చాణక్యుని సూత్రాలు ప్రాచీన కాలానికే పరిమితం కావు.. అవి నేటి ఆధునిక జీవితానికి కూడా వర్తిస్తాయి. ఒక వ్యక్తి తన దైనందిన జీవితంలో ఎలా జీవించాలి, సమాజంలో ఎవరితో ఎలా వ్యవహరించాలి అనే విషయాలను చాణక్యుడు తన చాణక్య నీతిలో స్పష్టంగా పేర్కొన్నాడు.

జీవితంలో విజయం, శాంతి, ప్రశాంతతను సాధించడానికి చాణక్యుడు అనేక మార్గదర్శకాలను ఇచ్చాడు. అదేవిధంగా కుటుంబంలోని కొన్ని అంతర్గత విషయాలను మూడో వ్యక్తితో లేదా బయటివారితో ఎన్నడూ పంచుకోకూడదని చాణక్యుడు హెచ్చరించాడు. భావోద్వేగం వల్ల గానీ, మితిమీరిన నమ్మకం వల్ల గానీ ఈ రహస్యాలు బయటపడితే.. భవిష్యత్తులో ప్రమాదాన్ని, అవమానాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఆ ముఖ్యమైన విషయాలు ఏంటో చూద్దాం.
కుటుంబ సమస్యలు
అన్నిటికంటే ముందుగా మీ కుటుంబంలోని అంతర్గత కలహాలను, విభేదాలను ఎవరితోనూ పంచుకోవద్దని చాణక్యుడు చెబుతున్నాడు. ప్రతి ఇంట్లోనూ చిన్న చిన్న గొడవలు జరగడం సహజం. అయితే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ఈ విభేదాలను మీరు ఇతరులతో పంచుకుంటే.. వారు వాటిని తమ స్వలాభం కోసం వాడుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది సమాజంలో మీ కుటుంబ పరువును దెబ్బతీయడమే కాకుండా, మీ శత్రువులకు ఒక శక్తివంతమైన ఆయుధంగా కూడా మారుతుంది.
ఫ్యామిలీ సీక్రెట్స్
వైవాహిక జీవితంలోని రహస్యాలను ఎవరితోనూ పంచుకోకూడదు. భార్యాభర్తల మధ్య ఉండే వ్యక్తిగత విషయాలు వారి నాలుగు గోడల మధ్యనే ఉంచుకోవాలి. భార్య ప్రవర్తన, ఆమె కోపం లేదా భర్త బలహీనతల గురించి స్నేహితులు, ఇరుగుపొరుగువారు లేదా బంధువుల ముందు చర్చించడం చాలా పెద్ద అవివేకం. ఇది సమాజంలో మీ ఇద్దరి గౌరవాన్ని తగ్గించడమే కాకుండా, ఒక అందమైన దాంపత్య జీవితంలో చీలికకు దారితీస్తుంది.
ఆర్థిక సమస్యలు
మీకు కలిగిన ఆర్థిక నష్టాన్ని సమాజంలో ఎవరితోనూ పంచుకోకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. మీరు వ్యాపారంలో గానీ, జీవితంలో గానీ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటే, దానిని రహస్యంగా ఉంచి మీరే స్వయంగా ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి. మీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని ఇతరులకు తెలిస్తే, సమాజంలో మీ గౌరవం, విలువ తగ్గిపోతాయి. కష్టకాలంలో ప్రజలు మీకు సహాయం చేయడానికి బదులుగా మీకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు.
అవమానాలు
{{/usCountry}}మీకు కలిగిన ఆర్థిక నష్టాన్ని సమాజంలో ఎవరితోనూ పంచుకోకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. మీరు వ్యాపారంలో గానీ, జీవితంలో గానీ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటే, దానిని రహస్యంగా ఉంచి మీరే స్వయంగా ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి. మీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని ఇతరులకు తెలిస్తే, సమాజంలో మీ గౌరవం, విలువ తగ్గిపోతాయి. కష్టకాలంలో ప్రజలు మీకు సహాయం చేయడానికి బదులుగా మీకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు.
అవమానాలు
{{/usCountry}}మీరు సమావేశంలో, కార్యక్రమంలో, పని ప్రదేశంలో.. ఇలా ఎక్కడైనా అవమానానికి గురైతే.. ఆ విషయాన్ని ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది. మీరు ఎదుర్కొన్న అవమానాన్ని ఇతరులతో పంచుకుంటే వారు మిమ్మల్ని సానుభూతితో చూడరు. దానికి బదులుగా మీపై తక్కువ అభిప్రాయాన్ని ఏర్పరచుకుని, ఆ విషయాన్ని ఇతరులతో పంచుకుంటారు. ఇది సమాజంలో మీ హోదాను తగ్గిస్తుంది.