గురువారం అంటేనే భక్తులకు ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ రోజున జగన్నాథుడైన శ్రీహరిని భక్తిశ్రద్ధలతో కొలిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని నమ్మకం. ఏప్రిల్ 9 నాటి గ్రహ గతులను పరిశీలిస్తే, కొన్ని రాశుల వారికి రాజయోగం పడుతుండగా, మరికొన్ని రాశుల వారు వృత్తి, ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ద్వాదశ రాశి ఫలాలు (మేషం నుండి మీనం వరకు)
మేష రాశి:

ఈ రోజు మేష రాశి వారికి విదేశీ ప్రయాణ సూచనలు బలంగా ఉన్నాయి. ఈ ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది. కెరీర్‌లో ఎదుగుదల కోసం ఆఫీసు పనులపై పూర్తి దృష్టి పెట్టండి. మాట్లాడేటప్పుడు కఠిన పదజాలం వాడకండి, మాట తీరుపై నియంత్రణ అవసరం.
వృషభ రాశి:
కెరీర్‌లో సరికొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. వ్యాపారస్తులకు ఆశించిన స్థాయి కంటే ఎక్కువ లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా ఈ రోజు మీకు చాలా బాగుంటుంది.
మిథున రాశి:
శ్రమకు తగ్గ ఫలితం లభించక కొంచెం నిరాశ చెందే అవకాశం ఉంది. ఒత్తిడికి లోనుకాకుండా మీ పట్ల మీరు శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యుల నుంచి ఏదైనా తీపి కబురు వినే అవకాశం ఉంది.
కర్కాటక రాశి:
నేడు కర్కాటక రాశి వారికి పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. అయితే, ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ముఖ్యంగా నూనె పదార్థాలకు దూరంగా ఉండండి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి, పని ఒత్తిడిని ఇంటికి తీసుకెళ్లకండి.
సింహ రాశి:
వ్యాపారస్తులు అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో వాదనలకు దిగకండి, ఇది మనస్పర్థలకు దారి తీయవచ్చు. చిన్నపాటి విహారయాత్ర లేదా ప్రయాణం చేసే ప్లాన్ రూపుదిద్దుకుంటుంది.
కన్యా రాశి:
{{/usCountry}}వ్యాపారస్తులు అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో వాదనలకు దిగకండి, ఇది మనస్పర్థలకు దారి తీయవచ్చు. చిన్నపాటి విహారయాత్ర లేదా ప్రయాణం చేసే ప్లాన్ రూపుదిద్దుకుంటుంది.
కన్యా రాశి:
{{/usCountry}}నేడు మీరు సానుకూల దృక్పథంతో (Positive Attitude) ఉండాలి. చర్మ సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే ఆహారంలో ఆకుకూరలు చేర్చుకోండి. ఫిట్‌నెస్ పై దృష్టి పెట్టండి, మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి.
తులా రాశి:
తులా రాశి వారికి ఈ రోజు అదృష్టం వరిస్తుంది. మీ చిరకాల కల నెరవేరే అవకాశం ఉంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వ్యాపారులు తమ రంగాలను విస్తరించి మంచి లాభాలను ఆర్జిస్తారు.
వృశ్చిక రాశి:
మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ప్రమోషన్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే, కార్యాలయంలో జరిగే రాజకీయాలకు దూరంగా ఉండండి. సీనియర్లతో మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
ధనుస్సు రాశి:
ఆర్థిక పరంగా ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది సరైన సమయం. ఉద్యోగస్తులకు పదోన్నతితో పాటు ఆర్థిక లాభాలు చేకూరే అవకాశం ఉంది.
మకర రాశి:
రోజు ప్రారంభం బాగున్నా, ముగింపు అంతంత మాత్రంగానే ఉంటుంది. అనుకోని సంఘటనల వల్ల మీ పని వేగం తగ్గుతుంది. ఖర్చులు పెరగడం వల్ల ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంది, పొదుపుపై దృష్టి పెట్టండి.
కుంభ రాశి:
అహంకారాన్ని దరి చేరనివ్వకండి. మీ కంటే చిన్నవారు ఇచ్చే సలహాలను కూడా స్వీకరించండి. వ్యాపారం పుంజుకుంటుంది, మంచి లాభాలను ఆశించవచ్చు.
మీన రాశి:
కెరీర్, ఆర్థిక పరిస్థితి సాదాసీదాగా ఉంటుంది. లక్ష్యాలను చేరుకోవడానికి మీరు సాధారణం కంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారంలో స్వల్ప నష్టాలు వచ్చే సూచనలు ఉన్నాయి.