలకు వెళ్లకుండా మౌనంగా తప్పుకోవడమే ఉత్తమం.
3. మనకు అవమానం ఎదురైనప్పుడు
ఎక్కడైతే మీ మాటలకు విలువ ఉండదో, మిమ్మల్ని కించపరచడమే లక్ష్యంగా వాతావరణం ఉంటుందో, అక్కడ మీ శక్తిని వృథా చేసుకోవద్దు. మనసులోని ఆలోచనలను, ప్రణాళికలను ఎల్లప్పుడూ గోప్యంగా ఉంచుకోవాలి. గౌరవం లేని చోట వాదిస్తే మీ ప్లాన్స్‌ను ఇతరులు చెడగొట్టే ప్రమాం ఉంది. అలాంటి చోట ప్రశాంతంగా ఉంటూ మౌనంగా మీ పని మీరు పూర్తి చేసుకోవాలి.
4. పూర్తి సమాచారం లేని సందర్భాలలో
{{/usCountry}}ఎక్కడైతే మీ మాటలకు విలువ ఉండదో, మిమ్మల్ని కించపరచడమే లక్ష్యంగా వాతావరణం ఉంటుందో, అక్కడ మీ శక్తిని వృథా చేసుకోవద్దు. మనసులోని ఆలోచనలను, ప్రణాళికలను ఎల్లప్పుడూ గోప్యంగా ఉంచుకోవాలి. గౌరవం లేని చోట వాదిస్తే మీ ప్లాన్స్‌ను ఇతరులు చెడగొట్టే ప్రమాం ఉంది. అలాంటి చోట ప్రశాంతంగా ఉంటూ మౌనంగా మీ పని మీరు పూర్తి చేసుకోవాలి.
4. పూర్తి సమాచారం లేని సందర్భాలలో
{{/usCountry}}ఏదైనా విషయంపై స్పష్టత లేనప్పుడు లేదా పూర్తి నిజాలు తెలియకుండా మాట్లాడటం హాస్యాస్పదంగా మారుతుంది. అవగాహన లేని అంశాలపై అనవసరంగా స్పందించడం కంటే, మౌనంగా ఉండి పరిస్థితిని గమనించడమే అత్యంత సమర్థవంతమైన నిర్ణయం.