...
...
Next Story

మనీ ప్లాంట్ విషయంలో ఈ 5 తప్పులు చేయకండి.. వాస్తు ప్రకారం ముఖ్యమైన నియమాలు!

వాస్తు నమ్మకాల ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్‌ను సరైన దిశలో, సరైన విధంగా పెంచితే ధనం, సుఖసమృద్ధి, సానుకూల శక్తికి ప్రతీకగా భావిస్తారు. అయితే మొక్కను ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా దిశ, తీగల పెరుగుదల, ఆకుల ఆరోగ్యం, కుండీ శుభ్రత వంటి అంశాలపై శ్రద్ధ పెట్టాలని సూచిస్తారు.

Published on: Sep 30, 2026, 11:01:00 IST
Advertisement

ఇంట్లో మనీ ప్లాంట్ పెంచడం నేడు చాలా సాధారణమైపోయింది. చాలామంది ఇళ్లలో హాలులో, బాల్కనీలో లేదా కిటికీల దగ్గర ఈ మొక్కను అందం కోసం, వాస్తు నమ్మకాలతో పెట్టుకుంటారు. వాస్తు శాస్త్రంలో ఈ పచ్చని మొక్కను ధనం, సుఖ-సమృద్ధి, సానుకూల శక్తికి ప్రతీకగా భావిస్తారు. అయితే, కేవలం ఏదో ఒక కుండీలో మొక్కను నాటేసి వదిలేస్తే సరిపోదు. దీనిని పెట్టే దిశ నుంచి మొదలుకొని, తీగెలు పాకే విధానం, మొక్క శుభ్రత వరకు ప్రతి చిన్న విషయాన్ని చాలా శ్రద్ధగా గమనించాలి. చిన్న చిన్న నిర్లక్ష్యాలు కూడా మొక్క ఇచ్చే శుభ ఫలితాలను అడ్డుకునే అవకాశం ఉంది.

మనీ ప్లాంట్‌కు సరైన దిశ ఏది?

మనీ ప్లాంట్ విషయంలో ఈ 5 తప్పులు చేయకండి.. వాస్తు ప్రకారం ముఖ్యమైన నియమాలు! (AI)
మనీ ప్లాంట్ విషయంలో ఈ 5 తప్పులు చేయకండి.. వాస్తు ప్రకారం ముఖ్యమైన నియమాలు! (AI)

వాస్తు శాస్త్రం ప్రకారం, మనీ ప్లాంట్‌ను అమర్చడానికి సరైన దిశను ఎంచుకోవడం అత్యంత ముఖ్యం. ఈ మొక్కను పొరపాటున కూడా ఈశాన్య మూలన పెట్టకూడదు. ఇది ఇంటి ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీనికి బదులుగా ఆగ్నేయ దిశను ఈ మొక్కకు అత్యంత ఉత్తమమైనదిగా పేర్కొన్నారు. వాస్తులో ఆగ్నేయ దిశ సంపద, సానుకూల శక్తికి నిలయంగా చెబుతారు. కాబట్టి కొత్తగా మనీ ప్లాంట్ పెట్టాలనుకునే వారు ఈ దిశను ఎంచుకోవడం చాలా మంచిది.

తీగలను ఎప్పుడూ కిందకు పడనివ్వద్దు

మనీ ప్లాంట్ తీగలు పెరిగే తీరు కూడా వాస్తుతో ముడిపడి ఉంటుంది. మొక్క తీగలు ఎప్పుడూ పైకి పాకడమనేది ఎదుగుదలకు, పురోగతికి సంకేతంగా భావిస్తారు. ఒకవేళ తీగలు నేల మీద పాకుతూ కిందకు వెళ్తుంటే దాన్ని మంచిదిగా భావించరు. అందువల్ల మొక్కకు ఒక సపోర్ట్ లాంటిది ఏర్పాటు చేసి తీగలను ఎక్కువుగా పైకి పాకేలా చూడాలి. ఇలా చేయడం వల్ల మొక్క అందంగా ఉండటంతో పాటు ఇంట్లోకి సానుకూల శక్తి ప్రసరిస్తుంది.

పసుపు రంగు ఆకులను వెంటనే తొలగించండి

మనీ ప్లాంట్‌లో ఆకులు ఎండిపోవడం లేదా పసుపు రంగులోకి మారడాన్ని ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. వాస్తు ప్రకారం, పాడైన లేదా ఎండిన ఆకులు ఇంట్లో వ్యర్థమైన నెగెటివ్ ఎనర్జీని పెంచుతాయి. కాబట్టి ఆకులకు ఆ లక్షణాలు కనిపించగానే వాటిని కత్తిరించి వెంటనే తొలగించాలి. మొక్కను ఎప్పుడూ పచ్చగా, కళకళలాడేలా చూసుకోవడం ద్వారా ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది.

ఏ రకమైన కుండీ ఉపయోగించాలి?

వాస్తు నిబంధనల ప్రకారం, మన ఇంట్లో పెరిగిన మనీ ప్లాంట్ తీగలను పొరపాటున కూడా బయటి వ్యక్తులకు దానం చేయకూడదు లేదా ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల ఇంటి ఐశ్వర్యం, సానుకూల శక్తి తగ్గిపోతుందని నమ్ముతారు. ఒకవేళ మొక్క బాగా పెరిగిపోయి పెద్దదైతే, దానిని మీ ఇంట్లోని వేరే కుండీలలో నాటుకోవచ్చు కానీ బయటకు మాత్రం ఇవ్వకపోవడం మంచిది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks