కార్తీక మాసం విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కార్తీక మాసంలోని 30 రోజులు కూడా పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. భక్తులు తెల్లవారుజామునే నదీ స్నానం చేసి, శివ పూజలను నిర్వహిస్తారు. హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి విశేషమైన స్థానం ఉంది. ఈ మాసంలో వచ్చే ప్రతి తిథికి కూడా ప్రత్యేకత ఉంది.

కార్తీక శుక్ల ద్వాదశిని చిలుక ద్వాదశి లేదా క్షీరాబ్ధి ద్వాదశి అని అంటారు. ఇది ఏడాదికి ఒకసారి మాత్రమే వస్తుంది. ఆ రోజు చాలా ప్రత్యేకమైనది. ఈ ఏడాది చిలుక ద్వాదశి నవంబర్ 21, శనివారం నాడు వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో తులసి కల్యాణాన్ని కూడా జరుపుతారు. ఏడాదికి ఒక్కసారి వచ్చే ఈ పవిత్రమైన రోజున కొన్ని పరిహారాలను పాటించడం మంచిది. తులసి కోట దగ్గర ప్రత్యేక పూజలు చేయడం వలన సుఖసంతోషాలు కలుగుతాయి.
అసలు చిలుక ద్వాదశి అంటే ఏంటి?
కార్తీక మాసంలో వచ్చే శుక్ల పక్ష ద్వాదశిని చిలుక ద్వాదశి అని అంటారు. ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు యోగనిద్రలోకి వెళ్లిన విష్ణువు, కార్తీక ఏకాదశి నాడు మేలుకుంటారు. ఆ తర్వాత వచ్చిన ద్వాదశి రోజున తులసి దేవిని విష్ణు స్వరూపంగా భావించి పూజించడం జరుగుతుంది. తులసి కల్యాణాన్ని కూడా నిర్వహిస్తారు.
తులసి కోట దగ్గర ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలు
1.దీపారాధన:
తులసి కోట దగ్గర సాయంత్రం దీపారాధన చేయాలి. చాలామంది 27 దీపాలను వెలిగిస్తారు. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయొచ్చు. శ్రీహరిని స్మరిస్తూ ఇలా దీపారాధన చేయడం వలన సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. శ్రీహరి అనుగ్రహం లభిస్తుంది.
2.తులసమ్మకు ప్రత్యేక పూజ:
తులసి మొక్కకు భక్తితో పసుపు, కుంకుమలు సమర్పించి, పూలతో అలంకరించి ధూపదీపాలను సమర్పించాలి. తులసి అష్టోత్తర శతనామావళి చదవండి. అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది.
3.తులసి కల్యాణం:
{{/usCountry}}తులసి మొక్కకు భక్తితో పసుపు, కుంకుమలు సమర్పించి, పూలతో అలంకరించి ధూపదీపాలను సమర్పించాలి. తులసి అష్టోత్తర శతనామావళి చదవండి. అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది.
3.తులసి కల్యాణం:
{{/usCountry}}తులసి దేవికి విష్ణువుతో లేదా కృష్ణుడితో కల్యాణం జరిపిస్తారు. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి, శ్రీహరి అనుగ్రహం లభిస్తుంది.
4.ఉసిరి, తులసి ప్రాధాన్యత:
కార్తీక మాసంలో తులసితో పాటు ఉసిరి చెట్టుకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఆ రోజు ఉసిరి చెట్టు దగ్గర దీపాలు వెలిగించడం వలన చక్కటి ఫలితం ఉంటుంది. ఎంతో పుణ్యం వస్తుంది.
5.విష్ణు నామస్మరణ:
విష్ణు సహస్రనామం, శ్రీహరి స్తోత్రాలను చదువుతూ భజనలు చేయడం వలన చక్కటి ఫలితం కనిపిస్తుంది. తులసి కల్యాణం సమయంలో విష్ణుమూర్తి నామాలను స్మరించడం చాలా విశేషమైనది.
చిలుక ద్వాదశి నాడు దానధర్మాలు
రేపు వచ్చే చిలుక ద్వాదశి నాడు పేదలకు అన్నదానం చేయడం, వస్త్రాలు, పండ్లు దానం చేయడం మంచిది. అవసరమైన వారికి దానాలు చేయడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు. భక్తితో చేసే చిన్న దానమైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది.