...
...
Next Story

ధన త్రయోదశి రోజు యమ దీపం ఎందుకు వెలిగించాలి? ఈ పురాణ కథ మీకు తెలుసా?

దీపావళి పండుగలో మొదటి రోజైన ధన త్రయోదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ధన్వంతరి స్వామి, లక్ష్మీదేవి, కుబేరుడిని పూజించడంతో పాటు యమ దీపదానం చేసే సంప్రదాయం కూడా ఉంది. ధన త్రయోదశి సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం బయట దక్షిణ దిశను అభిముఖంగా మట్టి ప్రమిదలో ఆవ నూనె లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తారు.

Published on: Oct 31, 2026, 14:00:44 IST
Advertisement

దీపావళిని ఐదు రోజుల పాటు జరుపుకుంటాము. దీపావళి పండుగ ధన త్రయోదశితో మొదలవుతుంది. ఆ రోజు ధన్వంతరి స్వామివారిని పూజిస్తాము. అలాగే లక్ష్మీదేవిని, కుబేరుడిని కూడా భక్తితో పూజిస్తారు. ధన త్రయోదశి నాడు కొన్ని వస్తువులను కొనుగోలు చేసే సంప్రదాయంతో పాటుగా, యమ దీపదానం చేసే సంప్రదాయం కూడా ఉంది. ధన త్రయోదశి రోజు యమ దీపదానం ఎందుకు చేయాలి? యమ దీపం ప్రాముఖ్యత, పురాణ కథ, పూజా విధానం గురించి పూర్తి వివరాలు చూసేద్దాం.

అకాల మృత్యు భయం పోతుంది

ధన త్రయోదశి రోజు యమ దీపం ఎందుకు వెలిగించాలి? ఈ పురాణ కథ మీకు తెలుసా? (AI)
ధన త్రయోదశి రోజు యమ దీపం ఎందుకు వెలిగించాలి? ఈ పురాణ కథ మీకు తెలుసా? (AI)

సాయంత్రం ధన త్రయోదశి నాడు ఇంటి బయట యమధర్మరాజు పేరు మీద దీపాన్ని వెలిగించాలి. అలా చేస్తే అకాల మృత్యు భయం తొలగిపోతుందని నమ్ముతారు. యమ దీపదానం ప్రాముఖ్యత ఏంటి? పురాణ కథ ఏంటో కూడా చూసేద్దాం.

హిందూ శాస్త్రాల ప్రకారం చూస్తే, యమధర్మరాజును మృత్యుదేవుడిగా, ధర్మానికి ప్రతిరూపంగా చెప్తారు. అయితే కార్తీక మాసంలో వచ్చే కృష్ణ పక్ష త్రయోదశి రోజు సాయంత్రం యమధర్మరాజు పేరుతో దీపాన్ని వెలిగించాలి. దీనిని యమ దీపదానం అని అంటారు.

ఆ రోజు ఇలా చేయడం వలన కుటుంబ సభ్యులందరూ కూడా దీర్ఘాయుష్షును పొందుతారు. ఆరోగ్యం, సుఖ సంతోషాలు కలగాలని వేడుకుంటారు. యముడికి దీపం సమర్పిస్తే అకాల మృత్యు భయం పోతుందని, కుటుంబం అంతా కూడా క్షేమంగా ఉంటుందని నమ్ముతారు.

యమ దీపదానం వెనుక ఉన్న కథ

రాజు హేముడి కొడుకు జాతకంలో పెళ్లయిన నాలుగు రోజులకే మరణం సంభవిస్తుందని ఉంటుంది. యువరాజుకు పెళ్లి జరిగిన తర్వాత ఈ విషయం అతని భార్యకు తెలుస్తుంది. భర్తను మృత్యువు నుంచి కాపాడుకోవాలని ఆమె అనుకుంటుంది.

వివాహమైన నాలుగవ రోజు రాత్రి రాజభవన ప్రవేశ ద్వారం దగ్గర బంగారు, వెండి ఆభరణాలు, విలువైన వస్తువులను గుట్టలుగా పోసి, భవనం అంతటా కూడా దీపాలను వెలిగించి, భర్తకు నిద్ర రాకుండా కథలు చెబుతూ మెలకువగా ఉంచుతుంది. యమధర్మరాజు పాము రూపంలో యువరాజు ప్రాణాలను తీసుకెళ్లడానికి వస్తాడు.

యమ దీపాన్ని వెలిగించేటప్పుడు ముఖద్వారం బయట దక్షిణ దిశను అభిముఖంగా చేసుకుని వెలిగించాలి.

యమ దీపానికి మట్టి ప్రమిదలను ఉపయోగించాలి.

ఆవ నూనె లేదా నువ్వుల నూనె వేసి వెలిగిస్తే మంచిది. పత్తితో చేసిన వత్తిని వేసి దీపం వెలిగించాలి.

ప్రధాన ద్వారం బయట దక్షిణ దిశను అభిముఖంగా దీపాన్ని ఉంచాలి.

ఇలా చేయడం వలన ఆరోగ్యం కలుగుతుంది. సుఖ సంతోషాలు, దీర్ఘాయుష్షును కూడా పొందవచ్చు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks