...
...
Next Story

ధన్వంతరి స్వామి చేతిలో అమృత కలశం ఎందుకు ఉంటుంది? దీని వెనుక ఉన్న పురాణ రహస్యం తెలుసా?

దీపావళికి ముందు వచ్చే ధన త్రయోదశి రోజున ఆయుర్వేద దైవమైన ధన్వంతరి స్వామిని ఎందుకు పూజిస్తారు? సముద్ర మథనం, అమృత కలశ ఆవిర్భావం వెనుక ఉన్న పౌరాణిక నేపథ్యం ఏమిటో ఈ కథనంలో తెలుసుకోండి.

Published on: Nov 3, 2026, 16:00:39 IST
Advertisement

దీపావళికి ముందు వచ్చే త్రయోదశి రోజు ధన త్రయోదశిని జరుపుకుంటాము. ఈ ఏడాది ధన త్రయోదశి నవంబర్ 6న వచ్చింది. ఆరోజు ధన్వంతరి స్వామిని పూజించడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ధన త్రయోదశి నాడు సముద్ర మథనం నుంచి అమృత కలశంతో ధన్వంతరి ఆవిర్భవించారని అంటారు. ఆయన అమృత కలశాన్ని ఎందుకు తీసుకువచ్చారు? దీని వెనుక ఉన్న పురాణ గాథ గురించి ఈరోజు తెలుసుకుందాం.

అసలు ధన్వంతరి స్వామి సముద్ర మథనం నుంచి ఎలా ఆవిర్భవించారు?

ధన్వంతరి స్వామి చేతిలో అమృత కలశం ఎందుకు ఉంటుంది? దీని వెనుక ఉన్న పురాణ రహస్యం తెలుసా? (AI)
ధన్వంతరి స్వామి చేతిలో అమృత కలశం ఎందుకు ఉంటుంది? దీని వెనుక ఉన్న పురాణ రహస్యం తెలుసా? (AI)

పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే, మహర్షి దుర్వాసుడు శాపం ఇచ్చిన కారణంగా దేవతల శక్తి క్షీణించింది. ఈ అవకాశాన్ని రాక్షసులు ఉపయోగించుకుని స్వర్గలోకాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో ఇబ్బందులు ఎదుర్కొన్న దేవతలు విష్ణువు దగ్గరకు వెళ్లారు. విష్ణువు దేవతలకు ఒక ఉపాయం చెప్పాడు. రాక్షసులతో కలిసి క్షీరసాగర మథనం చేయాలని విష్ణువు వారికి సూచించగా, సముద్ర మథనం ద్వారా అమృతం లభిస్తుంది. దానిని సేవించడం ద్వారా దేవతలకు తిరిగి శక్తి లభిస్తుంది. అలాగే, మరణం లేని అమరత్వం సిద్ధిస్తుంది.

దీంతో దేవతలు, రాక్షసులు క్షీరసాగర మథనాన్ని మొదలుపెట్టారు. మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి సర్పాన్ని తాడుగా ఉపయోగించడం జరిగింది. విష్ణువు కూర్మావతారం ధరించి వీపు పై మందర పర్వతాన్ని మోశాడు.

అమృత కలశాన్ని తీసుకొచ్చిన ధన్వంతరి స్వామి

సముద్ర మథనం జరిగేటప్పుడు అనేక విలువైన రత్నాలు, వస్తువులు ఆవిర్భవించాయి. వాటిలో భాగంగా ధన్వంతరి స్వామి అమృతంతో నిండిన కలశాన్ని చేతిలో పట్టుకుని ప్రత్యక్షమయ్యారు. అమృతాన్ని సేవిస్తే దేవతలకు అమరత్వం లభిస్తుంది. దేవతలు, రాక్షసులు ఇద్దరూ కూడా అమృతాన్ని పొందాలని ఆశించారు.

వ్యాధులను నివారించుకోవడం, ఆరోగ్యంగా జీవించడం ఎలా అనేది ధన్వంతరి స్వామి ప్రపంచానికి బోధించారు. అందుకే ఆయనను దేవతల వైద్యుడు అని అంటారు. ధన త్రయోదశి నాడు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, దీర్ఘాయుష్షును పొందాలని ధన్వంతరి స్వామిని ఆరాధిస్తారు. అలాగే, ఆ రోజు వెండి, బంగారం, ఇతర వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇలా చేయడం వలన ఐశ్వర్యం, సుఖ సంతోషాలు, ఆరోగ్యం కలుగుతాయని విశ్వాసం.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks