Dhanteras Wishes 2025: మీ స్నేహితులకు, బంధువులకు ఈ శ్లోకాలతో ధన త్రయోదశి విషెస్ చెప్పండి!

ధన త్రయోదశి నాడు బంగారం, వెండి కొనుగోలు చేస్తే సకల శుభాలు కలుగుతాయని, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చని నమ్ముతారు. ధన త్రయోదశి నాడు ఆయుర్వేదం కూడా పుట్టిందని అంటారు. ధన త్రయోదశి నాడు మీ స్నేహితులు, బంధువులు బాగుండాలని, వారికి కూడా లక్ష్మీ అనుగ్రహం కలగడానికి ఈ శుభాకాంక్షలు తెలపండి.

Published on: Oct 17, 2025, 13:30:19 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రేపే ధన త్రయోదశి. ధన త్రయోదశి అంటే మనకి మొదట గుర్తొచ్చేది బంగారం, వెండి. ధన త్రయోదశి నాడు బంగారం, వెండి కొనుగోలు చేస్తే సకల శుభాలు కలుగుతాయని, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చని నమ్ముతారు. ధన త్రయోదశి నాడు ఆయుర్వేదం కూడా పుట్టిందని అంటారు. ఎంతో విశిష్టంగా ధనవంతుని పూజను ఆ రోజు నిర్వహిస్తారు. ఈ ఏడాది ధన త్రయోదశి అక్టోబర్ 18, శనివారం నాడు వచ్చింది. ఆ రోజు ధనవంతునికి జయంతిగా, లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజుగా భావించి లక్ష్మీదేవిని ఆరాధిస్తారు.

ధన త్రయోదశి విషెస్ 2025 (pinterest)
ధన త్రయోదశి విషెస్ 2025 (pinterest)

లక్ష్మీదేవి

లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి బంగారం, వెండి కొనుగోలు చేస్తారు. అదే విధంగా ఆ రోజు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. వినాయకుడిని, లక్ష్మీదేవిని, కుబేరుని పూజిస్తే సిరిసంపదలు కలుగుతాయని నమ్మకం. సాయంత్రం యమ దీపాన్ని వెలిగిస్తారు. అలా చేయడం వలన అపవిత్ర దోషం తొలగిపోతుందని విశ్వాసం.

అలాగే ధన త్రయోదశి నాడు కొన్ని పొరపాట్లు కూడా చేయకుండా చూసుకుంటారు. ధన త్రయోదశి నాడు మర్చిపోకుండా యమదీపాన్ని వెలిగించడం, లక్ష్మీదేవిని పూజించడం వంటివి చేస్తారు. అలాగే తులసి కోట ముందు నేతితో దీపారాధన చేస్తారు. తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేసి తులసమ్మను పూజిస్తారు. అలా చేయడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుందని నమ్ముతారు.

లక్ష్మీ అనుగ్రహం కలగడానికి ఈ శుభాకాంక్షలు తెలపండి

లక్ష్మీదేవిని ప్రసన్నం చేయడానికి ధన త్రయోదశి నాడు తామర పూలమాలను సమర్పిస్తారు. గడపలకు పసుపు, కుంకుమలు రాసి, వరి పిండితో గడపపై ముగ్గులు వేస్తారు. ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని భావిస్తారు. ఇక ధన త్రయోదశి నాడు అందరికీ సకల శుభాలు కలగాలని అనుకుంటున్నారా? మరి ధన త్రయోదశి నాడు మీ స్నేహితులు, బంధువులు బాగుండాలని, వారికి కూడా లక్ష్మీ అనుగ్రహం కలగడానికి ఈ శుభాకాంక్షలు తెలపండి. మామూలుగా కాకుండా శ్లోకాలతో ఈ విషెస్ ని మీ స్నేహితులకి, బంధువులకు చెప్పండి.

ధన త్రయోదశి విషెస్ 2025

ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ, సర్వామయవినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీమహావిష్ణవే స్వాహా.. ధన త్రయోదశి శుభాకాంక్షలు..

ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే, అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరమ్.. ధన త్రయోదశి శుభాకాంక్షలు..

ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి.. తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్.. మీకు, మీ కుటుంబ సభ్యులకు ధన త్రయోదశి శుభాకాంక్షలు..

ఓం ధం ధన్వంతరయే నమః.. ఆ భగవంతుని ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ.. ధన త్రయోదశి శుభాకాంక్షలు..

అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత

రోగాన్మే నాశయా శేషానాశు ధన్వంతరే హరే..

ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజో ధియం శ్రియం

స్వభక్తేభ్యోనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిమ్..

మీకు, మీ కుటుంబ సభ్యులకు ధన త్రయోదశి శుభాకాంక్షలు...

'ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గ్రిహి ధనం పూరయ పూరయ నమః' ఆ లక్ష్మీ, కుబేరుల అనుగ్రహంతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుతూ ధన త్రయోదశి శుభాకాంక్షలు

ఓం హ్రీం శ్రీ క్రీం క్లీం శ్రీ లక్ష్మీ మమ గృహే ధన పూరాయే ధ పూరాయే చింతయా దూర దూర స్వాహా.. ఆ అమ్మ ఆశీస్సులతో ఎప్పుడూ మీరు, మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తూ ధన త్రయోదశి శుభాకాంక్షలు

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More