ఖగోళ ప్రియులకు ప్రకృతి అద్భుతమైన కానుకను అందించబోతోంది. అనంత విశ్వంలో మరో అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. సౌర కుటుంబంలోనే అత్యంత ప్రకాశవంతమైన రెండు గ్రహాలు పక్కపక్కనే దర్శనమివ్వబోతున్నాయి. ఈ అద్భుత గ్రహ సంగమాన్నే ఖగోళ పరిశోధకులు, జ్యోతిష్య నిపుణులు ‘కాస్మిక్ కిస్’ అని పిలుస్తున్నారు. జూన్ 8, 9 తేదీల్లో ఈ అరుదైన ఖగోళ వింతను మన దేశం నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వీక్షించే అవకాశం లభించనుంది.

శాస్త్రీయ పరిభాషలో చెప్పాలంటే.. ఆకాశంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకే రేఖపైకి వచ్చి, అత్యంత సమీపంలో కనిపించడాన్ని ‘ప్లానెటరీ కంజంక్షన్’ లేదా 'గ్రహ సంగమం' అని పిలుస్తారు. ప్రస్తుతం మనకు ఆకాశంలో అత్యంత కాంతివంతంగా మెరిసే గురు గ్రహం, శుక్ర గ్రహం ఒకే సరళరేఖపైకి రాబోతున్నాయి.
భూమి నుంచి చూసే దృక్కోణం వల్ల ఇవి కేవలం 2 డిగ్రీల అంతరంలో పక్కపక్కనే ఉన్నట్లు కనిపిస్తుంది. నిజానికి అంతరిక్షంలో ఈ రెండు గ్రహాల మధ్య కోట్ల కిలోమీటర్ల దూరం ఉంటుంది. సూర్యుడి చుట్టూ ఇవి తిరిగే కక్ష్యలు, వాటి వేగంలో ఉండే తేడాల వల్లే ఇలాంటి అరుదైన దృశ్యాలు అప్పుడప్పుడు సంభవిస్తుంటాయి.
ప్రస్తుతం ఈ రెండు శక్తివంతమైన గ్రహాలు కర్కాటక రాశిలో సంచరిస్తూ, ఒకదానికొకటి అత్యంత చేరువగా వస్తున్నాయి. పురాతన కాలం నుండి పండితులు దీనిని విశేషంగా భావిస్తూ వస్తున్నారు. అందుకే దీనికి ‘కాస్మిక్ కిస్’ అనే పేరు పెట్టారు.
ఈ ఖగోళ వింతను చూడటానికి మీకేలాంటి ఖరీదైన టెలిస్కోప్‌లు లేదా బైనాక్యులర్లు అవసరం లేదు. మీ సాధారణ కళ్లతోనే ఈ అద్భుతాన్ని స్పష్టంగా చూడవచ్చు. జూన్ 8, 9 (సోమ, మంగళవారాలు) సూర్యాస్తమయం అయిన వెంటనే పశ్చిమ - వాయువ్య దిశలో ఈ గ్రహాలను చూడవచ్చు. కేవలం అర గంట నుండి ఒక గంట లోపు మాత్రమే ఈ అద్భుత దృశ్యం కనిపిస్తుంది. భూమి దగ్గరలో ఉన్నట్టుగా అగుపిస్తుంది.
వీక్షణ చిట్కాలు
సూర్యుడు అస్తమించిన వెంటనే పశ్చిమ దిశగా ఆకాశంలో చూస్తే.. మిగిలిన నక్షత్రాల కంటే అత్యంత ప్రకాశవంతంగా రెండు చుక్కలు పక్కపక్కనే మెరుస్తూ కనిపిస్తాయి. అవే గురు, శుక్ర గ్రహాలు.
{{/usCountry}}సూర్యుడు అస్తమించిన వెంటనే పశ్చిమ దిశగా ఆకాశంలో చూస్తే.. మిగిలిన నక్షత్రాల కంటే అత్యంత ప్రకాశవంతంగా రెండు చుక్కలు పక్కపక్కనే మెరుస్తూ కనిపిస్తాయి. అవే గురు, శుక్ర గ్రహాలు.
{{/usCountry}}ఇవి క్రమంగా హోరైజన్ (దిక్చక్రం) వైపునకు వెళ్తూ అస్తమిస్తాయి కాబట్టి, సూర్యాస్తమయం అయిన గంటలోపే దీనిని చూడాలి. ఆ తర్వాత ఇవి కనిపించవు.
ఈ అద్భుతాన్ని స్పష్టంగా ఆస్వాదించాలంటే నగరాల్లోని కృత్రిమ కాంతులు (లైట్లు) తక్కువగా ఉండేలా ఓపెన్ టెర్రస్ లేదా మైదాన ప్రాంతాలను ఎంచుకోవడం మంచిది. అలాగే ఆకాశంలో మబ్బులు లేకుండా నిర్మలంగా ఉండాలి.