గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం సహజం. ఇవి ద్వాదశ రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అదే విధంగా, కొన్ని రాశుల వరకే ఎక్కువ ఫలితాలను అందిస్తాయి.

2025 సంవత్సరం దీపావళి అక్టోబర్ 20, సోమవారం నాడు వచ్చింది. ఆ రోజునుంచి ఆరు నెలల పాటు కొన్ని రాశుల వారికి విపరీతమైన అదృష్టం కలగబోతోంది. దీపావళి సందర్భంగా ఐదు రాశుల వారికి విపరీతమైన అదృష్టం కలగబోతోంది. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఎలాంటి లాభాలను పొందుతారు? ఇప్పుడు తెలుసుకుందాం.
రాజయోగం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, ధనస్సు, తులా రాశితో పాటుగా కొన్ని రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం విపరీతంగా ఉంటుంది. ఈ రాశుల వారికి లక్ష్మీనారాయణ రాజయోగం ఆరు నెలల పాటు ఊహించని లాభాలను తీసుకురాబోతోంది. ధనం, సంతోషం, కీర్తితో పాటుగా అనేక విధాలుగా ఫలితాలు లభించబోతున్నాయి. మరి ఈ అదృష్ట రాశుల్లో మీరు కూడా ఒకరేమో చూసుకోండి.
దీపావళి నుంచి ఆరు నెలల పాటు ఈ రాశుల వారికి విపరీతమైన అదృష్టం.. లక్ష్మీనారాయణ రాజయోగంతో శుభ ఫలితం
1.వృషభ రాశి
వృషభ రాశి వారికి దీపావళి సందర్భంగా ధన లాభం కలిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఆర్థికంగా ఈ రాశి వారు ఊహించని లాభాలను పొందుతారు. ధనం, సంతోషానికి లోటు ఉండదు. వృషభ రాశి వారు దీపావళి నుంచి ఆరు నెలల పాటు లక్ష్మీనారాయణ యోగంతో విజయాలను అందుకుంటారు. సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.
2.మిధున రాశి
మిధున రాశి వారు దీపావళి నుంచి ఆరు నెలల పాటు అనేక లాభాలను పొందుతారు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. దీపావళి రాత్రి నుంచే ఈ రాశి వారికి పురోగతి ఉంటుంది. వ్యాపారంలో ఎక్కువ లాభాలు ఉంటాయి.
కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి ఇది శుభ సమయం. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో మీ దగ్గరికి రావాల్సిన ధనం ఈ సమయంలో మీ వద్దకు వస్తుంది.
3.తులా రాశి
{{/usCountry}}కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి ఇది శుభ సమయం. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో మీ దగ్గరికి రావాల్సిన ధనం ఈ సమయంలో మీ వద్దకు వస్తుంది.
3.తులా రాశి
{{/usCountry}}తులా రాశి వారికి దీపావళి ప్రత్యేకంగా ఉండబోతోంది. ఈ రాశి వారు ఆరు నెలల పాటు లక్ష్మీ అనుగ్రహంతో సంతోషంగా ఉంటారు. కెరీర్‌లో కూడా కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అనుకున్న విజయాలను సాధించి సంతోషంగా ఉంటారు.
4.ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి దీపావళి నుంచి ఆరు నెలల పాటు అదృష్టం కలగబోతోంది. గురు గ్రహం ప్రభావంతో ఈ రాశి వారు ధన సమస్యల నుంచి బయటపడతారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. పెట్టుబడి పెట్టడానికి, ఆస్తులు కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం. పాత గొడవలు కూడా తీరిపోతాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది.
5.కుంభ రాశి
కుంభ రాశి వారికి దీపావళి నుంచి బాగా కలిసి వస్తుంది. అదృష్టం వరిస్తుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇది మంచి సమయం. ఆర్థికంగా ఎక్కువ లాభాలను పొందుతారు. ఎప్పటినుంచో తీరని సమస్యలు ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. విద్యా, విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కూడా ఇది మంచి సమయం.