Diwali 2025 wishes: ఈ శ్లోకాలతో మీ బంధుమిత్రులకు దీపావళి శుభాకాంక్షలు తెలపండి!

దీపావళిని యుగయుగాలుగా జరుపుతూనే ఉన్నారు. దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవిని ఆరాధిస్తే సకల శుభాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు. ఇక ఈ దీపావళికి మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు సంతోషంగా ఉండాలని అనుకుంటున్నట్లయితే ఈ విషెస్‌ను వారితో కూడా షేర్ చేసుకోండి.

Published on: Oct 19, 2025, 16:00:10 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి ఒక్కరూ కూడా దీపావళి పండుగను సంతోషంగా జరుపుకుంటారు. దీపావళి నాడు లక్ష్మీదేవి ఇంటికి రావాలని, లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉంటారు. సిరి సంపదలను అందించే దీపావళిని అడుగుగా ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు.

ఈ శ్లోకాలతో మీ బంధుమిత్రులకు దీపావళి శుభాకాంక్షలు తెలపండి (pinterest)
ఈ శ్లోకాలతో మీ బంధుమిత్రులకు దీపావళి శుభాకాంక్షలు తెలపండి (pinterest)

లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి గవ్వలు వంటివి కూడా సమర్పిస్తూ ఉంటారు. భూదేవి, వరాహస్వామికి అసురసన్నిధిలో పుట్టిన నరకాసురుడు తల్లి చేతిలోనే మరణించాలని కోరుకున్నాడు. ఆ గర్వంతోనే మూడు లోకాలను కూడా ఇబ్బంది పెట్టాడు.

యుగయుగాలుగా దీపావళి పండుగ

దేవతలు మహావిష్ణువుని ప్రార్థించగా, మహావిష్ణువు కృష్ణుడిగా, భూదేవి సత్యభామగా జన్మించి నరకాసురుని సంహారం చేశారు. ఆ రోజే నరక చతుర్దశిగా మనం జరుపుకుంటాము. తర్వాత రోజు దీపావళి పండుగ చేసుకుంటాము. త్రేతాయుగంలో రాముడు రావణుడిని సంహరించాక అయోధ్యకు వచ్చిన సందర్భంగా ఆనందంతో ప్రజలు దీపాలు వెలిగించి, బాణాసంచా కాల్చి దీపావళి పండుగను జరుపుకున్నారు.

అలా దీపావళిని యుగయుగాలుగా జరుపుతూనే ఉన్నారు. దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవిని ఆరాధిస్తే సకల శుభాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు. ఇక ఈ దీపావళికి మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు సంతోషంగా ఉండాలని అనుకుంటున్నట్లయితే ఈ విషెస్‌ను వారితో కూడా షేర్ చేసుకోండి.

ఈ శ్లోకాలు, కొటేషన్ల ద్వారా శుభాకాంక్షలు తెలపండి

దీపాలు వెలుగుల మీ ప్రేమ వ్యాప్తి చెందాలని, తొలగిపోయే చీకటిలా ద్వేషం నశించాలని ఆశిస్తూ.. దీపావళి శుభాకాంక్షలు!

దీపం వెలుతురుతో చీకటిని తరిమినట్లు, జీవితంలో ఒక్కో మార్పుని ఆహ్వానిస్తూ కొత్త జీవితానికి స్వాగతం పలుకుదాం.. హ్యాపీ దీపావళి!

సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే

శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే

మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

శంఖ చక్రగదాహస్తే విశ్వరూపిణితే జయః

జగన్మాత్రే చ మోహిన్యై మంగళం శుభ మంగళమ్

మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే

శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోస్తు తే

దీపావళి శుభాకాంక్షలు

ఈ శ్లోకాలతో మీ బంధుమిత్రులకు దీపావళి శుభాకాంక్షలు తెలపండి (pinterest)
ఈ శ్లోకాలతో మీ బంధుమిత్రులకు దీపావళి శుభాకాంక్షలు తెలపండి (pinterest)

ఓం మహాదేవ్యేచ విద్మహే, విష్ణు పత్నేచ దీమహే, తన్నో లక్ష్మీ ప్రచోదయాత్... హ్యాపీ దీపావళి

భో దీప బ్రహ్మరూపస్త్వం జ్యోతిషాం ప్రభురవ్యయః

ఆరోగ్యం దేహి పుత్రాంశ్చ అవైధవ్యం ప్రయచ్ఛ మే

మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు..

ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి

యోగజే యోగసంభూతే మహాలక్ష్మి నమోస్తు తే

దీపావళి శుభాకాంక్షలు

దీపస్త్వమేవ జగతాం దయితా రుచిస్తే.. దీర్ఘం తమః ప్రతినివృత్యమితం యువాభ్యామ్

స్తవ్యం స్తవప్రియమతః శరణోక్తివశ్యం.. స్తోతుం భవంతమభిలష్యతి జంతురేషః

మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More