ధన త్రయోదశి నుంచి ఈ రాశులకు మహర్దశ.. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికంగా తిరుగులేని అదృష్టం!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్ 6, శుక్రవారం సూర్యుడు స్వాతి నక్షత్రం నుంచి గురు అధిపత్యంలోని విశాఖ నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఇదే రోజు ధన త్రయోదశి పండుగ కూడా ఉండటం విశేషం. సూర్యుడు నవంబర్ 19 వరకు విశాఖ నక్షత్రంలో సంచరిస్తాడు.
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాకుమారుడైన సూర్యుడు ప్రతి 14 నుంచి 15 రోజులకు ఒకసారి తన నక్షత్రాన్ని మారుస్తుంటాడు. ప్రస్తుతం స్వాతి నక్షత్రంలో సంచరిస్తున్న భాస్కరుడు, వచ్చే నెల నవంబర్ 6, శుక్రవారం నాడు విశాఖ నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నారు. ప్రత్యేకత ఏమిటంటే.. అదే రోజు పవిత్రమైన ధన త్రయోదశి పండుగ కూడా ఉంది. విశాఖ నక్షత్రానికి దేవుగురు బృహస్పతి అధిపతి. ఆ రోజున గురు నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడం అత్యంత శక్తిమత్తమైన, అరుదైన ఖగోళ పరిణామంగా పండితులు వివరిస్తున్నారు.

ఆత్మకారకుడు, పరాక్రమ ప్రదాత అయిన సూర్యుడు.. ధన, వైభవాలకుకారకుడైన గురుని ప్రభావంలోకి రానుండటం వల్ల రాబోయే 14 రోజుల పాటు కొన్ని రాశుల వారికి అదృష్టం తలపు తట్టనుంది. నవంబర్ 19 వరకు సూర్యుడు ఇదే నక్షత్రంలో సంచరిస్తాడు. ఈ కాలంలో ఏయే రాశుల వారి జాతకం ఎలా ఉందో ఇక్కడ చూద్దాం.
మిథున రాశి:
ఈ సూర్య సంచార కాలం మిథున రాశి వారికి అన్ని విధాలా కలసివస్తుంది. ముఖ్యంగా విద్యారంగంతో సంబంధం ఉన్నవారికి అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి. ప్రేమ జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి డబ్బులను ఆదా చేస్తారు.
వ్యాపారులు కొత్త ఒప్పందాలపై సంతకాలు చేసే సూచనలున్నాయి. ఉద్యోగులకు ఆఫీసులో కొత్త అవకాశాలు తారసపడతాయి. అనవసర ఖర్చులు పూర్తిగా తగ్గిపోయి, పొదుపు చేసే మార్గాలు సులభతరమవుతాయి.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ నక్షత్ర మార్పు సిరిసంపదలను తెచ్చిపెట్టనుంది. అదృష్టం పూర్తిగా మీ వెంటే ఉంటుంది. వ్యాపారాలు జోరుగా సాగి బలమైన ఆర్థిక స్థితిని అందుకుంటారు. సమాజంలోని ఉన్నత స్థాయి, ప్రభావశీల వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
ఇది భవిష్యత్లో మీ ఉద్యోగానికి లేదా వ్యాపారానికి ఎంతో ఉపకరిస్తుంది. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి ఊహించని లాభాలు వస్తాయి. నిరుద్యోగులకు, ఉద్యోగంలో ఒత్తిడి ఎదుర్కొంటున్న వారికి ఆందోళనలు తొలగిపోతాయి.
సింహ రాశి:
సింహ రాశి అధిపతి స్వయంగా సూర్యుడే కావడంతో ఈ కాలం ఈ రాశి వారికి చాలా ప్రత్యేకం. మీ కష్టానికి తగిన ప్రతిఫలం కచ్చితంగా దక్కుతుంది. వృత్తి జీవితంలో మీ ధైర్యసాహసాలు అధికారులను ఆకట్టుకుంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
నూతన ప్రాజెక్టులు లేదా పనులు ప్రారంభించడానికి ఇదే మంచి తరుణం. వ్యాపారంలో కొత్త లాభసాటి మార్గాలు కంటబడతాయి. సమాజంలో మీ పేరు ప్రఖ్యాతులు మరింత ఇనుమడిస్తాయి.
ధనుస్సు రాశి:
దేవుగురు బృహస్పతి ఆధిపత్యం ఉన్న ధనుస్సు రాశి వారికి సూర్య సంచారం అపూర్వ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా హోదాలో మార్పు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది.
ముఖ్యంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు శుభవార్తలు వింటారు. వృత్తిరీత్యా చేసే ప్రయాణాలు లాభసాటిగా మారుతాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ఆస్తి వృద్ధి చెందే సూచనలున్నాయి.
మీన రాశి:
మీన రాశి వారికి ఈ కాలం ఆర్థికంగా ఊరటనిస్తుంది. ఎప్పటి నుంచో నిలిచిపోయిన లేదా ఎక్కడో ఇరుక్కుపోయిన డబ్బు తిరిగి మీ చేతికి అందుతుంది. పూర్వీకుల ఆస్తుల ద్వారా లాభాలు అందుకుంటారు. పెట్టుబడులు పెట్టేందుకు ఇది సరైన సమయం.
కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబం లేదా నిపుణుల సలహా కలసివస్తుంది. కార్యాలయంలో మీ పనితీరుకు ప్రశంసలు దక్కడంతో పాటు ఉన్నతాధికారుల అండదండలు లభిస్తాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


