చంద్రుడికి మన జ్యోతిష్య శాస్త్రంలో ఎంత కీలకమైన స్థానం ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మన ఆలోచనలు, మానసిక స్థితిగతులు చంద్రుడి గమనంపై ఆధారపడి ఉంటాయి. సూర్యుడు ఆత్మకు కారకుడు, చంద్రుడు మనస్సుకు కారకుడు. ఆకాశంలో ఉన్న చంద్రుణ్ని చూస్తే ఎప్పుడూ ఒకేలా ఉండడు. 15 రోజులు పరిమాణం పెరుగుతూ ఉంటుంది, మరో 15 రోజులు తగ్గుతూ ఉంటుంది. ఎందుకు శుక్లపక్షంలో చంద్రుడు పెరుగుతూ ఉంటాడు? ఎందుకు కృష్ణపక్షంలో చంద్రుడు తగ్గుతూ ఉంటాడు? దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. కానీ పురాణాల ప్రకారం దీని వెనుక అద్భుతమైన కథ కూడా ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు

పురాణాల ప్రకారం చూసినట్లయితే, దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు ఉన్నారు. నిత్యం చెప్పుకునే అశ్విని నుంచి రేవతి దాకా 27 నక్షత్రాలు వారే.
చంద్రుడితో వివాహం
వీరినే దక్షుడు తన కుమార్తెలుగా భావించి చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. 27 మంది భార్యలను చంద్రుడు సమానంగా చూసుకోవాలని దక్షుడు చంద్రుడిని కోరడం జరిగింది. కానీ చంద్రుడు రోహిణి నక్షత్రం పట్ల మాత్రమే అమితమైన ప్రేమను చూపించేవాడు. మిగిలిన 26 మంది పట్ల చంద్రుడు నిర్లక్ష్యం చూపేవాడు. అప్పుడు ఆ 26 మంది సోదరీమణులు భర్త నిర్లక్ష్యాన్ని భరించలేకపోయారు. అన్యాయాన్ని తట్టుకోలేక ఏడుస్తూ తండ్రి దగ్గరకు వెళ్లారు.
దక్షుడికి కోపం.. చంద్రబింబంపై ప్రభావం
ఆ కుమార్తెల కష్టం చూసిన దక్ష ప్రజాపతి కోపానికి గురయ్యాడు. చంద్రుడిని పిలిచి తన ప్రవర్తనను మార్చుకోవాలని చాలా సార్లు హెచ్చరించాడు. అయినా కూడా చంద్రుడిలో ఏ మార్పూ రాలేదు. సహనాన్ని కోల్పోయిన దక్షుడు, “నీ అందం, కాంతి క్రమంగా తగ్గిపోవాలి” అని చంద్రుడికి క్షయ వ్యాధి వచ్చే విధంగా శాపం పెట్టాడు. ఆ ప్రభావంతో చంద్రుడు రోజు రోజుకీ తన కాంతిని కోల్పోవడం మొదలు పెట్టాడు. చంద్రుడు కాంతి తగ్గడంతో లోకంలోని మూలికలు, వనస్పతులు వాటి శక్తిని కోల్పోయాయి. దీంతో జీవకోటికి ముప్పు కలిగింది.
అభయం ఇచ్చిన శివుడు
ఇది గమనించిన దేవతలు చంద్రుణ్ని రక్షించాలని శివుడిని కోరారు. చంద్రుడు కూడా పశ్చాత్తాపంతో ప్రభాస తీర్థంలో శివుడిని స్మరించాడు. ఘోర తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. దక్షుడు ఇచ్చిన శాపాన్ని పూర్తిగా తొలగించడం సాధ్యం కాదని, కానీ దానిని సవరించగలనని శివుడు చంద్రుడికి అభయం ఇచ్చాడు.
శివ అనుగ్రహంతో కాంతిని పెంచుకున్నాడు
{{/usCountry}}ఇది గమనించిన దేవతలు చంద్రుణ్ని రక్షించాలని శివుడిని కోరారు. చంద్రుడు కూడా పశ్చాత్తాపంతో ప్రభాస తీర్థంలో శివుడిని స్మరించాడు. ఘోర తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. దక్షుడు ఇచ్చిన శాపాన్ని పూర్తిగా తొలగించడం సాధ్యం కాదని, కానీ దానిని సవరించగలనని శివుడు చంద్రుడికి అభయం ఇచ్చాడు.
శివ అనుగ్రహంతో కాంతిని పెంచుకున్నాడు
{{/usCountry}}శివుడి అనుగ్రహంతో చంద్రుడు 15 రోజులు తన కాంతిని కోల్పోతూ అమావాస్యకు చేరుకుంటాడు. మళ్లీ శివుడి శిరస్సుపై స్థానం పొందిన చంద్రుడు ఇంకో 15 రోజులు కాంతిని పెంచుకుంటాడు. పౌర్ణమి నాటికి పూర్ణ చంద్రుడిగా మారుతాడు. ఇలా ఈ పురాణ గాథ వలన మనకు తిధులు వచ్చాయని చెబుతారు.
మానసిక స్థిరత్వం
చంద్రుడు రోహిణి నక్షత్రంలో ఉన్నప్పుడు అత్యంత బలంగా, ఉచ్చస్థితిలో ఉంటాడు. చంద్రుడు వృద్ధి చెందే సమయంలో పుట్టిన వారికి మానసిక స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని, క్షీణించే సమయంలో పుట్టిన వారికి దానితో పోల్చుకుంటే కాస్త తక్కువగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.