...
...
Next Story

Om Namah Shivaya : ఓం నమః శివాయ జపం చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి

Om Namah Shivaya : శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి 'ఓం నమః శివాయ' మంత్రం జపిస్తారు. ఈ మంత్రాన్ని సరైన పద్ధతిలో జపించడం ద్వారా కోరుకున్న ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. శివ మంత్రాన్ని జపించేటప్పుడు పొరపాట్లు చేయకూడదు.

Published on: Nov 24, 2026, 12:43:10 IST
Advertisement

మనం జపించే మంత్రాలలో ఓం నమః శివాయ అత్యంత ముఖ్యమైన మంత్రం. ఈ మంత్రాన్ని సరైన పద్ధతిలో జపించాలని గుర్తుంచుకోండి. ఓం నమః శివాయ మంత్రాన్ని తప్పుగా జపిస్తే, శివుని ఆగ్రహానికి గురవుతారు. జీవితంలో మీరు అశుభ సంఘటనలను ఎదుర్కొంటారు. అలాగే తప్పుగా జపించిన ఈ మంత్రం మీకు ఎలాంటి పుణ్యఫలాన్ని ఇవ్వదు. ఓం నమః శివాయ మంత్రాన్ని జపించేటప్పుడు మీరు కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి.

ఓం నమః శివాయ (unsplash)
ఓం నమః శివాయ (unsplash)

పౌరాణిక విశ్వాసాల ప్రకారం, భగవంతుడిని పూజించేటప్పుడు గానీ, దేవతల మంత్రాలు, స్తోత్రాలు పఠించేటప్పుడు గానీ, నిర్దిష్ట పద్ధతులను మనసులో ఉంచుకుని జపించడం ఉత్తమం. శివుడిని సంపూర్ణ క్రతువులతో పూజించాలి, మంత్రాలను జపించాలి. ఎవరైనా ఏ సమయంలోనైనా, ఏ విధంగానైనా సరైన పద్ధతిని పాటించకుండా భగవంతుని నామాన్ని జపిస్తే, వారి జపం నిరర్థకంగా పరిగణిస్తారు. ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి, భగవంతుని ముందు దీపం వెలిగించి, సంపూర్ణ భక్తిశ్రద్ధలతో ఓం నమః శివాయ మంత్రాన్ని జపించాలి.

కేవలం మంత్రాలు పఠించడానికే కాదు. భగవంతుడిని ఆరాధించడానికి కూడా భక్తి అవసరం. భక్తి లేకుండా మనం ఎంత గొప్పగా పూజ చేసినా, దాని వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం కలగదు. తప్పుడు ఉద్దేశాలతో మంత్రాన్ని జపించడం లేదా భక్తి లేకుండా మంత్రాన్ని జపించడం వల్ల మనకు ప్రయోజనం ఉండదు. కొందరు ఏదో ఆలోచిస్తూ.. ఓం నమ: శివాయ అంటూ జపిస్తారు. అలా చేయకూడదు. భగవంతుని అనుగ్రహం విశ్వాసంపై ఆధారపడి ఉంటుందని అంటారు. మనం సంపూర్ణ విశ్వాసంతో, భక్తితో భగవంతుడిని ప్రార్థిస్తే, ప్రతి కోరిక తప్పకుండా నెరవేరుతుంది.

శివ పురాణం ప్రకారం మనం ఏ మంత్రాన్ని జపించినా లేదా సంపూర్ణ క్రతువులతో భగవంతుని నామాన్ని జపించినా, ఆ తర్వాత దానం లేదా దక్షిణ ఇవ్వడం ఉత్తమం. లేకపోతే, ఆ పూజ లేదా మంత్రం వ్యర్థమవుతుంది. ఒక మంత్రాన్ని జపించిన తర్వాత మనం దక్షిణ ఇవ్వకపోతే జపం ఫలితాలు లభించవని అంటారు.

 

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks