...
...
Next Story

దీపావళి 2026: నవంబర్ 8న లక్ష్మీ పూజ ముహూర్తం ఇదే.. పూజా విధానం తెలుసుకోండి!

హిందువుల ప్రధాన పండుగల్లో దీపావళికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. 2026లో నవంబర్ 8, ఆదివారం దీపావళి పండుగను జరుపుకోనున్నారు. ఆశ్వయుజ మాస అమావాస్య రోజున జరుపుకునే ఈ పండుగకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉంది.

Published on: Oct 30, 2026, 16:00:42 IST
Advertisement

హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో దీపావళి పండుగ ఒకటి. అత్యంత ఘనంగా, పవిత్రంగా దీపావళిని జరుపుకుంటాము. ఈ సంవత్సరం దీపావళి నవంబర్ 8, ఆదివారం నాడు వచ్చింది. ప్రతి ఏటా ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున దీపావళిని జరుపుకుంటాము.

దీపావళి 2026

దీపావళి 2026: నవంబర్ 8న లక్ష్మీ పూజ ముహూర్తం ఇదే.. పూజా విధానం తెలుసుకోండి! (AI)
దీపావళి 2026: నవంబర్ 8న లక్ష్మీ పూజ ముహూర్తం ఇదే.. పూజా విధానం తెలుసుకోండి! (AI)

రావణాసురుడిని హతమార్చి, పదహారేళ్ల అరణ్యవాసం ముగించుకుని సీతారామచంద్రులు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా దీపావళి పండుగను జరుపుకుంటాము. అయోధ్యవాసులు రామయ్యకు స్వాగతం పలుకుతూ దీపాలు వెలిగిస్తారు. ఆనాటి నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నాము.

దీపావళి రోజు లక్ష్మీ పూజ చేయడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరిసంపదలకు లోటు ఉండదు. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అయితే దీపావళి నాడు లక్ష్మీ పూజ ఎప్పుడు చేసుకోవాలి? లక్ష్మీ పూజ సమయంతో పాటుగా పూజా విధానం వివరాలు కూడా చూద్దాం.

లక్ష్మీ గణేశ పూజ విధానం

దీపావళి నాడు సిరిసంపదలు కలగాలంటే లక్ష్మీ గణపతిని ఆరాధించడం మంచిది. పండుగ రోజు ఉదయాన్నే ఇల్లు, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. రంగురంగుల ముగ్గులతో, దీపాలతో ఇంటిని అలంకరించుకోవాలి.

పూజా స్థలంలో ఒక పీఠం వేసి, దానిపై శుభ్రమైన వస్త్రాన్ని పరిచి, గణేశ విగ్రహంతో పాటు లక్ష్మీదేవి, కుబేరుని ప్రతిమలను కూడా ఉంచండి.

దేవుని ముందు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. తర్వాత విఘ్నేశ్వరుని స్మరిస్తూ పూజను మొదలుపెట్టండి.

దీపధూప నైవేద్యాలతో పూజను పూర్తి చేసి, లక్ష్మీ మంత్రాలను భక్తితో జపించండి. చివరిగా హారతి ఇచ్చి, కుటుంబమంతా సంతోషంగా పండుగను జరుపుకోండి. ఇలా చేయడం వలన ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలుగుతాయి.

లక్ష్మీ పూజ ముహూర్తం

దీపావళి పండుగ తేదీ: నవంబర్ 8, ఆదివారం

అమావాస్య తిథి ప్రారంభం: నవంబర్ 8 ఉదయం 11:27 గంటలకు

అమావాస్య తిథి ముగింపు: నవంబర్ 9 మధ్యాహ్నం 12:31 గంటలకు

లక్ష్మీ పూజ ముహూర్తం: సాయంత్రం 5:54 నుంచి రాత్రి 7:50 వరకు

ప్రదోష కాలం: సాయంత్రం 5:31 నుంచి రాత్రి 8:09 వరకు

దీపావళి రోజు చేసే లక్ష్మీ పూజ ప్రాముఖ్యత

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks