ధన్వంతరి ఎవరు? ధన త్రయోదశి నాడు ధన్వంతరిని ఎందుకు ఆరాధించాలో తెలుసుకోండి!
ధన త్రయోదశి నాడు పూజలు చేస్తూ ఉంటారు. ఆ రోజున పూజలు చేసినా, కొన్ని వస్తువులను కొనుగోలు చేసినా సంపద పెరుగుతుందని, లక్ష్మీదేవి వారి ఇంట కొలువై ఉంటుందని నమ్ముతారు. దీపావళి నాడు ధన్వంతరిని ఎందుకు ఆరాధించాలి? ధన్వంతరి జన్మ కథ గురించి తెలుసుకుందాం.
మరి కొన్ని రోజుల్లో ధన త్రయోదశి వస్తోంది. ధన త్రయోదశి నాడు బంగారం, వెండి, విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అదే విధంగా ప్రత్యేకించి ధన త్రయోదశి నాడు పూజలు చేస్తూ ఉంటారు. ఆ రోజున పూజలు చేసినా, కొన్ని వస్తువులను కొనుగోలు చేసినా సంపద పెరుగుతుందని, లక్ష్మీదేవి వారి ఇంట కొలువై ఉంటుందని నమ్ముతారు. ధన్వంతరిని కూడా పూజిస్తారు. ఎందుకు ధన్వంతరిని ఆ రోజు పూజించాలి? అసలు ధన్వంతరి ఎవరు? దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ధన్వంతరి ఎవరు? ధన త్రయోదశి నాడు ధన్వంతరిని ఎందుకు ఆరాధించాలో తెలుసుకోండి (pinterest)
ధన త్రయోదశి నాడు ధన్వంతరిని ఎందుకు ఆరాధించాలి?
ధన్వంతరి ఎవరు?
దేవతలు, రాక్షసులు సాగర మథనం చేస్తున్నప్పుడు త్రయోదశి నాడు విష్ణువు ధన్వంతరి అవతారంలో అమృత కలశాన్ని పట్టుకుని కనపడతాడు. ఆ రోజున ధన్వంతరి పుట్టిన రోజు అని నమ్ముతారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ధన్వంతరి జయంతి జరుపుతారు, ప్రత్యేక పూజలు చేస్తారు.
ధన్వంతరి జన్మ కథ:
మనం పురాణాల ప్రకారం చూసినట్లయితే, రకరకాల కథలు ఉన్నాయి. ఒక కథనం ప్రకారం చూసినట్లయితే, కాశీకి చెందిన ధన్వా అనే రాజు ప్రతి రోజూ భగవంతుడికి పూజలు చేసేవాడు. ధన్వంతరి అనే పుత్రుడు అతనికి పుడతాడని దేవతలు వరం ఇచ్చినట్లు బ్రహ్మ పురాణంలో చెప్పబడింది. సాగర మథనంలో కనపడిన ధన్వంతరి ఆయన రెండవ జన్మ అని అంటారు.
ఆయుర్వేద పితామహుడు ధన్వంతరి:
ధన్వంతరిని మనం చూసినట్లయితే, ఆయన నాలుగు చేతుల్లో కూడా జీవుల ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉంటాడు. అందుకనే ఆయన్ని ఆయుర్వేద పితామహుడు అని అంటారు. ఆయన నుంచే చరకాచార్య ఆయుర్వేద జ్ఞానాన్ని విస్తరించాడని అంటారు.
విష్ణు అవతారం ధన్వంతరి:
ధన్వంతరిని విష్ణు అవతారం అని అంటారు. కొన్ని రాష్ట్రాలలో ధన్వంతరి ఆలయాలు కూడా ఉన్నాయి. గుజరాత్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో ఈ ఆలయాలు కనపడతాయి. అలాగే అమెరికా, జర్మనీ, బ్రిటన్, రష్యా వంటి దేశాల్లో కూడా ధన్వంతరిని ఆరాధిస్తారు.
ధన్వంతరి పూజా విధానం
ధన త్రయోదశి నాడు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి పూజ మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఆ తర్వాత దీపారాధన చేసి విష్ణువు స్వరూపమైన ధన్వంతరి చిత్రపటాన్ని పెట్టి గంధపుష్పాక్షతలతో పూజించాలి.
శక్తి కొద్దీ నైవేద్యాలను సమర్పించాలి. ధన్వంతరి దేవుడిని ఈ విధంగా ఆరాధించడం వలన ధన్వంతరి అనుగ్రహం కలుగుతుంది.
News/Rasi Phalalu/ధన్వంతరి ఎవరు? ధన త్రయోదశి నాడు ధన్వంతరిని ఎందుకు ఆరాధించాలో తెలుసుకోండి!
News/Rasi Phalalu/ధన్వంతరి ఎవరు? ధన త్రయోదశి నాడు ధన్వంతరిని ఎందుకు ఆరాధించాలో తెలుసుకోండి!