పూజకు పనికిరాని పుష్పాలేవి, రోలుపై దీపం ఎందుకు పెట్టకూడదు, బొట్టుని ఏ వేలుతో పెట్టుకోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసా?

ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని రోజూ పూజగదిలో దీపారాధన చేసి, ఆ తర్వాత వారికి నచ్చిన పూలతో అలంకరణ చేసి పూజ చేస్తారు. అయితే పూజకు కొన్ని పూలు పనికిరావు. ఈ పూలను పెట్టినట్లయితే ఆ పూజకు విలువ ఉండదు. రోలుపై దీపం ఎందుకు పెట్టకూడదు, బొట్టుని ఏ వేలుతో పెట్టుకోవాలి? అనే ప్రశ్నలకు కూడా సమాధానాలు తెలుసుకోండి

Published on: Feb 5, 2026, 15:00:52 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని రోజూ పూజగదిలో దీపారాధన చేసి, ఆ తర్వాత వారికి నచ్చిన పూలతో అలంకరణ చేసి పూజ చేస్తారు. అయితే పూజకు కొన్ని పూలు పనికిరావు. ఈ పూలను పెట్టినట్లయితే ఆ పూజకు విలువ ఉండదు. అయితే మరి ఏ పూలు పూజకు పనికిరావు? పూజకు పనికిరాని పుష్పాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

పూజకు పనికిరాని పుష్పాలేవి, రోలుపై దీపం ఎందుకు పెట్టకూడదు, బొట్టుని ఏ వేలుతో పెట్టుకోవాలి? (pinterest)
పూజకు పనికిరాని పుష్పాలేవి, రోలుపై దీపం ఎందుకు పెట్టకూడదు, బొట్టుని ఏ వేలుతో పెట్టుకోవాలి? (pinterest)

పూజకు పనికిరాని పుష్పాలేవి?

పూజ చేసేటప్పుడు ఈ నియమాలను కచ్చితంగా పాటించండి. పూజ చేసేటప్పుడు నేలపై పడినవి, కడగనివి, వాసన చూసిన పూలు పనికిరావు. ఈ పూలతో పూజ చేయడం వలన ఆ పూజకు విలువ ఉండదు. అలాగే ఎడమ చేతితో కోసిన పువ్వులను కూడా దేవుడికి పెట్టకూడదు. బహిష్టులైన స్త్రీలు, పురిటి మహిళలు తాకిన పూలను దేవుడికి పెట్టకూడదు. ఆ పూలతో పూజ చేయడం అస్సలు మంచిది కాదు. అలాగే వాడిపోయిన పువ్వులు, రేకులు ఊడిపోయిన పువ్వులను కూడా దేవుడికి సమర్పించకూడదు.

ఒంటిమీద ధరించి ఉన్న వస్త్రంలో కోసి వేసుకున్న పూలను కూడా దేవుడికి సమర్పించకూడదు. పరిశుభ్రంగా లేని పూలను కూడా దేవుడికి పెట్టకూడదు. పరిశుభ్రంగా లేని చోట పెరిగిన మొక్కల తాలూకా పూలను కోసి దేవుడికి సమర్పించడం మంచిది కాదు. కాబట్టి ఎప్పుడైనా సరే భగవంతుడికి పువ్వులను సమర్పించేటప్పుడు ఆ పూలు శుభ్రంగా, వాడిపోకుండా, కడిగినవై ఉండాలి. పైన చెప్పిన తప్పులు మాత్రం పొరపాటున కూడా చేయొద్దు.

రోలుపై దీపాన్ని ఎందుకు పెట్టకూడదు?

రోలుపై దీపాన్ని ఎందుకు పెట్టకూడదనే దాని వెనుక కూడా చాలా పెద్ద కారణం ఉంది. హిందూ ఆచార సంప్రదాయాల ప్రకారం చూసినట్లయితే, నిత్య కృత్యాలలో ఎక్కువగా వాడే వస్తువులను దైవరూపంగా భావిస్తాము. అందులో రోలు, తిరగలి, బావి, కుంపటి మొదలైనవి ఉంటాయి. అయితే ఇలాంటి వస్తువులకు కూడా రోజు మనం పూజలు చేస్తూ ఉంటాము. దైవస్వరూపంగా భావించే రోలుపై దీపాన్ని పెట్టడం పూర్వకాలంలో తప్పుగా భావించేవారు.

పైగా విద్యుత్తు లేని ఆ రోజుల్లో ఇంట్లో దీపాలను కిరోసిన్‌తో వెలిగించేవారు. అయితే కిరోసిన్ దీపాలను అన్ని పనులకు ఎక్కువగా వాడేవారు. అలాంటప్పుడు రోలుపై పెట్టినట్లయితే ఆ రోలుకు కిరోసిన్ వాసన వస్తుంది. ఆ వాసన త్వరగా పోదు. పైగా రోలును ఆహార పదార్థాలను రుబ్బుకోవడానికి వాడుతూ ఉంటాము. కాబట్టి దీపాన్ని రోలుపై పెట్టకూడదు అని ప్రాచీనులు ఈ నియమాన్ని పెట్టారు.

బొట్టును ఏ వేలితో పెట్టుకోవాలి?

చాలా మంది పూర్వికులు చెప్పిన వాటిని కొట్టి పారేస్తూ ఉంటారు, కానీ వాటి వెనుక ఎంతో అర్ధం దాగి ఉంటుంది. ఇక బొట్టును ఏ వేలితో పెట్టుకోవాలి అనేది చూస్తే.. బ్రహ్మాండ పురాణం ప్రకారం బొట్టును పెట్టుకునేటప్పుడు, బొటన వేలుతో పెట్టుకుంటే పుష్టి కలుగుతుంది. అదే మధ్య వేలుతో పెట్టుకుంటే ఆయుష్షు పెరుగుతుంది. ఉంగర వేలుతో బొట్టు పెట్టుకుంటే అన్నానికి లోటు ఉండదు. చూపుడు వేలుతో బొట్టు పెట్టుకుంటే ముక్తి కలుగుతుంది. చిటికెన వేలుతో మాత్రం బొట్టు పెట్టుకోకూడదు. బొట్టు పెట్టుకునేటప్పుడు ముఖానికి గోరు తగలడం మంచిది కాదు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More