సెప్టెంబర్‌లో పండుగల ముందు ఇంట్లో ఈ వస్తువులు అస్సలు ఉంచొద్దు.. వాస్తు ప్రకారం ప్రతికూల శక్తి!
సెప్టెంబర్‌తో పండుగల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంటిని శుభ్రంగా, సానుకూల వాతావరణంతో ఉంచుకోవాలని చాలామంది భావిస్తారు. వాస్తు విశ్వాసాల ప్రకారం ఇంట్లో ఉపయోగంలో లేని, పాడైపోయిన వస్తువులను ఎక్కువకాలం ఉంచకూడదు. ఇవి ప్రతికూల శక్తికి కారణమవుతాయని నమ్ముతారు.
ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, ఇంట్లో ప్రతికూల శక్తి లేకుండా సానుకూల శక్తి వ్యాపించాలని అనుకుంటారు. సెప్టెంబర్ ప్రారంభంతో పండుగ సీజన్ కూడా మొదలవుతుంది. సెప్టెంబర్‌లో కృష్ణాష్టమి, ఆ తర్వాత వినాయక చవితి, దసరా ఇలా చాలా పండగలు రాబోతున్నాయి. సెప్టెంబర్ ప్రారంభంతోనే పండుగలు రాబోతున్నాయి కాబట్టి, వెంటనే శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. శుభ్రం చేసుకోవడంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెడతారు.

వాస్తు ప్రకారం, ఇంట్లో ఉపయోగకరం లేని వస్తువులను, పాడైపోయిన వస్తువులను ఉంచకూడదు. వీటి వలన చాలా ఇబ్బందులు వస్తాయి. సానుకూల శక్తి తొలగి, ప్రతికూల శక్తి ఏర్పడుతుంది. మీరు కూడా మీ ఇంట్లో ప్రతికూల శక్తిని తొలగించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వాస్తును పాటించండి.
వాస్తు ప్రకారం ఇవే ప్రతికూల శక్తికి కారణమవుతాయి. కాబట్టి ఈ పొరపాట్లు జరగకుండా చూసుకోండి. సెప్టెంబర్ నెలలో నుంచి పండుగలు. ఇక ఇంటి నుంచి వస్తువులను తొలగిస్తేనే మంచిది. ప్రతికూల శక్తి తొలగి, సానుకూల శక్తి వ్యాపించాలంటే ఇంట్లో ఈ వస్తువులు ఉండకూడదు. ముఖ్యంగా పాడైపోయిన గడియారం, పగిలిన పాత్రలు ఇలాంటివి ఉండడం వలన చాలా విధాలుగా సమస్యలు వస్తాయి.
వాస్తు ప్రకారం ఇంటి నుంచి వీటిని తొలగించాలి.. ప్రతికూల శక్తికి కారణమవుతుంది
1.పగిలిన పాత్రలు, అద్దాలు
ఇంట్లో పగిలిన పాత్రలు, అద్దాలు వంటివి ఉండకూడదు. వాస్తు ప్రకారం ఇంట్లో ఇవి ఉండడం అశుభం. వీటివలన ప్రతికూల శక్తి ఏర్పడి, సానుకూల శక్తి దూరం అవుతుంది.
2.పాడైపోయిన గడియారాలు
పనిచేయని, పాడైపోయిన గడియారాలు ఇంట్లో ఉండకూడదు. వీటి వలన చాలా సమస్యలు వస్తాయి. వాస్తు ప్రకారం ఇలాంటివి ఇంట్లో ఉంటే సానుకూల శక్తి దూరమవుతుంది. ప్రతికూల శక్తికి కారణమవుతుంది.
3.ఇనప పాత్రలు
తుప్పు పట్టిన ఇనప పాత్రలు, పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంట్లో ఉండడం వలన చాలా సమస్యలు తెచ్చిపెడతాయి. ప్రతికూల శక్తికే కారణమవుతాయి. సానుకూల శక్తి కలుగదు. కాబట్టి ఇంటి నుంచి వీటిని కూడా తొలగించడం అవసరం.
4.ఎండిపోయిన ముళ్ల మొక్కలు
ఎండిపోయిన ముళ్ల మొక్కలు, ఎండిపోయిన మొక్కలు, ముళ్ల మొక్కలు వంటివి ఇంట్లో ఉండకూడదు. ఇది కూడా ప్రతికూల శక్తికి కారణం అవుతాయి. సానుకూల శక్తికి అడ్డుపడతాయి. కాబట్టి వీటిని కూడా ఇంటి నుంచి తొలగించడం మంచిది.
5.ఇంటి పైకప్పుపై పనికిరాని వస్తువులు
ఇంటి పైకప్పుపై పనికిరాని వస్తువులు, పాత చెప్పులు వంటివి ఉండకూడదు. ఇలాంటివి ఇంటి నుంచి తొలగించడమే మంచిది. లేకపోతే సానుకూల శక్తికి ఇవి అడ్డంకిగా మారతాయి. కనుక తొలగించడమే మంచిది. లేకపోతే రకరకాల సమస్యలతో బాధపడాలి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


