...
...
Next Story

దీపావళి వేళ మీ రాశుల ప్రకారం ఈ దీపాలను వెలిగిస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది!

హిందూ మత విశ్వాసాల ప్రకారం, ఆ రోజు పవిత్ర దీపాలను వెలిగిస్తే ఆ ఇంట లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని, డబ్బుకి లోటు ఉండదని నమ్ముతారు. మీ రాశి ప్రకారం ఏ విధంగా దీపాలను వెలిగించడం వలన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, డబ్బుకి లోటు ఉండదు, ఆర్థిక ఇబ్బందులు అన్ని తొలగిపోయి సంతోషంగా కూడా ఉండొచ్చు.

Published on: Oct 14, 2025, 10:30:05 IST
Advertisement

దీపావళి పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం, ఆ రోజు పవిత్ర దీపాలను వెలిగిస్తే ఆ ఇంట లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని, డబ్బుకి లోటు ఉండదని నమ్ముతారు. వ్యాపారులు కూడా ఆ రోజు ప్రత్యేకించి లక్ష్మీదేవిని పూజిస్తారు. దీపావళి నాడు ఆవు నూనె, నువ్వుల నూనె లేదా ఆవాల నూనెతో దీపాలను వెలిగిస్తూ ఉంటారు. అలా చేయడం వలన కష్టాలు తొలగిపోతాయని నమ్మకం ఉంది. దీపావళి నాడు ఇంట్లో దీపాలను వెలిగించడం వలన సానుకూల శక్తి ప్రవేశించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు కూడా పొందవచ్చు.

దీపావళి 2025

దీపావళి 2025 సందర్భంగా మీ రాశి ప్రకారం ఏ దీపాన్ని వెలిగిస్తే మంచిదో తెలుసుకోండి (pinterest)
దీపావళి 2025 సందర్భంగా మీ రాశి ప్రకారం ఏ దీపాన్ని వెలిగిస్తే మంచిదో తెలుసుకోండి (pinterest)

డబ్బుకు కూడా కొరత ఉండదు. అయితే దీపావళి నాడు దీపాలను వెలిగించేటప్పుడు మీ రాశి ప్రకారం ఎలాంటి దీపాలను వెలిగించాలో ఇప్పుడు తెలుసుకోండి. మీ రాశి ప్రకారం ఏ విధంగా దీపాలను వెలిగించడం వలన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, డబ్బుకి లోటు ఉండదు, ఆర్థిక ఇబ్బందులు అన్ని తొలగిపోయి సంతోషంగా కూడా ఉండొచ్చు.

దీపావళి 2025 సందర్భంగా, మీ రాశి ప్రకారం ఏ దీపాన్ని వెలిగిస్తే మంచి జరుగుతుందో తెలుసుకోండి

మేష రాశి

మేష రాశి వారు దీపావళి నాడు లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహాన్ని పొందడానికి ఐదు నువ్వుల నూనె దీపాలను వెలిగిస్తే మంచిది. అదే విధంగా, పూజ చేసే చోట బియ్యం పిండితో ముగ్గు వేసి లక్ష్మీదేవిని ఆరాధించండి.

వృషభ రాశి

వృషభ రాశి వారు దీపావళి నాడు ఆవు నెయ్యితో దీపాలను వెలిగిస్తే మంచిదే. మూడు లేదా ఐదు దీపాలను వెలిగించవచ్చు. ఈ విధంగా ఆచరించడం వలన ప్రతికూల శక్తి తొలగిపోతుంది, లక్ష్మీ అనుగ్రహం కూడా ఉంటుంది.

మిధున రాశి

కర్కాటక రాశి వారు కూడా ఆవు నెయ్యితో దీపారాధన చేయడం మంచిది. ఇలా దీపాలను వెలిగించడం వలన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, సంతోషంగా ఉండొచ్చు.

సింహ రాశి

సింహ రాశి వారు పూజ గదిలో బియ్యం పిండితో ముగ్గు వేసి, నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి. ఐదు దీపాలనైనా వెలిగించవచ్చు.

కన్యా రాశి

కన్యా రాశి వారు ఆవు నూనె దీపాలను వెలిగించాలి. ఒకటి లేదా ఏడు దీపాలను వెలిగించవచ్చు. ఈ విధంగా పాటించడం వలన శని దోష ప్రభావం కూడా తగ్గుతుంది.

తులా రాశి

తులా రాశి వారు మూడు లేదా ఐదు ఆవు నెయ్యి దీపాలను వెలిగించాలి. ఇలా చేయడం వలన ప్రతికూల శక్తి తొలిగి, సానుకూల శక్తి వ్యాపిస్తుంది. లక్ష్మీ అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు.

వృశ్చిక రాశి

ఈ రాశి వారు నువ్వుల నూనెతో దీపారాధన చేయడం మంచిది. ఐదు దీపాలను వెలిగించవచ్చు. అలాగే బియ్యం పిండితో ముగ్గు వేస్తే బాగా కలిసి వస్తుంది.

ధనస్సు రాశి

ధనస్సు రాశి వారు దీపావళి నాడు ఐదు నువ్వుల నూనె దీపాలను వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి.

మకర రాశి

మకర రాశి వారు ఆవు నూనె దీపాలను వెలిగిస్తే శని దోషం నుంచి బయటపడవచ్చు. అదే విధంగా లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుంది.

కుంభ రాశి

కుంభ రాశి వారు ఆవు నూనె దీపాలను వెలిగిస్తే శని దోషం నుంచి బయటపడడానికి అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది.

మీన రాశి

ఈ రాశి వారు దీపావళి నాడు నువ్వుల నూనె దీపాలను వెలిగించాలి. కనీసం ఐదు దీపాలనైనా వెలిగించవచ్చు. ఈ విధంగా పాటించడం వలన జీవితంలో కష్టాలు తొలగిపోతాయి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe