ప్రతి ఒక్కరూ కూడా దీపావళి పండుగను సంతోషంగా జరుపుకుంటారు. దీపావళి నాడు లక్ష్మీదేవి ఇంటికి రావాలని, లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉంటారు. సిరి సంపదలను అందించే దీపావళిని అడుగుగా ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు.

లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి గవ్వలు వంటివి కూడా సమర్పిస్తూ ఉంటారు. భూదేవి, వరాహస్వామికి అసురసన్నిధిలో పుట్టిన నరకాసురుడు తల్లి చేతిలోనే మరణించాలని కోరుకున్నాడు. ఆ గర్వంతోనే మూడు లోకాలను కూడా ఇబ్బంది పెట్టాడు.
యుగయుగాలుగా దీపావళి పండుగ
దేవతలు మహావిష్ణువుని ప్రార్థించగా, మహావిష్ణువు కృష్ణుడిగా, భూదేవి సత్యభామగా జన్మించి నరకాసురుని సంహారం చేశారు. ఆ రోజే నరక చతుర్దశిగా మనం జరుపుకుంటాము. తర్వాత రోజు దీపావళి పండుగ చేసుకుంటాము. త్రేతాయుగంలో రాముడు రావణుడిని సంహరించాక అయోధ్యకు వచ్చిన సందర్భంగా ఆనందంతో ప్రజలు దీపాలు వెలిగించి, బాణాసంచా కాల్చి దీపావళి పండుగను జరుపుకున్నారు.
అలా దీపావళిని యుగయుగాలుగా జరుపుతూనే ఉన్నారు. దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవిని ఆరాధిస్తే సకల శుభాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు. ఇక ఈ దీపావళికి మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు సంతోషంగా ఉండాలని అనుకుంటున్నట్లయితే ఈ విషెస్‌ను వారితో కూడా షేర్ చేసుకోండి.
ఈ శ్లోకాలు, కొటేషన్ల ద్వారా శుభాకాంక్షలు తెలపండి
దీపాలు వెలుగుల మీ ప్రేమ వ్యాప్తి చెందాలని, తొలగిపోయే చీకటిలా ద్వేషం నశించాలని ఆశిస్తూ.. దీపావళి శుభాకాంక్షలు!
దీపం వెలుతురుతో చీకటిని తరిమినట్లు, జీవితంలో ఒక్కో మార్పుని ఆహ్వానిస్తూ కొత్త జీవితానికి స్వాగతం పలుకుదాం.. హ్యాపీ దీపావళి!
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
శంఖ చక్రగదాహస్తే విశ్వరూపిణితే జయః
జగన్మాత్రే చ మోహిన్యై మంగళం శుభ మంగళమ్
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు