దక్షిణామూర్తి మంత్రంతో పిల్లలకు చదివింది గుర్తుంటుంది, విద్యాబుద్ధులు కలుగుతాయి!
పిల్లలకు కనపడే విధంగా దక్షిణామూర్తి చిత్రపటం ఇంట్లో పెట్టడం వలన పిల్లలు బాగా చదువుకుంటారు. పిల్లల్లో తెలివితేటలు పెరుగుతాయి. ముందుంటారు. చురుకుగా మారతారు. దక్షిణామూర్తి పూజ చేయడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ పూజ ఏ విధంగా చేసుకోవాలి? ఎవరు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి?
ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు బాగా చదువుకోవాలని, చదువులో రాణించాలని, తెలివితేటలు కలగాలని కోరుకుంటారు. అలాంటప్పుడు దక్షిణామూర్తి పూజ చేయడం వలన పిల్లలకు శుభ ఫలితాలు కలుగుతాయి. చదువులో బాగా రాణించడానికి కూడా వీలవుతుంది. దక్షిణామూర్తి పూజ చేయడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ పూజ ఏ విధంగా చేసుకోవాలి? ఎవరు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

దక్షిణామూర్తి చిత్రపటం
పిల్లలకు కనపడే విధంగా దక్షిణామూర్తి చిత్రపటం ఇంట్లో పెట్టడం వలన పిల్లలు బాగా చదువుకుంటారు. పిల్లల్లో తెలివితేటలు పెరుగుతాయి. ముందుంటారు. చురుకుగా మారతారు. చదువులో మీ పిల్లలు కాస్త వెనకబడినా, లేక చదివినది మర్చిపోతున్నా సరే, ఇది సహాయపడుతుంది. విద్యాబుద్ధులు కూడా కలుగుతాయి.
పిల్లలు దక్షిణామూర్తి పూజ ఎలా చేయాలి?
ప్రతిరోజు పిల్లలకు దక్షిణామూర్తి ఫోటోకి దండం పెట్టించండి. అలాగే దీపారాధన చేయించండి. దక్షిణామూర్తి శ్లోకాన్ని కూడా పిల్లలతో చదివించండి. ఆ తర్వాత ఏదైనా నైవేద్యం పెట్టించండి. ప్రతి రోజు కుదరకపోతే, కనీసం గురువారం నాడు ఉదయం లేదా సాయంత్రం చేయించండి.
దక్షిణామూర్తి పూజా విధానం
మొదట దీపారాధన చేసి, విఘ్నాలను తొలగించే వినాయకుడిని మొట్టమొదట ఆరాధించాలి.
ఆ తర్వాత దక్షిణామూర్తి పూజ చేయాలి. షోడశోపచార పూజ చేసి, శ్రీ మేధాశక్తి దక్షిణామూర్తిని ఆరాధించాలి.
దక్షిణామూర్తికి కూడా షోడశోపచారాలతో పూజ చేయాలి. దక్షిణామూర్తిని దర్శిస్తూ, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠిస్తే ఎంతో శుభ ఫలితం లభిస్తుంది. ఇంట్లో కష్టాలు కూడా తొలగిపోతాయి.
దక్షిణామూర్తిని దర్శించడం వల్ల, స్తోత్రాన్ని పఠించడం వల్ల తెలియక చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి.
దక్షిణామూర్తి మంత్రం
ప్రతిరోజు పిల్లలు దక్షిణామూర్తి మంత్రాన్ని జపిస్తే ఎంతో మంచి జరుగుతుంది. శుభ ఫలితాలు పొందుతారు. అభివృద్ధి సాధిస్తారు. విద్యాబుద్ధులు కలుగుతాయి.
“గురవే సర్వలోకానాం భిషజే భవ రోగిణాం
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః”
దీనికి అర్థం ఏమిటంటే- సమస్త లోకాలకు గురువైన వారికి, సంసారం అనే వ్యాధిని నయం చేసే వైద్యుడికి, సమస్త విద్యలకు జ్ఞానానికి నిధిలాంటి వానికి ఆ దక్షిణామూర్తికి నమస్కారం అని అర్థం.
ఈ మంత్రాన్ని జపిస్తే ఈ లాభాలను పొందవచ్చు
ఈ మంత్రాన్ని జపిస్తే జ్ఞానం, తెలివితేటలు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. అజ్ఞానం నుంచి బయటపడొచ్చు. విద్యార్థులకు, జ్ఞానాన్ని ఆశించే వారికి ఇది చాలా మంచి మంత్రం.
వీటిని నివేదన చెయ్యండి
నానబెట్టిన శనగలను దక్షిణామూర్తికి నైవేద్యంగా పెడతారు. అలాగే మీకు తోచిన పండ్లను కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. శనగల మాలను కూడా దక్షిణామూర్తికి సమర్పిస్తారు. కొబ్బరికాయను కూడా నివేదనగా పెట్టొచ్చు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


