పంచ మాంగల్యాలు అంటే ఏంటి, శ్రీకృష్ణుని అష్టభార్యలు ఎవరు? ఇక్కడ ఉన్న ఈ నాలుగు ప్రశ్నల సమాధానాలు తెలుసా?
మనకు తెలియని అనేక విషయాలను మనం పాటిస్తూ ఉంటాము. కానీ వాటి వెనుక అర్ధం దాగి ఉంటుంది. స్త్రీల 16 అలంకారాలు, పుణ్య స్త్రీలు ఇంటికి వస్తే ఎందుకు మంగళకరమైన వస్తువులు ఇస్తారు?, పంచ మాంగల్యాలు ఏంటి? పెళ్లయిన స్త్రీలు తప్పక ధరించాల్సినవి ఏవి?, శ్రీకృష్ణుని అష్టభార్యలు ఎవరు? 4 ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం.
మనకు తెలియని అనేక విషయాలను మనం పాటిస్తూ ఉంటాము. కానీ వాటి వెనుక అర్ధం దాగి ఉంటుంది. మీకు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసా? మరి ఓ లుక్ వేసేయండి. ఈరోజు చాలా మంది తెలుసుకోవాల్సిన 4 ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం.

1.స్త్రీల 16 అలంకారాలు
స్త్రీల 16 అలంకారములు ఏవి అనే విషయం మీకు తెలుసా? ఈ పదహారు స్త్రీల అలంకారములు. దంతదావణం, నలుగు పెట్టుకుని స్నానం చేయడం, పసుపు రాసుకోవడం, చీర జాకెట్లు ధరించడం, పారాణి పెట్టుకోవడం, అందంగా జడ వేసుకోవడం, పుష్పాలంకరణ, నుదుట కుంకుమ ధరించడం, తిలకం పెట్టుకోవడం, గోరింటాకు, తాంబూలం వేసుకోవడం, కళ్లకు కాటుక పెట్టుకోవడం, మంగళసూత్రము, నల్లపూసలు, కాళ్లకు మెట్టెలు ఈ 16 కూడా స్త్రీల అలంకరణములుగా చెబుతారు. కనుక పెళ్లయిన స్త్రీలు కచ్చితంగా వీటిని ప్రతిరోజూ అనుసరించడం మంచిది.
2.పుణ్య స్త్రీలు ఇంటికి వస్తే ఎందుకు మంగళకరమైన వస్తువులు ఇస్తారు?
చాలా మంది ఎవరైనా పుణ్యస్త్రీ ఇంటికి వస్తే వారికి మంగళకరమైన వస్తువులు ఇస్తారు. అసలు ఎందుకు అలా ఇస్తారు? దాని వెనుక కారణం ఏంటో తెలుసుకుందాం.. ఇంటికి పుణ్యస్త్రీలు వచ్చినా, లేకపోతే శుభకార్యం జరిగినప్పుడు స్త్రీలకు మంగళకరమైన వస్తువులు ఇస్తారు. పసుపు, కుంకుమ, పండ్లు, పువ్వులు, జాకెట్ గుడ్డ వంటివి మంగళకరమైన వస్తువులు.
చాలా మందికి ఎందుకు ఇస్తారు అనే విషయం తెలియకపోయినా కూడా పెద్దలు చెప్పారని, తల్లో, అత్తయ్యనో చూసి పాటిస్తూ వుంటారు. ఇలా ఇది మన ఆచారం. పెద్దలు కూడా అలా ఇవ్వాలని చెప్తూ ఉంటారు. అవి స్వీకరించేటప్పుడు వారు ఆ ఇంటి ఇల్లాలిని ఆశీర్వదిస్తారు. వారి ఆశీర్వాదంతో ఆ ఇంటి ఇల్లాలికి సౌభాగ్యం కలుగుతుంది. అందుకనే ఇలా వస్తువులు ఇస్తారు.
పసుపు, కుంకుమ గౌరీదేవి స్వరూపాలు. వీటిని ఇచ్చి, పుచ్చుకుంటే గౌరీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని నమ్మకం. అలాగే మంగళకరమైన వస్తువులు ఇచ్చి, పుచ్చుకుంటే వారి మధ్య సత్సంబంధాలు కూడా ఏర్పడతాయి. అందుకే ఇలా ఇంటికి వచ్చినా, శుభకార్యాలు జరిగినా ఇస్తూ వుంటారు.
3.పంచ మాంగల్యాలు ఏంటి? పెళ్లయిన స్త్రీలు తప్పక ధరించాల్సినవి ఏవి?
పెళ్లయిన స్త్రీలు కచ్చితంగా పంచ మాంగల్యాలను ఎప్పుడూ ధరించాలి. నుదుట ఎర్రని కుంకుమతో పాటు మెడలో మంగళసూత్రం, చేతులకు మట్టి గాజులు, కాళ్లకు మెట్టెలు, జడలో పూలు. వీటినే పంచమాంగల్యాలు అంటారు. వీటిని ధరించకుండా భర్తకు భార్య కనపడకూడదని పెద్దలు చెబుతారు.
4.శ్రీకృష్ణుని అష్టభార్యలు ఎవరు?
శ్రీకృష్ణుని అష్టభార్యలు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం: రుక్మిణి, సత్యభామ, జాంబవతి, మిత్రవింద, కాలింది, నాగ్నజితి, భద్ర, లక్షణ. ఈ ఎనిమిది మంది శ్రీకృష్ణుని పట్టమహిషులు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


