ప్రతి ఇంట్లోనూ పూజ గదికి చాలా ముఖ్యమైన స్థానం ఉంటుంది. హిందూ సంప్రదాయంలో కొత్త ఇల్లు కట్టేటప్పుడు స్వామివారి గది వాస్తుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లోని స్వామివారి గది సానుకూల శక్తికి, శాంతికి మూలం. దానిని సరైన దిశలో, సరైన ప్రదేశంలో నిర్మించినప్పుడు మాత్రమే ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు వెల్లివిరుస్తాయి.

వాస్తు నియమాలకు విరుద్ధంగా దేవుడి గదిని నిర్మిస్తే, అది ఇంటికి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుందని నమ్ముతారు. దీనివల్ల ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, అనారోగ్యం వంటి సమస్యలు తలెత్తవచ్చని అంటుంటారు. వాస్తు నియమాల ప్రకారం, ఇంట్లోని ఈ 3 ప్రదేశాలలో దేవుడి గదిని నిర్మించకూడదు. ఆ ప్రదేశాలు ఏంటో చూడండి.
చాలా మంది స్థలాన్ని ఆదా చేసుకోవడానికి తమ ఇంట్లోని మెట్ల కింద దేవుడి గదిని నిర్మిస్తారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం, ఇది ఒక పెద్ద పొరపాటు. మెట్ల కింద దేవుడి గదిని నిర్మించడం అశుభంగా పరిగణిస్తారు. ప్రజలు ప్రతిరోజూ మెట్లపై నడుస్తారు కాబట్టి, అది పరోక్షంగా దేవుని మీద నుంచి వెళ్లడం. ఇది ఇంట్లో వాస్తు దోషాన్ని సృష్టిస్తుంది. అటువంటి ప్రదేశంలో పూజలు చేయడం ఫలించదు. కుటుంబ ఆర్థిక పురోగతికి ఆటంకం కలిగిస్తుంది.
పూజ గది అనేది సంపూర్ణ స్వచ్ఛత, పవిత్రత అవసరమయ్యే ప్రదేశం. అందువల్ల వాస్తు ప్రకారం ఏ కారణం చేతనైనా దేవుడి గదిని మరుగుదొడ్డికి లేదా స్నానాలగదికి పక్కన, ఎదురుగా, పైన లేదా కింద నిర్మించడం నిషిద్ధం. మరుగుదొడ్డి అనేది ప్రతికూల, చెడు శక్తిని ఉత్పత్తి చేసే ప్రదేశం. ఒకవేళ మరుగుదొడ్డి గోడ, పూజ గది గోడ ఒకటే అయితే.. ఆ ఇంట్లో ఎల్లప్పుడూ ఆర్థిక నష్టం ఉంటుంది. అది ఇంటి సభ్యుల ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది.
ఇంట్లోని పడకగదిలో పూజా మందిరాన్ని ఏర్పాటు చేయడం వాస్తు నియమాలకు పూర్తిగా విరుద్ధం. పడకగది అనేది కేవలం విశ్రాంతి, వ్యక్తిగత గోప్యత కోసం మాత్రమే కేటాయించిన ప్రదేశం. ఇక్కడ దేవుడి గది ఉంటే, దంపతుల మధ్య విభేదాలు పెరుగుతాయి. ఆ ఇంట్లో నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తవచ్చు అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అపార్ట్మెంట్లలో స్థలం తక్కువగా ఉండి.. పడకగదిలో దేవుడిని ఉంచాల్సిన అవసరం ఉంటే, దేవుడి విగ్రహాల కోసం ప్రత్యేకంగా చెక్క క్యాబినెట్‌ను ఉపయోగించాలి. పూజ పూర్తయిన తర్వాత కర్టెన్లను వేయాలి.
{{/usCountry}}ఇంట్లోని పడకగదిలో పూజా మందిరాన్ని ఏర్పాటు చేయడం వాస్తు నియమాలకు పూర్తిగా విరుద్ధం. పడకగది అనేది కేవలం విశ్రాంతి, వ్యక్తిగత గోప్యత కోసం మాత్రమే కేటాయించిన ప్రదేశం. ఇక్కడ దేవుడి గది ఉంటే, దంపతుల మధ్య విభేదాలు పెరుగుతాయి. ఆ ఇంట్లో నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తవచ్చు అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అపార్ట్మెంట్లలో స్థలం తక్కువగా ఉండి.. పడకగదిలో దేవుడిని ఉంచాల్సిన అవసరం ఉంటే, దేవుడి విగ్రహాల కోసం ప్రత్యేకంగా చెక్క క్యాబినెట్‌ను ఉపయోగించాలి. పూజ పూర్తయిన తర్వాత కర్టెన్లను వేయాలి.
{{/usCountry}}