ఈరోజు కర్కాటక రాశిలో గురువు సంచారంతో ఏర్పడిన కేంద్ర త్రికోణ రాజయోగం.. మూడు రాశులకు ధన లాభం, విదేశీ ప్రయాణంతో పాటు ఎన్నో!
గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. గురువు సంచారంలో మార్పు రావడంతో కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ కేంద్ర త్రికోణ రాజయోగం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది. 12 రాశుల వారిపై ప్రభావం చూపించినప్పటికీ, కొన్ని రాశుల వారు ప్రత్యేక లాభాలను పొందుతారు.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఇలా గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. ధన త్రయోదశి నాడు లక్ష్మీదేవిని, వినాయకుని పూజిస్తారు. అలా ఆరాధించడం వలన సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. ఈ సంవత్సరం అక్టోబర్ 18 అంటే ఈరోజు ధన త్రయోదశి వచ్చింది. గురువు కూడా తన రాశిని మారుస్తాడు. ధన త్రయోదశి వేళ ఈరోజు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు.

కేంద్ర త్రికోణ రాజయోగం
గురువు సంచారంలో మార్పు రావడంతో కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ కేంద్ర త్రికోణ రాజయోగం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది. 12 రాశుల వారిపై ప్రభావం చూపించినప్పటికీ, కొన్ని రాశుల వారు మాత్రం ప్రత్యేక లాభాలను పొందుతారు.
ఈ రాశుల వారికి లక్ష్మీ, కుబేరుని అనుగ్రహం కలుగుతుంది. పెండింగ్‌లో ఉన్న పనుల్ని పూర్తి చేస్తారు. ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుంది. వ్యాపారులకు కూడా ఇది శుభ సమయం. మరి ఈ యోగం వలన ఏ రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు? ఏ రాశుల వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడే తెలుసుకుందాం.
గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం
1.కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి గురువు సంచారంలో మార్పు శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. లక్ష్మీదేవి, కుబేరుల అనుగ్రహం కలుగుతుంది. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది. సంతోషం కూడా ఎక్కువవుతుంది. పెండింగ్‌లో ఉన్న పనుల్ని పూర్తి చేస్తారు. ఇలా ఈ రాశి వారికి అనేక విధాలుగా కలిసి వస్తుంది.
2.తులా రాశి
తులా రాశి వారికి గురువు అనుగ్రహంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఉద్యోగాలు, వ్యాపారాల్లో పురోగతిని చూస్తారు. విదేశీ ప్రయాణాలు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారి గౌరవ, మర్యాదలు కూడా పెరుగుతాయి. ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుంది.
3.వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు కూడా శుభ ఫలితాలను ఎదుర్కొంటారు. గురువు సంచారంలో మార్పు శుభ ఫలితాలను తీసుకువస్తుంది. పాత సమస్యలు తొలగిపోతాయి. బాధల నుంచి ఉపశమనాన్ని పొందుతారు. వ్యాపారులకు కూడా ఇది శుభ సమయం. ఈ రాశి వారు ఈ రోజు బంగారం లేదా కంచు కొనుగోలు చేస్తే బాగా కలిసి వస్తుంది. సంతోషంగా ఉంటారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


